9, జులై 2014, బుధవారం

పద్యరచన - 615

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7 కామెంట్‌లు:

  1. విద్యార్థి సమాజములో...
    1. తండ్రి కేమొ డబ్బు తగలేయు వాడిగా
    తల్లి కట్న మరయు తనయు వలెను
    వాడి గురువు వాని గాడిదగా జూచు
    తోటి మిత్రుడతని తొత్తు జేయు

    2. ఉద్యమాల దిగెడు యూతంబుగా జేసి
    రాజకీయ మతని రచ్చ కీడ్చు
    కలసి చదువు కలికి కపివలె దిలకించు
    మనుజు వలెను జూచు మాన్యు లెవరు?

    రిప్లయితొలగించండి
  2. సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. తండ్రి భావించు చెడిపోవు తనయుడనుచు
    తల్లి వరకట్న మాశించు తనయు వలన
    వాడు కొందురు నేతలు బందు లందు
    గార్ధభమ్ముగ జూచును కడకు గురువు

    మమత జూపగ మగువయే మర్కటమని
    పరిహసించుచు బోవును పరువుదీసి
    సాటి వారలె వవ్వుచూ చవట యనగ
    ఎవ్వ రెరుగును విధ్యార్ధి నెదను కోత?

    ఓయి! విధ్యార్ధి! నినుచూచి నొక్కరైన
    రవ్వ జేయక నందురా దివ్వె వనుచు
    ఎవ్వరేమన్న నొవ్వక నెదగ వలెర
    వెలుగు పంచుతు జగమంత వెన్నెలల్లె

    రిప్లయితొలగించండి
  4. శైలజ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. తండ్రికి డబ్బును దండుగ చేయుచు
    తలకుమాసినయట్టి తనయుడుగను
    తల్లికి కట్నము దండిగ రాబట్ట
    క్రయ ధనంబు వలెనె గానుపించు
    రాజకీయములందు రాద్దాంత ములుసేయ
    నాయకుల కెపుడు సాయ మగును
    చదువు చెప్పు గురువు మదిలోన భావించు
    గాడితప్పుచునుండె గాడిదనుచు

    ప్రక్క చూపులు చూచుచు పట్టుబడిన
    మూతి త్రిప్పు నమ్మాయిలు కోతి వనుచు
    గౌరవించరు తనతోటి వారుగూడ
    గనుము విద్యార్ధి దీనమౌ గాధ యిదియె

    రిప్లయితొలగించండి

  6. తండ్రికి కనిపించు తప్పుడు విద్యార్థి
    డబ్బు తగులవేయు సుబ్బడి వలె
    తల్లికి కళ్ళలో ధనరాశి వలె దోచు
    కట్నమ్ము దోచెడు కనక బాబు
    నాయకమ్మన్యుల నయనాలలో వాడు
    జేలు కొట్టు వట్టి కీలుబొమ్మ
    పాఠాలు నేర్పెడి పంతులు గారికి
    నడ్డ గాడిదవలె నగుపడుగద

    చిలిపి పనుల తోడ చినదాని కగుపించ
    కోతి చేష్టలనుచు కొక్కిరించు
    లెక్కలోననిడడు ప్రక్క వాడునుగూడ
    పైవి లేని వాడు పైకి వచ్చు.





    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి