30, జులై 2014, బుధవారం

పద్యరచన - 636 (పెరుగన్నము)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు: 1. పెరుగన్నము నిమ్మ ఊరగాయ
  ఓహో నోరూరించే మీ కప్పన్నము ,
  'పెరుగణము'నిమ్మ కందనగాయ
  ఓహో మది పలికించే కావ్యాన్నము!

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  పెరుగన్నము+ఊరగాయ = అమృతము :

  01)
  ______________________________

  వేడి యన్నము నందున - పెరుగు వైచి
  పోపు దినుసుల ఘుమ ఘుమ - పోపుపెట్టి
  ఊరగాయను లేదేని - కూర నైన
  నంజుకొనుచును దిన్నచో - నమృత సమము !
  ______________________________

  రిప్లయితొలగించండి
 3. పెరుగన్నము తిన్నావా
  పెరుగును చలువే యొడలున, పిసరంతైనన్
  మరి నిమ్మ యూరగాయను
  మరువక నూనంజుకున్న మజ్జారే ! వాహ్ !

  రిప్లయితొలగించండి
 4. తరణి కలుగ జేయు తాపముఁ దీర్చగా
  వేడి యన్నమందు పెరుగు కలిపి
  తిరుగ బోత వేసి తీరైన దినుసుల
  నారగించ వలయు నర్థి తోడ

  రిప్లయితొలగించండి
 5. కాన బడుచుండె నచ్చట కాంత !చూడు
  పెరుగు కలిపిన యన్నము ,పిలువ బడును
  వరల దధ్యో జనంబని ,కరము రుచిని
  గలుగ జేయును జిహ్వకు ,కడుపు నింపు

  రిప్లయితొలగించండి
 6. వేసవి సమయమందున వేడిఁ దీర్చ
  వేడి యన్న మందున గడ్డ పెరుగు వేసి
  తిరుగ బోతకలిపి మంచి తీరు గాను
  నిమ్మ కాయ పచ్చడి కడు యింపుఁ గూర్చ
  గ్రోల వలయును నిత్యము కూర తృప్తి

  రిప్లయితొలగించండి
 7. జిలేబీ గారూ,
  _/\_
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. పెద్దలకు నమస్కారం.
  ఈరోజు నాలుగున్నరకనుకుంటా తిరుపతి వారి దర్శినిలో మన కవిమిత్రులు రాంభొట్ల పార్వతీశశర్మ గారి అష్టావధానం ప్రసారమైంది. నాకు తెలియదు. చివర్లో పెట్టినాను.
  వారికి అభినందనలు. ఇది ఎప్పుడు జరిగినదని కానీ, మరలా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ప్రసారమయితాయని కానీ దర్శిని వారెప్పటి మాదిరే చెప్పలేదు.

  రిప్లయితొలగించండి
 9. బ్రద్దలుగ నిమ్మ పచ్చడి
  ముద్దుగ పెరుగన్న మందు భోక్తవ్యమిలన్
  పెద్దలు పిల్లలు నెవరును
  వద్దనకను రుచినిమరగి పలుమార్లుతినున్

  రిప్లయితొలగించండి
 10. బిర బిర నోరూరు గదే!
  పెరుగన్నము నిమ్మ బద్ద పిసరంతైనన్
  సరిగూడగ ,దేవతలన్
  మురిపించునిదే ప్రసాదముగ నర్పించన్ !

  రిప్లయితొలగించండి