6, జులై 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1465 (కొక్కొరొకో కొక్కొరొ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.

24 కామెంట్‌లు:

  1. కుక్కుటపు కూత వినగను
    కొక్కొరొకో కొక్కొరొయని ,కోకిల కూసెన్
    చక్కగ నృత్యము జేయుచు
    మిక్కుట మగుగాన రసము మేలిమి గళమున్

    రిప్లయితొలగించండి
  2. కుక్కుటము కూసె లెమ్మని
    కొక్కొరొకో కొక్కొరొయని, కోకిల కూసెన్
    చక్కగ సుశ్రావ్యమ్ముగ
    మెక్కియు తా మావి చిగుర మిక్కిలి ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  3. కుక్కుటము కూసె నుదయము
    కొక్కొరొకో కొక్కొరొయని, కోకిల కూసెన్
    చక్కని పంచమ రవమున
    మక్కువ గొలిపె విధముగ మనసే దోచెన్


    రిప్లయితొలగించండి
  4. పూజ్యులు పండితనేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని మనఃపూర్వక నమస్సులు.

    (కోకిల యను పేరుగల బాలిక పక్షుల కూఁతలు సాధన జేయు సందర్భము...)

    చక్కని బాలిక కావునఁ
    జిక్కని యనుకరణఁ జూప శీఘ్రమె వేడ్కన్
    జొక్కఁపుఁ గూఁతలఁ గూయుచుఁ
    "గొక్కొరొకో కొక్కొరొ"యని కోకిల కూసెన్!

    రిప్లయితొలగించండి
  5. అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం.‘గొలిపెడి’లో డి టైపాటు వల్ల పోయినట్టుంది.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    కోకిల అనే మిమిక్రీ ఆర్టిస్టుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
    నిన్నటి నా రెండవ పద్యమునకు తెలిపిన సూచన కు ధన్యవాదాలు
    దానిని ఈ విధముగా సవరించితిని .
    ''రూఢి గాను''కు బదులుగా''ప్రియము మీర''
    ఈ నాటి నా పూరణ

    చక్కని గింజలు నూకలు
    మిక్కుటముగ మ్రింగి నిదుర మేల్కొన మరువన్
    కుక్కుటమును మేలుకొలుప
    కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.

    రిప్లయితొలగించండి
  7. మధుసూదన్ గారూ బాగుంది.

    చక్కగ సాఫ్ట్వేరొక్కడు
    కొక్కొరొ కూకూల కూత కోరుచు జేసెన్
    చిక్కులు జరుగగనందున
    కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.

    రిప్లయితొలగించండి
  8. ప్రణామములు గురువుగారు..
    గొలిపెడి లో డి టైపాటయ్యింది, చూసుకొనలేదు..మన్నించవలెను..
    శ్రీ నేమాని గురువుగారి ఆరోగ్యం ఎలా వుంది? వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా..

    రిప్లయితొలగించండి
  9. పిల్లలు అల్లరి చేస్తూ అరిచిన కూతలు...

    కిక్కీ యని కాదంబరి
    విక్కీ, తేజస్వి కలసి పిపిపే యనుచున్
    కుక్కూ యనుచును కోమలి
    కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.

    రిప్లయితొలగించండి
  10. కుక్కుటమైత్రిత్వపు పిక
    మొక్కటి సహవాసదోష మోహాన్వితమై
    చక్కటి కూజనము వదలి
    కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    పూరణ:నక్కనిగని కోడి యరచె
    కొక్కొరొకో కొక్కెరొ యని, కోకిల కూసెన్
    బిక్కువడుచు నారేయిని
    కుక్కలు భౌ భౌ యటంచు గోలగ తరుమన్
    2.చుక్కంటు ధరలు గాంచిన
    పెక్కురు తల బాదు కొనిరి వేదన కలుగన్
    నక్కకు నధికార మ్మిడ
    కొక్కొరొకో కొక్కెరొ యని, కోకిల కూసెన్

    రిప్లయితొలగించండి
  12. భాగవతుల కృష్ణారావు గారూ,
    కోడిని లేపడానికి కోకిల కూసిందా! బాగుంది మీ పూరణ అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సాంకేతికవైఫల్యాన్ని గురించిన మీ మొదటి పూరణ, పిల్లల గోలగా రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    సహవాసదోషాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ...

    కుక్కుటము నిద్ర లేపెను
    కొక్కొరొకో కొక్కొరొ యని; కోకిల కూసెన్
    మిక్కిలి మధురగళంబున
    చక్కగ నాడిరి బుడుతలు సంతోషమునన్.

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. పక్కింటి కోడి లేపెను
    కొక్కొరొకో కొక్కొరొ యని, కోకిల కూసెన్
    చక్కగ కలస్వనంబున
    దిక్కుల పద్మినులు విరిసె దినమణి రాకన్

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మల్లెల వారిపూరణలు
    రెక్కలు విదిల్చి కోడియు
    కొక్కొరొకో కొక్కొర యని, కోకిల కూసెన్
    వెక్కసమౌ చిగురు తినియు
    చక్కగ కూ కూ యనుచును సాజపు రీతిన్
    ఉక్కకు తాళక నిప్పుడు
    నెక్కును బెట్టంగ లేక నేపుగ గొంతున్
    యక్కజమగు రీతి పలికె
    కొక్కొరొకో కొక్కొర యని, కోకిల కూసెన్

    రిప్లయితొలగించండి
  17. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. "చక్కెర పలుకుల నియ్యెడ
    చక్కగ పాడవె" యడిగెను సఖియగు తననా
    కుక్కుటము- తనదు పలుకుల
    కొక్కొరొకో కొక్కొరొ యని-- కోకిల కూసెన్.

    రిప్లయితొలగించండి
  19. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. చక్కని బ్లాగను కోకిల
    మక్కువగానిడు సరససమస్యల, రవి పై
    కెక్కక మునుపే తెరువగ
    కొక్కొరొకోకొక్కరొయని కోకిల కూసెన్

    రిప్లయితొలగించండి
  21. సహదేవుడు గారూ,
    ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అన్నట్టుగా చాలా మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. మా అన్నయ్య గారి పద్యము :
    అక్కరము రాని పిల్లల
    కక్కజముగ మిషను* విద్యు దబ్రకదబ్రా
    యక్కర లేదనె బుధులిక
    కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్
    (మిషను -కంప్యూటర్ , రాజీవ్ విద్యా మిషన్ వగైరా ద్వారా విద్య )

    రిప్లయితొలగించండి
  23. చంద్రమౌళి రామారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి