మాష్టారు నిన్నటి పద్యరచన ఆలస్యముగా పోస్ట్ చేసాను. దయచేసి సమీక్షించ వలసినది
కాకిని, కావుకావుమని గట్టిగ కూయుచు హెచ్చరించెదన్ రాకడ మీకుచుట్టముల, శ్రాద్ధపుకర్మల పిండమున్ దినన్మీకు పితృండుగానగుదు, మిక్కిలి శ్రద్ధగ నాదుగుడ్లతో కోకిలగుడ్లనున్ పొదుగు కోమలమైన మనస్కురాలినిన్
ఏకాకిగ నుంటి విచట లోకులు పలుగాకులు గద లోపము లెంచన్ చీకాకులు మరచి మిగుల యాకాశము నెగిరి పోయి హాయిగ నుండన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,నిన్నటి మీ పద్యంపై నా స్పందన తెలియజేశాను.ఈనాటి మీ వృత్తం బాగుంది. అభినందనలు.*అక్కయ్యా,మీ పద్యం బాగుంది. అభినందనలు.
నల్లని రామచంద్రుడును, నల్లని కృష్ణుడు దైవముల్ కదా నల్లన మేఘముల్ దమము నల్లన కాటుక, భూమిగోళమున్, నల్లని కళ్ళ జోడు మరి నాటికి నేటికిన్ ఫ్యాషనే కదా నల్లని కాకినంచు నను నందరు హేళన చేయుటేలనో
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ రెండవ పద్యం కూడ బాగుంది. అభినందనలు.
గురు వర్యులు కంది శంకరయ్య గారికి నమస్సులు.ననున్+ అందరు= నను నందరుచంద్రమౌలి సూర్యనారాయణ గారి పద్యములో నాలుగవపాదములో నకారానికి యతి స్థానంలో ఉన్న అకారానికి యతి వేయవచ్చ దయచేసి తెలియజేయండి
రెడ్డి గారూ,ఆ యతి సమ్మతమే. అది అఖండయతి.
కాకి రంగు జూడ కాఱు న లుపెయైనదాని మేలు నరయ దండి గుండుశ్రాధ్ధ పిండ ముదిని స్వర్గ ము నకునం పుపితృ దేవ తలను బ్రియము తోడ
నాసందేహము నివృత్తి జేసి నందులకు గురువుగారికి కృతజ్ఞతలు.
సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
మనిషి తిట్లను తట్టుకోలేని ఒక కాకి మనోగతం..కాకి గోలయనగ కాఠిన్యమేలనో కారు నలుపననుచు కనవదేల పితర కర్మలందు పిలుతువు నన్నేల పిండమింత బెట్టి పిదప కినుక. కావు కావు మనుచు దేవుని దలచేము మనిషి తిట్టు నుండి మమ్ము గావ కావలేదు గనుక కాకి శాపమిదియె కావు తిట్ట పనులు కావు కావు.
మనిషి తిట్లను తట్టుకోలేని ఒక కాకి మనోగతం..కాకి గోలయనగ కాఠిన్యమేలనో కారు నలుపననుచు కనవదేల పితర కర్మలందు పిలుతువు నన్నేల పిండమింత బెట్టి పిదప కినుక. కావు కావు మనుచు దేవుని దలచేము మనిషి తిట్టు నుండి మమ్ము గావ కావలేదు, లేద కరుణయె యిసుమంత కావు నీవు మనిషి కావు కావు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు... చిన్న సవరణతో....కాకి గోల వినగ కాఠిన్యమనుటేల కారు నలుపననుచు కసరుటేల పితర కర్మలందు పిలుతువు నన్నేలపిండమింత బెట్టి పిదప కినుక.కావు కావు మనుచు దేవుని దలచేముమనిషి తిట్టు నుండి మమ్ము గావకావలేదు, లేద కరుణయె యిసుమంతకావు నీవు మనిషి కావు కావు.
హనుమచ్ఛాస్త్రి గారూ,నేను మీ మొదటి పద్యంలో ‘నలుపననుచు’ అన్నదానికి ‘నలుపటంచు’ అనే సవరణ సూచించాలనుకుని మరిచిపోయాను.
మాస్టరుగారూ ! సవరణ బాగుంది...ధన్యవాదములు..మీరు చూపిన సవరణతో... కాకి గోల వినగ కాఠిన్యమనుటేలకారు నలుపటంచు కసరుటేల పితర కర్మలందు పిలుతువు నన్నేలపిండమింత బెట్టి పిదప కినుక.కావు కావు మనుచు దేవుని దలచేముమనిషి తిట్టు నుండి మమ్ము గావకావలేదు, లేద కరుణయె యిసుమంతకావు నీవు మనిషి కావు కావు.
మాష్టారు నిన్నటి పద్యరచన ఆలస్యముగా పోస్ట్ చేసాను. దయచేసి సమీక్షించ వలసినది
రిప్లయితొలగించండికాకిని, కావుకావుమని గట్టిగ కూయుచు హెచ్చరించెదన్
రిప్లయితొలగించండిరాకడ మీకుచుట్టముల, శ్రాద్ధపుకర్మల పిండమున్ దినన్
మీకు పితృండుగానగుదు, మిక్కిలి శ్రద్ధగ నాదుగుడ్లతో
కోకిలగుడ్లనున్ పొదుగు కోమలమైన మనస్కురాలినిన్
ఏకాకిగ నుంటి విచట
రిప్లయితొలగించండిలోకులు పలుగాకులు గద లోపము లెంచన్
చీకాకులు మరచి మిగుల
యాకాశము నెగిరి పోయి హాయిగ నుండన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండినిన్నటి మీ పద్యంపై నా స్పందన తెలియజేశాను.
ఈనాటి మీ వృత్తం బాగుంది. అభినందనలు.
*
అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
నల్లని రామచంద్రుడును, నల్లని కృష్ణుడు దైవముల్ కదా
రిప్లయితొలగించండినల్లన మేఘముల్ దమము నల్లన కాటుక, భూమిగోళమున్,
నల్లని కళ్ళ జోడు మరి నాటికి నేటికిన్ ఫ్యాషనే కదా
నల్లని కాకినంచు నను నందరు హేళన చేయుటేలనో
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పద్యం కూడ బాగుంది. అభినందనలు.
గురు వర్యులు కంది శంకరయ్య గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిననున్+ అందరు= నను నందరు
చంద్రమౌలి సూర్యనారాయణ గారి పద్యములో నాలుగవపాదములో నకారానికి యతి స్థానంలో ఉన్న అకారానికి యతి వేయవచ్చ దయచేసి తెలియజేయండి
రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిఆ యతి సమ్మతమే. అది అఖండయతి.
కాకి రంగు జూడ కాఱు న లుపెయైన
రిప్లయితొలగించండిదాని మేలు నరయ దండి గుండు
శ్రాధ్ధ పిండ ముదిని స్వర్గ ము నకునం పు
పితృ దేవ తలను బ్రియము తోడ
నాసందేహము నివృత్తి జేసి నందులకు గురువుగారికి కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిసుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మనిషి తిట్లను తట్టుకోలేని ఒక కాకి మనోగతం..
రిప్లయితొలగించండికాకి గోలయనగ కాఠిన్యమేలనో
కారు నలుపననుచు కనవదేల
పితర కర్మలందు పిలుతువు నన్నేల
పిండమింత బెట్టి పిదప కినుక.
కావు కావు మనుచు దేవుని దలచేము
మనిషి తిట్టు నుండి మమ్ము గావ
కావలేదు గనుక కాకి శాపమిదియె
కావు తిట్ట పనులు కావు కావు.
మనిషి తిట్లను తట్టుకోలేని ఒక కాకి మనోగతం..
రిప్లయితొలగించండికాకి గోలయనగ కాఠిన్యమేలనో
కారు నలుపననుచు కనవదేల
పితర కర్మలందు పిలుతువు నన్నేల
పిండమింత బెట్టి పిదప కినుక.
కావు కావు మనుచు దేవుని దలచేము
మనిషి తిట్టు నుండి మమ్ము గావ
కావలేదు, లేద కరుణయె యిసుమంత
కావు నీవు మనిషి కావు కావు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు...
రిప్లయితొలగించండిచిన్న సవరణతో....
కాకి గోల వినగ కాఠిన్యమనుటేల
కారు నలుపననుచు కసరుటేల
పితర కర్మలందు పిలుతువు నన్నేల
పిండమింత బెట్టి పిదప కినుక.
కావు కావు మనుచు దేవుని దలచేము
మనిషి తిట్టు నుండి మమ్ము గావ
కావలేదు, లేద కరుణయె యిసుమంత
కావు నీవు మనిషి కావు కావు.
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినేను మీ మొదటి పద్యంలో ‘నలుపననుచు’ అన్నదానికి ‘నలుపటంచు’ అనే సవరణ సూచించాలనుకుని మరిచిపోయాను.
మాస్టరుగారూ ! సవరణ బాగుంది...ధన్యవాదములు..మీరు చూపిన సవరణతో...
రిప్లయితొలగించండికాకి గోల వినగ కాఠిన్యమనుటేల
కారు నలుపటంచు కసరుటేల
పితర కర్మలందు పిలుతువు నన్నేల
పిండమింత బెట్టి పిదప కినుక.
కావు కావు మనుచు దేవుని దలచేము
మనిషి తిట్టు నుండి మమ్ము గావ
కావలేదు, లేద కరుణయె యిసుమంత
కావు నీవు మనిషి కావు కావు.