మాకు సమస్యలనిచ్చి ఆనందింపజేయు మీకు సమస్యలనీయకుండా భగవంతుడు ఆనందీంపజేయాలని కోరుకొనుచున్నాను.
కోరుచు నీ సమస్యలను గొప్పగ నిచ్చుచు మీరు మాకు నే మారక రోజు రోజు మరి చక్కటి మార్గము చూపుచుంటిరే ! కోరక నే సమస్యలను కుప్పలగిఛ్ఛుచు నున్న దేవుడే మారుచు బాధ దీర్చు నొకమార్గము మీకిక జూపకుండునా !
వందనమ్మిదె గురుదేవ పండితార్య చింత లన్నియు దీర్చునా సిరుల తల్లి సకల సౌఖ్యము లిచ్చును శారదాంబ ఖ్యాతి నందించు కవికుల జ్యోతి మీరు జన్మదినశుభా కాంక్షలు శంకరార్య!
శుభాకాంక్షలు తెలుపుతూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆత్మీయవాక్కులను అందించిన కవిమిత్రులు... ఊకదంపుడు గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, వసంత కిశోర్ గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారికి, శైలజ గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, రెండుచింతల రామకృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.
శ్రీ కంది శంకరయ్య గురువారుల 65వ, జన్మదిన శుభాకాంక్షలతో
గురువర శ్రీ శంకరయా! తరియించును నీదు జన్మ తప్పక కవులున్ అరయుదురు, తెలుగు భాషకు ధర మీరలు జేయు సేవ ధన్యత జెందున్. చింతించకు మనమున నీ వంతలు కడదేరు రోజు వచ్చును లక్ష్మీ కాంతుడు నిను కరుణించును అంతా క్షేమంబు జరుగు నార్యా! కవిశ్రీ !
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!! సాధించినది సున్నా అనడం మహాకాంక్షలున్నవారికే చెల్లు. మనకు నిత్యదర్శినియైన శంకరాభరణం చిన్న సాధానా? శూన్యమే పరిపూర్ణతకు క్రిందిమెట్టంటారు ! మీ ప్రియ బంధుబాంధవులందరి ప్రేమాభిమనాలు ఉండనే ఉన్నాయి, కొన్ని స్పష్టంగా మరికొన్ని చాటున దాగియుంటాయి. ఆ తెరతీయగానే శుభం. అతిశీఘ్రంగా మీకు ఆ సంతోషం లభ్యమౌతుందని ఆశిస్తూ, అందుకై ఆ దేవదేవుని ప్రార్థిస్తూ,
గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగురువులకు పుట్టినరోజు శుభాకాంక్షలు
రిప్లయితొలగించండివ్ర్ర్లైనంత తొందరలో మనవడితో ఆడుకుంటూ కుటుంబ సభ్యుల మధ్య హాయిగా ఉండాలని దీవిస్తూ అక్క
గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండికొంచెం ఆలస్యంగా !
గురువుగారికి నమస్సులు, జన్మదిన శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండిక్షమించాలి వీలైనంత తొందరలో అని ఉండాలి
రిప్లయితొలగించండిపూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగురువుగారికి ప్రణమిల్లుతూ,..జన్మదిన శుభాకాంక్షలు..
రిప్లయితొలగించండిమాస్టరుగారూ ! మీకు జన్మదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమాకు సమస్యలనిచ్చి ఆనందింపజేయు మీకు సమస్యలనీయకుండా భగవంతుడు ఆనందీంపజేయాలని కోరుకొనుచున్నాను.
కోరుచు నీ సమస్యలను గొప్పగ నిచ్చుచు మీరు మాకు నే
మారక రోజు రోజు మరి చక్కటి మార్గము చూపుచుంటిరే !
కోరక నే సమస్యలను కుప్పలగిఛ్ఛుచు నున్న దేవుడే
మారుచు బాధ దీర్చు నొకమార్గము మీకిక జూపకుండునా !
గురువర్యులు కంది శంకరయ్య గారికి జన్మదిన హార్దిక శుభాకాంక్షలు:-
రిప్లయితొలగించండికలత వహించ వద్దు తమకండగ శిష్యుల ముండినాము మీ
తలపుల నేనిరాశ దరి దాపుల చేరగ నీయ వద్దు మీ
గలగల నవ్వులన్ మదిని గాయము లన్నియు మాని మీకికన్
కలుగు శుభమ్ము మిమ్ములను గావును జానకి రాము లెన్నడున్
గురువు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు!!!
రిప్లయితొలగించండికొడుకు తోడు నీడ కోరుచుండగ హృది
రిప్లయితొలగించండితల్లడిల్లుచుండె తండ్రి మనసు
ముద్దుమనుమడిచ్చు ముత్యాల నవ్వులు
మదిన మెదలి సతము ముదము గల్గ
ఒంటి జీవితమున నోరిము గోల్పోయి
సాగుచుంటి వృద్ధ సదన మందు
చిన్న తనము నుండి మిన్నగా బెంచిన
కన్న కొడుకు ప్రేమ గాంచు టెపుడొ?
వందనమ్మిదె గురుదేవ పండితార్య
రిప్లయితొలగించండిచింత లన్నియు దీర్చునా సిరుల తల్లి
సకల సౌఖ్యము లిచ్చును శారదాంబ
ఖ్యాతి నందించు కవికుల జ్యోతి మీరు
జన్మదినశుభా కాంక్షలు శంకరార్య!
శుభాకాంక్షలు తెలుపుతూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆత్మీయవాక్కులను అందించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిఊకదంపుడు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
వసంత కిశోర్ గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారికి,
శైలజ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
రెండుచింతల రామకృష్ణమూర్తి గారికి
ధన్యవాదాలు.
శ్రీ కంది శంకరయ్య గురువారుల 65వ, జన్మదిన శుభాకాంక్షలతో
రిప్లయితొలగించండిగురువర శ్రీ శంకరయా!
తరియించును నీదు జన్మ తప్పక కవులున్
అరయుదురు, తెలుగు భాషకు
ధర మీరలు జేయు సేవ ధన్యత జెందున్.
చింతించకు మనమున నీ
వంతలు కడదేరు రోజు వచ్చును లక్ష్మీ
కాంతుడు నిను కరుణించును
అంతా క్షేమంబు జరుగు నార్యా! కవిశ్రీ !
శ్రీ శంకరయ్య గారు,
రిప్లయితొలగించండిహార్దిక జన్మదిన శుభాకాంక్షలు!! సాధించినది సున్నా అనడం మహాకాంక్షలున్నవారికే చెల్లు. మనకు నిత్యదర్శినియైన శంకరాభరణం చిన్న సాధానా? శూన్యమే పరిపూర్ణతకు క్రిందిమెట్టంటారు ! మీ ప్రియ బంధుబాంధవులందరి ప్రేమాభిమనాలు ఉండనే ఉన్నాయి, కొన్ని స్పష్టంగా మరికొన్ని చాటున దాగియుంటాయి. ఆ తెరతీయగానే శుభం. అతిశీఘ్రంగా మీకు ఆ సంతోషం లభ్యమౌతుందని ఆశిస్తూ, అందుకై ఆ దేవదేవుని ప్రార్థిస్తూ,
నమస్సులతో
మీ
చంద్రమౌళీ
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండియం.ఆర్. చంద్రమౌళి గారూ,
ధన్యవాదాలు.
కంది కులాగ్రణీ తెనుగు కైత లతా పరిపోషణప్రియా
రిప్లయితొలగించండిసందియమేల వాణి తమ చల్లని తల్లియు దండ్రి తోడునౌ
బందుగు లందురా తమకు పండితులున్ బుధులున్ కవీశ్వరుల్
సందడి జేయు చుట్టములు చాలరె చింతను వీడి సాగరే.
*****************************************
కంది పాల్కడలిని వెల్గు ఘన శశికిని
మంచి మనసున్న మనిషికి మించు కవికి
శంకరాభరణము పాలి స్థపతి కివియె
జన్మదిన శుభాకాంక్షలు శంకరునకు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
పూజ్య గురుదేవులకు నమస్కారములు.
రిప్లయితొలగించండితమకు 64 వ జన్మదిన శుభాకాంక్షలు.
పులకల కవితా చంద్రిక
నెలవౌ బ్లాగును నిరతము నెరిపెడు సుకవీ!
కలతలు వీడును త్వరలో
కలకాలము మీదు కీర్తి గౌరవ మందున్!
పుట్టితి వట యీ రోజున
రిప్లయితొలగించండిపుట్టిన శ్రీ శంకరుండ !పూర్ణిమ చంద్రున్
బిట్టుగ బోలుచు వెలుగుము
నట్టింటను దిరుగు చుండి నలుగురి లోనన్
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.
(ఈమధ్య బ్లాగులో మీ పద్యాలు కనిపించడం లేదు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుదేవులు శ్రీ కంది శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగురువు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండిపద్య రూపంలో కూడ చెప్పుదామని ఆలస్యం చేసినాను.
వ్రాయటానికి ప్రయత్నిస్తాను.
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమాజేటి సుమలత గారూ,
ధన్యవాదాలు.
(ఈమధ్య బ్లాగులో మీ పద్యాలు కనిపించడం లేదు.)
కంది శంకరయ్య కవి గురువర్యుల
రిప్లయితొలగించండిజన్మ దినము మాకు సంతసమ్ము.
శిష్యులందరెంతొ స్నేహభావమ్ముతో
పద్యములను వ్రాసి పంపినారు.
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.