12, జులై 2014, శనివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 27

అచ్చ తెలుఁగు
రామాయణము-
చం.    పనివడి దిట్టలై (పరఁగ వచ్చిరి వీటికి వారు రాచ)చె
ల్వొనరఁగ నంత రా(కొమరు, లొక్కొకరుండును గొప్ప వేడ్కఁ) బెం
డ్లి నగుదు నేనె బల్(గొనబు నేర్పరి పెండిలికూఁతు రన్న)నం
చనుకొని రెచ్చునై (పొరలి హాళియుఁ గోరిక పుట్టుచుండఁ)గన్. (౪౨)

భారతము-
గీ.       పరఁగ వచ్చిరి వీటికి వారు రాచ
కొమరు, లొక్కొకరుండును; గొప్ప వేడ్కఁ
గొనబు నేర్పరి పెండిలికూఁతు రన్న
పొరలి హాళియుఁ గోరిక పుట్టుచుండ. (౪౨)

టీక- పెండిలికూఁతురన్న = (రా) సీత యనినచో, (భా) ద్రౌపది కగ్రజుఁడు. [భారతమునఁ గ్రిందిపద్యమున కన్వయము]; పనివడి = ఎక్కువ; గొనబు = మనోజ్ఞమగు.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి