7, జులై 2014, సోమవారం

సమస్యా పూరణం – 1466 (వానలు రైతులకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
వానలు రైతులకు దుఃఖభాజనము లగున్.

26 కామెంట్‌లు:

 1. వానలు సకాల మైనను
  భోనము నిచ్చును జనులకు మోదము గూర్చన్!
  మానిన,యకాల మైనను
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్!  రిప్లయితొలగించండి
 2. వానలు లేకున్న రైతులు
  నానా తిప్పలు బడుచును నారును వేయున్
  చేనులు కోసెడి తరుణము
  వానలు రైతులకు దు:ఖ భాజనము లగున్

  రిప్లయితొలగించండి
 3. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అక్కయ్యా,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘వానలు కురువక రైతులు’ అనండి.

  రిప్లయితొలగించండి
 4. నానాటికి కఱవు పెరిగి
  నా నాడెంతయును క్రుంగె ;నమ్ముము స్వామీ!
  యీనాటికైన కుఱవని
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్.

  రిప్లయితొలగించండి
 5. ఊనపరిస్థితి,ఋణములు
  చేనారగ,కళ్ళుచెమ్మజేయగ,విద్యుత్
  హీనత, వేచినను పడని
  వానలు రైతులకు దు:ఖ భాజనము లగున్

  రిప్లయితొలగించండి
 6. వానల కాలము కురిసిన
  వానలు మితిమీరి పడిన పంటలు పాడౌ
  వానలు కురవక పోయిన
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్.

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. నానా కష్టము జెందుచు
  నానాట్లను వేసి వేచె నాముసురులకై
  నానాటికిని గనపడని
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్.

  రిప్లయితొలగించండి
 9. గోనెల దాచిన విత్తులు
  ప్రాణ సమానముగ నాటి పంటలు గోరన్
  మానని గాడుపు చాలని
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్.

  రిప్లయితొలగించండి
 10. చేనున విత్తులు నాటుచు
  పూనికతో పనులఁజేసి పొలమున పైరుల్
  గానగఁ కురుసిన చిత్తడి
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్.

  రిప్లయితొలగించండి
 11. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  వానలు కురియగ వరదలు
  ప్రాణము ధన నష్టములును,వానలు లేకన్
  చేనులు బీటలు వారగ
  వానలు రైతులకు దుఃఖ భాజనము లగున్

  రిప్లయితొలగించండి
 13. మల్లెల వారి పూరణలు

  వానలు పంటను నిచ్చును
  వానయె పంటలను గాలి వానయు గూల్చున్
  వానయకాలము కురవగ
  వానలు రైతులకు దుఃఖ భాజనములగన్

  కానక వానలనిపుడీ
  చేనులు బీటలు వడగను, చేటును గలిగెన్
  దీనమునయ్యెను. "జయ" లో
  వానలు రైతులకు దుఃఖ భాజనములగున్

  రిప్లయితొలగించండి
 14. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మల్లెల వారిపూరణ
  వానలకాలమున గురియ
  చేనులు బీటలు వడగను చేటును గల్గున్
  హీనము లయ్యెను మహిలో
  వానలు రైతులకు దుఃఖ భాజన మయ్యెన్

  రిప్లయితొలగించండి
 15. గురువు గారికి ప్రయాగ శ్రీరామ చంద్ర మూర్తి నమస్కారములు.

  చేనులు వెలవెల పోవగ
  వానలు కురిసీ కురియక బీటలు బారెన్
  ధాన్యము శూన్యము చేయుచు
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్.

  రిప్లయితొలగించండి
 16. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మాదురి గారి ద్వారా పంపిన రెండు పూరణలు, కొద్ది మార్పుతో తిమ్మాజీ రావు గారి ద్వారా పంపిన రెండవ పూరణము బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘వాన’ శబ్దం రెండు సార్లు ఎక్కువగా ప్రయోగింపబడి అన్వయలోపం ఏర్పడుతున్నది.
  *
  ప్రయాగ శ్రీరామ చంద్ర మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కురిసీ’ అన్న వ్యావహారిక పదం స్థానంలో ‘కురిసియు’ అనండి.

  రిప్లయితొలగించండి
 17. పూజ్యులు పండిత నేమానివారికి పూర్తి స్వస్థత శీఘ్రముగఁ జేకూరవలెనని భగవంతునిఁ బ్రార్థించుచు, మిత్రులు కంది శంకరయ్యగారికి, కవిమిత్రులందఱికి నమస్కారములు తెలుపుచు...

  చేనికి నవసర మగు తఱి
  నైనను గుఱియకయె మిగుల నార్తినిఁ ద్రోయున్,
  జేనినిఁ బడవలదనఁ, బడి,
  "వానలు" రైతులకు దుఃఖభాజనము లగున్!

  రిప్లయితొలగించండి
 18. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....

  చేనుకు చే టధికమ్మౌ
  వానలు, రైతులకు దుఃఖభాజనము లగున్,
  బోనము కఱువౌ జనులకు,
  వానలు ఋతువునఁ గురిసిన బాగు ప్రజలకున్.

  రిప్లయితొలగించండి
 19. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. చేనులు బీడై పోయెను
  దీనవదనుడాయె రైతు దిక్కే లేకన్
  నానాటికి కరువయ్యెను
  వానలు, రైతులకు దుఃఖభాజనము లగున్

  రిప్లయితొలగించండి
 21. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. కవిమిత్రులు శ్రీ ప్రయాగ శ్రీరామచంద్రమూర్తిగారూ! మీ పూరణము చాలా్ బాగున్నది. కాని, మూఁడవ పాదమున ప్రాసభంగమైనది. సరిచేయఁగలరు. స్వస్తి.
  ***
  కవిమిత్రులు
  శ్రీ కెంబాయి తిమ్మాజీరావుగారూ!
  శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణగారూ!

  మీ పూరణములు చాల బాగున్నవి. కాని, రెండవపాదము చివరలో "లేకన్" అని ద్రుతాంతముగనున్నవి. వ్యతిరేకార్థక పదము చివర ద్రుతము రాదుగదా! కావున సవరించఁగలరు.

  అన్యథాభావింపవలదని మనవి.

  రిప్లయితొలగించండి
 23. గుండు మధుసూదన్ గారూ,
  ధన్యవాదాలు.
  మీరు మిత్రుల పూరణలలో, పద్యాలలో గుణదోషాలను సమీక్షించడం అందరికీ సంతోషదాయకమే. దాని వలన ఔత్సాహిక కవిమిత్రులు పద్యరచనా నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటారు.

  రిప్లయితొలగించండి
 24. కోనలలో, కొండలలో,
  బానలతో కడలియందు, భాగ్యనగరిలో...
  చేనులలో తక్క కురియు
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్

  రిప్లయితొలగించండి


 25. దీనపు బతుకుల కాలము
  లోన సమయమునకు తగని లొగ్గడి గానన్
  మీనకుమారి! యకాలపు
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. జానెడు చోటును విడువక
  కోనల మూలలను లోయ కొండల నందున్
  ఈ నెల పంటను కురిసిన
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్

  రిప్లయితొలగించండి