17, జులై 2014, గురువారం

సమస్యా పూరణం – 1476 (పుట్టినవాఁ డెవఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై.

34 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  మానసిక ప్రశాంతత,
  శారీరక స్వస్థత మృగ్యమై
  మిత్రులకు బహుకాలంగా దూరమై
  చాలా చాలా రోజుల తరువాత మిత్రులందరినీ
  కలుసుకుంటున్నందులకు మహదానందముగా నున్నది !

  "వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాని నరో2పరాణి
  తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ! "
  -భగవద్గీత 2-22-

  01)
  ___________________________

  ఇట్టను టెంత యసత్యము
  "పుట్టిన వాఁడెవఁడు గిట్టఁ - బోఁడీ ధరపై " !
  పుట్టిన , గిట్టుట దప్పునె
  పుట్టము విడిచిన పగిదిని - భూరికి నైనన్ ?
  ___________________________
  ఇట్టు = ఇట్లు
  పుట్టము = వస్త్ర్రము
  భూరి = విష్ణువు

  రిప్లయితొలగించండి
 2. మృత్యుంజయునికైనా మృత్యువు తప్పదు !

  02)
  ___________________________

  ఒట్టిదె ! భూరికి నైనను
  పుట్టిన , దప్పదు పుడమిని - పోకడ నొందన్ !
  గట్టిగ యన రా దిట్లని
  "పుట్టిన వాఁడెవఁడు గిట్టఁ - బోఁడీ ధరపై " !
  ___________________________
  ఒట్టు = నిజము
  భూరి = మృత్యుంజయుడు(శివుడు)
  పోకడ = మరణము

  రిప్లయితొలగించండి
 3. పుట్టుట గిట్టుట కొరకని
  పుట్టిన వాడెవడు , గిట్టబోడీ ధరపై
  గట్టిగ నమ్ముచు దనుజులు
  పుట్టెడు వరములను పొంది పోరగ సురలన్

  రిప్లయితొలగించండి
 4. కట్టిన బాణికి వాణికి
  పుట్టిన వాఁడెవఁడు? గిట్టఁ బోఁడీ ధరపై
  అట్టి మహగాయక, రస
  స్రష్ట, యశఃకాయ, ఘంటసాల, సుగాత్రా !

  రిప్లయితొలగించండి
 5. కిశొర్జీ ! నమస్తే ! చాలాకాలము తరువాత మిమ్మల్ని కలుస్తున్నందుకు ఆనందంగా ఉన్నది.

  రిప్లయితొలగించండి
 6. పుట్టెడు బాధలువొందెడు
  మట్టిన నివసింఛు బీద మానవులను తా
  గట్టిగ దరిజేర్చుటకై
  పుట్టిన వాఁడెవఁడు గిట్టఁ బోఁడీ ధరపై .

  రిప్లయితొలగించండి
 7. పుట్టుట గిట్టుట కొరకే
  పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై?
  యెట్టి ప్రయత్నము చేసిన
  మట్టిన తప్పదు కలియుట మనిషెవడైనన్

  రిప్లయితొలగించండి
 8. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  పుట్టుక లేకను తానై
  పుట్టిన వాడెవడు?, గిట్టబోడీ ధరపై
  పుట్టించును, పాలించును
  గిట్టిoచును ప్రాణికోటి క్రీడించుచు తాన్

  రిప్లయితొలగించండి
 9. మల్లెల వారి పూరణలు

  గట్టి ప్రభులును కవులును
  గిట్టిన వారైన వారు కీర్తిని మనరే
  పుట్టి యశమునంది వెలుగ
  పుట్టిన వాడెవడు గిట్టబోడీధరపై

  పుట్టుట గిట్టుట మధ్యను
  గట్టిగ జనహితము గూర్చి కాంచిన యశమున్
  ఎట్టుల మరతురు వానిని
  పుట్టిన వాడెవడు గిట్టబోడీ ధరపై

  పుట్టియు గిట్టును చెదలవి
  పుట్టల, వానిని తలతురె భూమిని నెందున్
  దట్టపు యశమును పొందిన
  పుట్టిన వాడెవడు గిట్టబోడీ ధరపై

  పుట్టిన వాడిలనేదో
  దట్టపు యశమును మనియను ధన్యుడు కాగా
  పుట్టుక శాశ్వత మగుగా
  పుట్టిన వాడెవడు గిట్టబోడీ ధరపై

  రిప్లయితొలగించండి
 10. వసంత కిశోర్ గారూ,
  మీ పునరాగమనం మా కందరికికూడా మహదానందాన్ని కలిగించింది. చాలా సంతొషం!
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘ఒట్టిది’ అన్నారు. ‘వట్టిది’ సాధురూపం.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉంది. మంచి పూరణ. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  దీనజనోద్ధారకులు చిరంజీవులన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మనిషి + ఎవడు’ అన్నప్పుడు సంధి లేదు. ‘మనుజు డెవండున్’ అనండి.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. టైపాటు కావచ్చు. ‘ప్రభువులును’ అంటే సరి.

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. అట్టి యమర లోకంబున
  పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ, ధరపై
  పుట్టిన మానవు లందరు
  గిట్టుట సత్యమ్ము వారి కీర్తియె మిగులున్.

  రిప్లయితొలగించండి
 13. చెట్టంత గురువు లడిగిరి
  పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై.
  గట్టిగ బలికెను శిష్యుడు
  గుట్టను గల హనుమ తమకు గుర్తుకురాడా?

  రిప్లయితొలగించండి
 14. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. మట్టిని కలవక మనునా
  పుట్టిన వాడెవడు ? గిట్టబోడీ ధరపై
  పట్టుకు బోవగ యశమును
  గుట్టుగ నుండెదరు గుండె కుహరము లోనన్

  రిప్లయితొలగించండి
 16. పట్టము గట్టిన జనులకు
  చుట్టముగా నుండి యేలి చూడామణియై
  దిట్ట యనన్ రాముడిగా
  పుట్టిన వాడెవడు గిట్టబోడీ ధరపై!

  రిప్లయితొలగించండి
 17. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  (మీ పూర్తి పేరు టైప్ చేయడానికి బద్దకిస్తున్నాను. ఏమీ అనుకోరు కదా!)
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. నిన్నటి పూరణ:
  లేమా? విడువగ లేమా?
  కామ క్రోధములు, తెలియగా సద్గుణముల్
  మీ మా కందరకు భువిని
  సేమంబుల గూర్చి కీర్తి స్థిరముగ నుంచున్

  రిప్లయితొలగించండి
 19. సహదేవుడు గారూ,
  నిన్నటి సమస్యకు ఈనాటి మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. శాస్త్రీజీ ! ధన్యవాదములు !
  శంకరార్యా ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 21. శంకరార్యా !
  నా ఉద్దేశ్యం

  ఒట్టు +ఇదె = ఒట్టిదె

  *****
  వట్టిది : ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.)
  [తెలుఁగు]ఖాళీయైనది, అసత్యము.
  [తమిళము]పొయ్‌.
  [కన్నడము]ఱొళ్ళు, అసత్య, పొల్లు.
  *****
  ఒట్టు : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు)

  ఎవరైనా ఏదైనా చెప్పి అది నిజమని నొక్కి చెప్పడానికి వాడే నిరూపణోపయోగ పదం.

  *****

  రిప్లయితొలగించండి
 22. మిత్రులు కంది శంకరయ్యగారికి, మిత్రులు వసంతకిశోర్‍గారికి, సుకవి పండిత మితులందఱికి వందనములు.

  తుట్టతుద వరకు సుఖముగ
  నెట్టి విధముగాను బ్రదుక నెంచియు, నడుమన్,
  "బిట్టుగ బ్రదికెడు యోచన
  పుట్టినవాఁ" డెవఁడు గిట్టఁబోఁడీ ధరపై!

  (వృద్ధుఁడై మరణించువరకు సుఖజీవనము గడపఁదలఁచినవాఁడు, నడుమనే మరణించవలెనని యనుకోఁబోఁడని యాశయము)

  రిప్లయితొలగించండి
 23. వసంత కిశోర్ గారూ,
  మన్నించండి. నేను ‘వట్టిదె’ అనుకున్నా... మీ వివరణతో సందేహం తీరింది.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. కిశోర మహోదయా మీ పునరాగమనముతో బ్లాగుకు వసంతాగమనం జరిగింది.

  రిప్లయితొలగించండి
 25. గట్టిగ మేలొనరించుచు
  తట్టుచు భుజములను పరహితార్థము సతమున్
  మెట్టిన ధన్యుం డీవిధి
  పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై.

  రిప్లయితొలగించండి
 26. మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !

  అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  రిప్లయితొలగించండి
 27. మిత్రులు మధుసూదన్ గారికి అభివందనములు !

  రిప్లయితొలగించండి
 28. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 29. పట్టును వదలక జనులకు
  దిట్టగు సాయము సలుపుచు దీనులకొఱకి
  ప్పట్టున బ్రదికెడు వానిగ
  పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై.

  రిప్లయితొలగించండి
 30. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 31. వట్టిది పుట్టుట గిట్టుట
  కట్టెలలో కాలి పోవు కాయమ్మనుచున్
  గట్టిగ చిదాగ్ని లోనన్
  పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ
  ధరపై

  రిప్లయితొలగించండి
 32. పుట్టగ తల్లికి తండ్రికి
  గిట్టక తప్పదు నరవర కిరికిరి చేయన్...
  గట్టిగ కీరితి కడుపున
  పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై😊

  రిప్లయితొలగించండి


 33. గిట్టక మానడు సుదతీ
  పుట్టినవాఁ డెవఁడు, గిట్టఁబోఁ డీ ధరపై,
  పుట్టని వాడు జిలేబీ
  పుట్టుక గిట్టుకలు విష్ణువుని మాయ గనన్


  జిలేబి

  రిప్లయితొలగించండి