23, జులై 2014, బుధవారం

సమస్యా పూరణం – 1482 (తార తనయుఁడై)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
తార తనయుఁడై పుట్టె సుధాకరుండు.

16 కామెంట్‌లు:

  1. తార యనదేవ గురునకు దార గాన
    క్రతువు నందున చంద్రుని గాంచి నంత
    మోహ మందున మునిగిరి మోజు దీర
    తార తనయుడై పుట్టె సుధా కరుండు

    రిప్లయితొలగించండి
  2. శశియె గర్భకారకుడుగా సృష్టికర్త
    పలుక పితృనిర్ణయమైన భాగ్యము గన
    పుత్ర రూపుడై తండ్రియే బుట్టెననగ
    తార తనయుఁడై పుట్టె సుధాకరుండు

    రిప్లయితొలగించండి
  3. మల్లెల వారి పూరణలు

    గురువు పత్నిని కోరియు కూడినంత
    తార కపుడయ్యె గర్భంబధర్మ రీతి (గర్భ్ంబు+అధర్మ)
    తార తనయుడై పుట్టె సుధాకరుండు
    పోలు బుధుడు, చంద్రుని వంశ పూర్వుడయ్యె

    నెల పొడుపు వేళ తారలు నింగి వెలుగ
    మధ్య చంద్రరేఖ వొడమె- మాన్యులెల్ల
    నూలు పోగుల నిచ్చియు నుతిగననిరి
    తార తనయుడై పుట్టె సుధాకరుండు

    "తార"యను నోర్తు పెండ్లియై తనయునందె
    వాని పేరు "సుధాకరు"డని యునుంచ
    బంధులే వ్యంగ్య మౌరీతి పల్కిరెలమి
    తార తనయుడై పుట్టె సుధాకరుండు

    రిప్లయితొలగించండి
  4. వలచి చంద్రుని గోరె దేవగురు పత్ని
    తార; తనయుఁడై పుట్టె సుధాకరుండు.
    వార నిధికిన్ వాసిగా; తార కతన
    క్షీణ చంద్రునిగా నపకీర్తి గాంచె.

    రిప్లయితొలగించండి
  5. తార తనయుడై పుట్టె సుధా కరుండు
    తార తనయుడు కాదార్య !తప్పు తప్పు
    తార భర్తయే మఱి యీ సు ధాకరుండు
    నిజము బలికితి నమ్ముడు నిజము గాను

    రిప్లయితొలగించండి
  6. అశ్వనీ భరణీలాదు లాలు లైన
    తీరె వానితో వినువీధి దినమునకొక
    తార, తనయుడై పుట్టె సుధాకరుండు
    పాలకడలికి భూరి రత్నాల నిధికి

    రిప్లయితొలగించండి
  7. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మృగధరు గూడి తా సంగమి౦ప, బుధుడు
    తార తనయుడై పుట్టె, సుదాకరుండు
    గురుని శాపాన కోల్పోయె మెరుగు, నంత
    క్షీణ వృద్ధుల వరమిడె, వాణి మగడు

    రిప్లయితొలగించండి
  8. బుధుడు, పతిదేవు విడనాడిన ధిషను సతి
    తార తనయుఁడై పుట్టె సుధాకరుండు
    గురుసతిని వలచ,నితని తరుణి యిలకు
    పుట్టెను కొమరుండు పురూరవోర్వి విభుడు

    రిప్లయితొలగించండి
  9. క్షీర సాగర మథనాన సిరియె బుట్టె
    కల్ప వృక్షమ్ము, యేనుగు కామధేను
    వివియె గాకను మరియొక్క టిట్లు చెప్పు
    తార ? తనయుడై పుట్టె సుధా కరుండు.

    రిప్లయితొలగించండి
  10. చక్కదనమును గాంచితా శశిని గొనియె
    తార, తనయుడై పుట్టె సుధా కరుండు
    విషధికి, చిలుక రయమున విష్ణు నాజ్ఞ
    దేవ దానవుల్ దానిని తీరుగాను

    రిప్లయితొలగించండి
  11. అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు!
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పితృనిర్ణయమైన’ అన్నచోట గణదోషం. ‘పితృనిర్ణయమ్మైన’ అంటే సరి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉన్నాయి. బాగున్నవి. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తార భర్తయే’ అనడం కంటె ‘తారకు ప్రియుడు’ అంటే ఇంకా బాగుంటుందేమో?
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భరణ్యాదులౌ నాలులైన..’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మృగధరుం గూడి/ మృగధరుని గూడి’ అనవలసింది. అక్కడ టైపాటు కావచ్చు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. నింగి వెలుగునదెయ్యది నిగిడి నిగిడి?
    రాము దశరధుని కెట్టుల రాణకెక్కె?
    వెన్నెలలు కురిపించి రేయిని వెల్గునెవరు?
    తార; తనయుడైపుట్టె; సుధాకరుండు

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మరియొకపూరణ:తారలకు సీమ పాల సంద్రము యనంగ పాల సంద్రము త్రచ్చగా పక్షధరుడు
    ధరకు చల్లని వెన్నెల తారసిలగ
    తార తనయుడై పుట్టే సుదాకరుండు

    రిప్లయితొలగించండి
  14. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    అశ్వనీ భరణ్యాదులౌ నాలు లైన
    తీరె వానితో వినువీధి దినమునకొక
    తార, తనయుడై పుట్టె సుధాకరుండు
    పాలకడలికి భూరి రత్నాల నిధికి

    రిప్లయితొలగించండి
  15. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సంద్రము + అనంగ’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘సంద్రమె యనంగ’ అనండి.

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మీసవరణకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి