20, జులై 2014, ఆదివారం

పద్యరచన - 626

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. బోనము నెత్తి నెత్తుకొని ముద్దుల చిన్నది యమ్మవారి పై
  మానసమందు నమ్మికయు భక్తిని శ్రద్ధను గల్గియున్న య
  ద్దానిని యెల్లవేళలను తా కరుణా మయి చల్లగన్ గనున్
  దీనుల రక్షణన్ సలుపు దీవెన లిచ్చుచు గావునెల్లరన్

  రిప్లయితొలగించండి
 2. బోనము దెచ్చితి నీకని
  జ్ఞానము నాకొసగు మమ్మ జ్ఞానేశ్వరి వై
  మానస మందున నినుగని
  గానము చేయంగ లేను గౌరీ నీపై

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. ఆషాఢ మ్మరుదెంచ వచ్చితివి నిండౌ ప్రేమతో మాకు సం-
  తోషమ్మీయగ పుట్టినింటికిని తోడ్తో దెచ్చుచున్ సంపదల్
  శేషమ్మింతయు లేక మా యిడుమలన్ చీకట్ల పో ద్రోలవే
  హే షట్పత్రసరోరుహస్థిత! పరా! హ్రీంకారి! బోనాలివే.

  రిప్లయితొలగించండి
 5. మిస్సన్న గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. వచ్చె నాషాడ మాసము తెచ్చెశోభ
  నమ్మ వారికి బోనాలు కొమ్మ లెల్ల
  భక్తితోడ సమర్పించి పరవశముతో
  జరుపుకొను పండుగనుగని జనము మురిసె

  రిప్లయితొలగించండి
 7. మానసమున నిన్ను దలఁచి
  బోనమ్ములఁ దెచ్చిమిగులఁ బూజించగ మా
  దీనత తొలగించి భువిని
  వానలు గురిపించ వమ్మ! వాగులు దొరలన్!

  రిప్లయితొలగించండి
 8. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. ప్రతియేడు బోనాల పండుగ సందడి
  ఆషాఢ మాసాననరుగుదెంచు
  ఎల్లమ్మ పోచమ్మ యెల్ల దేవతలకు
  పూజ గావింతుము బోనమిడుచు
  పెద్దలు పిల్లలు పేదలు ధనికులు
  భేదము లేకుండ మోదముగను
  తప్పెట్ల మ్రోతతో తరలి వచ్చెదరంత
  భక్తితో తల్లికి బలులిడుదురు

  అమ్మవారుగాచి యందరిఁ జల్లగ
  దేశ ప్రజల కెల్ల దీవెనలిడు
  వర్ష ము కురిపించి పంటల పండించు
  చిరునగవులనింట సిరులు కురియు

  రిప్లయితొలగించండి
 10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. చిన్ని మనమున భక్తిగ చేరి కొలుచు
  పాపఁ గనినట్టి వేళల పరమశివుడు
  కరిగి నీరౌచు కురిపించు కానుకలను
  ముద్దు మూటలఁ గట్టెడు ముఖముఁ జూచి.

  రిప్లయితొలగించండి
 12. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి