ఒంటరి పయనం బెటకని జంటగ నింకెవరు లేక సాగెద వేలన్ మింటను మబ్బుల గుంపులుతుంటరి గాలుల ముసురు తూరుపు దెశకున్
అక్కయ్యా,బాగున్నది మీ పద్యం. అభినందనలు.‘ముసురు’ అన్నచోట గణదోషం. ‘ముసురులు/ ముసిరెను’ అనండి. దిశను దెశ అన్నారు.
పచ్చని చెట్లిరు వైపుల ముచ్చట గొలుపంగ ప్రొద్దు పొడిచెడి వేళన్వచ్చుచు పోవుచు జనులా స్వచ్చమగు ప్రకృతిని చూసి పరవశ మొందెన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ప్రాభాత సమయాన పల్లెపట్టున మంచు .......తెరచాటు సొగసిది తెల్లగాను నారికేళమ్ములు నదరుగా బాటకు .......నిరువైపులను నిల్చె నిలువుగానునింబ వృక్షము చాచి నిలువెల్ల చేతుల .......స్వాగత మనుచుండె చల్లగాను తొలియుషాంగన చూచె తూరుపు కొండను .......దినరాజు కోసమై తిన్నగాను పాదచారుల కిట సుప్రభాత మరయ పొలము పనులకు దివ్యమౌ ప్రొద్దు గనగ ప్రకృతికాంతామణీహాస ప్రభలు చూడ కోనసీమంతినీ శ్రావ్య గానము విన.
మిస్సన్న గారూ,ప్రకృతికాంతామణీహాస ప్రభలను చూపించి, కోనసీమంతినీ శ్రావ్య గానాన్ని వినిపించారు. హృద్యమైన పద్యం. అభినందనలు.
జగమిది మాయటంచు మది చక్కగ నమ్మిన వాడొకో! లతల్ఖగముల వృక్షరాశులను కానగ కానల సాగు వాడొ! లేనగవుల భామతోడ నిట నవ్వుల పంచు కొనంగ నేగునో!మొగమిటు త్రిప్పి చెప్పకనె ముందుగ నెట్టుల నూహఁ జేయుదున్?
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...ఉదయకాలమునందున నుల్లసిల్లెధవళవస్త్రమ్ము ధరింయించి ధరణిమాతయెదురుచూచుచు నుండెనా యినునికొఱకుసుందరమగు దృశ్యము కడు శోభ నిచ్చె.
లక్ష్మీదేవి గారూ,మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.‘మాయ యంచు’ అనండి. ‘మాయ + అటంచు = మాయ యటంచు’ అవుతుంది.*అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
కోన సీమ భామ కొబ్బరి చీరనుభానుడంత మెచ్చె భవ్య మనుచునింబ వృక్ష మొకటి నిగిడె దిష్టిని దీయకనుల విందు జేయు గాంచ రండు
ధన్యవాదాలు గురువుగారు!
సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
తెల్లని మంచున తడియుచునల్లన రహదారివెంట నాహ్లాదముగామెల్లగ నొకండు బోవుచుచల్లని భానోదయముకు స్వాగత మనుచున్
శైలజ గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.‘భాను + ఉదయము’ భానూదయము అవుతుంది. అలాగే భానోదయమునకు అని అనవలసింది.
సుప్రభాత నీహారిక సుందరంబు బాట కిరువైపు కొబ్బరి తోట సొబగు పచ్చదనముతో నిండిన ప్రకృతి సొగసు చిత్ర సౌందర్యమును గన చిత్ర మౌను.
గురుదేవులకు ధన్యవాదాలు.
ఒంటరి పయనం బెటకని
రిప్లయితొలగించండిజంటగ నింకెవరు లేక సాగెద వేలన్
మింటను మబ్బుల గుంపులు
తుంటరి గాలుల ముసురు తూరుపు దెశకున్
అక్కయ్యా,
రిప్లయితొలగించండిబాగున్నది మీ పద్యం. అభినందనలు.
‘ముసురు’ అన్నచోట గణదోషం. ‘ముసురులు/ ముసిరెను’ అనండి. దిశను దెశ అన్నారు.
పచ్చని చెట్లిరు వైపుల
రిప్లయితొలగించండిముచ్చట గొలుపంగ ప్రొద్దు పొడిచెడి వేళన్
వచ్చుచు పోవుచు జనులా
స్వచ్చమగు ప్రకృతిని చూసి పరవశ మొందెన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ప్రాభాత సమయాన పల్లెపట్టున మంచు
రిప్లయితొలగించండి.......తెరచాటు సొగసిది తెల్లగాను
నారికేళమ్ములు నదరుగా బాటకు
.......నిరువైపులను నిల్చె నిలువుగాను
నింబ వృక్షము చాచి నిలువెల్ల చేతుల
.......స్వాగత మనుచుండె చల్లగాను
తొలియుషాంగన చూచె తూరుపు కొండను
.......దినరాజు కోసమై తిన్నగాను
పాదచారుల కిట సుప్రభాత మరయ
పొలము పనులకు దివ్యమౌ ప్రొద్దు గనగ
ప్రకృతికాంతామణీహాస ప్రభలు చూడ
కోనసీమంతినీ శ్రావ్య గానము విన.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిప్రకృతికాంతామణీహాస ప్రభలను చూపించి, కోనసీమంతినీ శ్రావ్య గానాన్ని వినిపించారు. హృద్యమైన పద్యం. అభినందనలు.
జగమిది మాయటంచు మది చక్కగ నమ్మిన వాడొకో! లతల్
రిప్లయితొలగించండిఖగముల వృక్షరాశులను కానగ కానల సాగు వాడొ! లే
నగవుల భామతోడ నిట నవ్వుల పంచు కొనంగ నేగునో!
మొగమిటు త్రిప్పి చెప్పకనె ముందుగ నెట్టుల నూహఁ జేయుదున్?
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...
రిప్లయితొలగించండిఉదయకాలమునందున నుల్లసిల్లె
ధవళవస్త్రమ్ము ధరింయించి ధరణిమాత
యెదురుచూచుచు నుండెనా యినునికొఱకు
సుందరమగు దృశ్యము కడు శోభ నిచ్చె.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
‘మాయ యంచు’ అనండి. ‘మాయ + అటంచు = మాయ యటంచు’ అవుతుంది.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కోన సీమ భామ కొబ్బరి చీరను
రిప్లయితొలగించండిభానుడంత మెచ్చె భవ్య మనుచు
నింబ వృక్ష మొకటి నిగిడె దిష్టిని దీయ
కనుల విందు జేయు గాంచ రండు
ధన్యవాదాలు గురువుగారు!
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
తెల్లని మంచున తడియుచు
రిప్లయితొలగించండినల్లన రహదారివెంట నాహ్లాదముగా
మెల్లగ నొకండు బోవుచు
చల్లని భానోదయముకు స్వాగత మనుచున్
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘భాను + ఉదయము’ భానూదయము అవుతుంది. అలాగే భానోదయమునకు అని అనవలసింది.
సుప్రభాత నీహారిక సుందరంబు
రిప్లయితొలగించండిబాట కిరువైపు కొబ్బరి తోట సొబగు
పచ్చదనముతో నిండిన ప్రకృతి సొగసు
చిత్ర సౌందర్యమును గన చిత్ర మౌను.
గురుదేవులకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి