అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. నిన్నని చిత్రానికి మీ పద్యం బాగున్నది. ధన్యవాదాలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * శైలజ గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కుంచె బట్టిన చాలును కోటి కళల
రిప్లయితొలగించండియెదను కదిలిన భావాలు పొదువు కొనుచు
రంగు రంగుల రూపాలు రంగ రించి
చిత్ర కారుడు గీయును చెలువు మీర
చెలువు మీర =మిక్కిలి అందమైన
మనమున సంతసమ్ము ,నిల మాన్యతఁ బెక్కుగ చిత్రలేఖన
రిప్లయితొలగించండిమ్మొనరగఁ జేయు, క్రొత్తవగు నూహలఁ దేలుచు ప్రజ్ఞఁ జూపుచో
ధనము యశమ్ముఁ గూర్చునిది దక్షతఁ గల్గి మనోజ్ఞ దృశ్యముల్
కనుగొని వ్రాయు దీక్షనొక కానుక రూపున పొందు వారికిన్.
గురువుగారు,
నిన్నటి పద్యము
తాతకు తోడుగ నీడగఁ
దా తలి దండ్రుల కరముల దక్కిన వాడై
యాతనఁ దీర్చగలుగు తల
రాతనుఁ బొందిన మనుమడు రంజిలగ వలెన్.
ధనము యశమ్ము బదులు ఘనమగు కీర్తి గా సవరిస్తున్నాను.
రిప్లయితొలగించండిచిత్ర కారుడు గీ చెను జిత్రము లట
రిప్లయితొలగించండికుంచె తోడన జక్కగ కువలయాక్షి !
పోయి చూడుము నీవును బొమ్మ లన్ని
యొకటి మించిన దొకటిగా నుండె మిగుల
జరుగు బాటుకై యందరి పరుగు సాగె
రిప్లయితొలగించండికళల యన్నను కరువాయె కాంక్ష నేడు
చిత్ర లేఖనం స్వయముగ జేయ కున్న
మెచ్చి చేయూత నిచ్చుట మిగుల ఘనము
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
నిన్నని చిత్రానికి మీ పద్యం బాగున్నది. ధన్యవాదాలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పంచును తనలో భావము
రిప్లయితొలగించండికుంచెను కదిలించి తీర్చి గుండెలఁ జేరన్
గొంచెము సుఖమైన తనకు
నంచిత మగునా? కళలకు నాదరణమిదా?
విశ్వమందలి రూపాలు విస్మయముగ
రిప్లయితొలగించండిచిత్ర కారుడు వేసెను చెన్ను గాను
వన్నె లద్దుచు బొమ్మల నున్నతముగ
ప్రాణ మొసగుచు నుండెనా బ్రహ్మ గనుడు
కుంచెను చేతం బట్టుచు
రిప్లయితొలగించండిమంచిగ బొమ్మలనువేసి మన్నన పొందెన్
పంచగ గోరిన వారికి
నంచితమగు కళను నేర్పె నాహ్లాదముగా
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము....
రిప్లయితొలగించండిచిత్రకారుఁడు గీచెను చిత్రమైన
బొమ్మ లెన్నియో తిరమగు ముదముతోడ
కనుఁడు కొనుఁడయ్య యాతని కడుపునిండ
పిల్ల పాపలతోడఁ దాఁ జల్లగుండ.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కుంచే తమ కైదువుగా
రిప్లయితొలగించండివంచిన తల యెత్త కుండ వర్ణంబులతో
కొంచెము కొంచెము తామూ
హించిన బొమ్మలు మలచిరి యింపగురీతిన్