15, జులై 2014, మంగళవారం

పద్యరచన - 621

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7 కామెంట్‌లు:

 1. దర్పణమున గనుచు తనమోము తలచెను
  పిల్లి పిల్ల వంటి పిరికివాడు,
  సింహమువలెనుంటి సీమనెవరినైన
  చిత్తుచేయగలుగు చేవగలదు

  రిప్లయితొలగించండి
 2. పిల్లి మనో దర్పణమది
  చెల్లును మదిలోననూహ చిత్రము లేదే !
  పిల్లీ సింహపు చిత్రము
  నిల్లిదె లిఖియించె నొక్కడీయూహలతో !

  రిప్లయితొలగించండి
 3. అద్దమందున తన యందమున్ పరికించి
  పిల్లి పిల్ల తలచి యుల్లమందు
  హరికి ధీటనుచును మురిసిపోయె, తుదకు
  కుక్కతోడ పోరి కూలిపోయె

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. తూల నాడెడు వారల దూల వదలి
  తీర వలెనంచు తలపోసి బీరువొకడు
  మోసి వ్యక్తిత్వమును బెంచు పుస్తకంబు
  సింహమైతిని యద్దంబు జెప్పె ననియె

  రిప్లయితొలగించండి
 6. సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. దర్పణమునందు పిల్లికి తనదు ముఖము
  పులిగ కనిపించ నిజమెప్డు పొల్లగునొకొ?
  తనదు శక్తిని మించెడు తగవు తగద
  టంచు తెలిసి మెలగవలెనంద్రు ధరణి.

  రిప్లయితొలగించండి