24, జులై 2014, గురువారం

పద్యరచన - 630

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

 1. మునికన్నియ సోయ గమున
  వనరుహనులు గోసి దెచ్చి భర్గుని గొలువన్
  కను విందగు చంద్ర ముఖిని
  మను వాడగ వచ్చు నంట మన్మధు డెవరో

  రిప్లయితొలగించండి
 2. గురువులు క్షమించాలి
  రెండవ పాదంలో " వనరుహములు " అని ఉండాలి

  రిప్లయితొలగించండి
 3. అక్కయ్య గారూ ! అది శివ పూజకు వెళ్తున్న పార్వతి చిత్రమనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 4. హిమవంతుని పుత్రికయే
  సుమములనే సజ్జనింపి సాగుచు నుండెన్
  డమరుక ధారికి తెల్లని
  సుమముగ తా మారిపోయి శొభిలుచుండెన్.

  రిప్లయితొలగించండి
 5. హిమవంతుని పుత్రికయే
  సుమములనే సజ్జనింపి సాగుచు నుండెన్
  డమరుక ధారికి పూజకు
  సుమముగ తా మారిపోయి శోభిలుచుండెన్.

  రిప్లయితొలగించండి
 6. పూల సజ్జ తోడ ముక్కంటిఁ గొల్వగా
  వెడలు చుండె గౌరి ప్రేమ విరియ
  చెన్నుఁ జూసి శివుడు చిక్కునా తన కంచు
  తలచు చుండె మదిన తపన తోడ

  రిప్లయితొలగించండి
 7. అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  గోలి వారు పేర్కొన్నట్టు అది పార్వతి చిత్రం.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. చిత్ర మందున పార్వతి చిత్రముగను
  మౌని కన్యక వోలెను గాని పించి
  పూల సజ్జను జేబూని పోవు చుండె
  పూజ జేయంగ శివునకు బూల తోడ

  రిప్లయితొలగించండి
 9. అపురూపమైన శర్వుని
  తపమునకు సుమముల దీప తైలము లిడితా
  నుపవాస దీక్షఁ బట్టుచు
  నపర్ణ పరమేశుఁ బతిగ నంద దలంచెన్

  రిప్లయితొలగించండి
 10. అందము చిందుచున్న లలితాంగి కరమ్ముల యందు పళ్ళెరా
  లందున పూలు చెందరము హారతి దీపము వెల్గుచుండగా
  ముందుకు వెళ్ళుచుండె శివపూజ నడర్చగ మందహాసియై
  పొందగ నీలకంధరుని పోడిమి తోడుత నామె పార్వతే!

  రిప్లయితొలగించండి
 11. క్షమించాలి పార్వతి అన్నసంగతి నాకు తట్టలేది గురువులకు సోదరులు శ్రీ గోలివారికీ ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 12. సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. మాస్టరుగారూ ! చిన్న సవరణతో...

  హిమవంతుని పుత్రికయే
  సుమములనే సజ్జనింపి సాగుచు నుండెన్
  డమరుక ధారుని పూజకు
  సుమముగ నుమ మారిపోయి శోభిలుచుండెన్.

  రిప్లయితొలగించండి
 14. ఆచార్యా! ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులుంటే సరిదిద్దండి, వ్యవహారమే తప్పైతే తొలగించండి

  గిరితనయ ఏతెంచె ఘోరతపంబొనర్చ
  లతలన్నీ విరబూసె లోకకళ్యాణంబు దలంచి
  బసవన్న నర్తించె ధవళకాంతులీనుచున్
  శివుడైన పరవశుండు కాడా ముగ్ధమోహన జూడ

  రిప్లయితొలగించండి
 15. అబ్దుల్లా గారూ,
  చాలా సంతోషం. మీ ప్రయత్నం ప్రశంసార్హం. మీరు ఛందస్సు తెలుసుకొని కొద్దిపాటి కృషిచేస్తే చక్కని పద్యాలు వ్రాయగలరు. అందుకు తగ్గ భావవ్యక్తీకరణ, పదసంపద మీకున్నవి. తప్పక ప్రయత్నించండి..
  మీ వచన కవితకు నేనిచ్చిన ఛందోరూపం (తేటగీతి)...

  గిరితనయ తప మొనరించ నరుగుదెంచె
  లతలు విరబుసె లోకకళ్యాణ మెంచి
  బసవ డాడెను ధవళప్రభలు వెలుంగ
  శివుడు పరవశుఁ డైపోడె చేరి యుమను.

  రిప్లయితొలగించండి
 16. మదినిడుకొని శివరూపము
  కదిలెను పార్వతి కరములఁ గైకొని సుమముల్
  చెదరిని సంకల్పముతో
  మదనాస్త్రపుధాటికోర్వ, మనువాడుమనన్

  రిప్లయితొలగించండి
 17. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. అబ్దుల్లా గారి ప్రయత్నము ప్రశంస నీయము. గురువుగారన్నట్లు మీరు ప్రయత్నిస్తే రెండు రోజులు చాలు

  రిప్లయితొలగించండి
 19. వయ్యారముగా నిల్చిన
  నియ్యింతి వనములలో నదెట్టుల చేరే
  నియ్యామని శోభల తా
  నుయ్యాలల నూగ వేచియున్నదొకొ సుమీ!

  రిప్లయితొలగించండి
 20. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘చేరే నియ్యామని’...?

  రిప్లయితొలగించండి
 21. గురువుగారు,
  మన్నించండి. సవరించినాను.


  వయ్యారముగా నిల్చిన
  నియ్యింతి వనములలో నదెటులొచ్చినదో?
  యియ్యామని శోభల తా
  నుయ్యాలల నూగ వేచియున్నదొకొ సుమీ!

  రిప్లయితొలగించండి