14, జులై 2014, సోమవారం

సమస్యా పూరణం – 1473 (దశరథుని శబ్దభేది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.

25 కామెంట్‌లు:

  1. భావి జరిగెడి కథకేమొ పడెపునాది
    శ్రవణ తలిదండ్రి పెట్టగా శాపమపుడు
    దనుజ నాశమ్ము గోరెడి దైవమునకు
    దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.

    రిప్లయితొలగించండి
  2. గోలివారి బాటలోనే.

    సంతు లేనట్టి రాజుకు సంతు కలుగు
    శాప కతమున శ్రీరామ జననమగు
    దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె
    సురల కావని శ్రవణుని మరణ వేళ.

    రిప్లయితొలగించండి
  3. ముని కుమారుని కాయువు ముగిసె ననుచు
    యముని పనుపున కింకరు లకట జేరి
    శ్రవణుని బ్రాణ మందగ చక్క నుండ
    దశరధుని శబ్ధభేది మూదమ్ముఁ గూర్చె

    రిప్లయితొలగించండి
  4. ]మల్లెల వారిపూరణలు
    శ్రవణు నంతము జేయగ శాపమ౦దె
    “కొడుకు విరహాన జత్తని”కొడుకుపుట్ట
    కారణము శాప మగుటచే కలత పడక
    దశరథుని శబ్ద భేది మోదమును గూర్చె
    2.బిడ్డ లేనట్టివాడను గొడ్డుపోతు
    తనకు కొడుకు లేడను చింతతో తనువుతనువు విడుతు
    ననగ శాపమ్ము వినగ వాడందే శాంతి
    దశరథుని శబ్ద భేది మోదమును గూర్చె
    3.రామజన్మకు శ్రవణు మరణము కార
    ణoబు నగుటకు లోక జనమ్ము లెల్ల
    ముదము గనిరట దుశ్చర్య పుణ్య మూర్చు
    దశరథుని శబ్ద భేది మోదమును గూర్చె

    రిప్లయితొలగించండి
  5. శాపమిప్పించె శ్రవణుని జననిచేత
    దశరథుని శబ్దభేది, మోదమ్ముఁ గూర్చె
    నేమి కైకకిడిన వరమేరికైన?
    ముందుచూపు లేనిపనులు ముంపుతెచ్చు

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    పూరణ:1. ముసలి దంపతుల్ శాపమ్ము పొసగ నృపతి
    పుత్ర శోకాన మరణించ,పొ౦దె సుతుని
    శ్రవణు మరణ కారణ మగు శరముగాదె
    “దశరథుని శబ్దభేది” మోదమ్ముగూర్చె
    2.వరము లెవని గోరెను కైక భరతు కొరకు?
    శబ్దమును విని శరమేయ జాలునెవడు?
    రాముడుదయి౦చి లోకాల కేమి గూర్చె?
    దశరథుని, శబ్దభేది, మోదమ్ముగూర్చె

    రిప్లయితొలగించండి
  7. మౌని శాపము వరముగా మారెనేమొ !
    కొడుకు కానల కేగగా గూల తండ్రి ,
    రావణుని జంప పుత్రుడు ; ప్రజల కటుల
    దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. శాప మొసగెను శ్రవణుని సంహరించి
    దశరధుని శబ్దభేధి, మోదమ్ము గూర్చె
    సర్వ జనులకు శ్రీరామ జనన వార్త
    పూల వానలు గురిసెను నేల పైన

    రిప్లయితొలగించండి
  10. మునికుమారుని యుసుఱును ముగియ జేసె
    దశరథుని శబ్ధ బేధి, మోదమ్ము గూర్చె
    పుత్రకామేష్టి జరిపిన పుణ్య ఫలము
    తనయులుదయించె నల్గురు దశరథునకు

    రిప్లయితొలగించండి
  11. శబ్ద భేది నైపుణ్య ము సంతు లేని
    దశరథు నకును శ్రవనుని జనకు డొసగు
    శాప వరమున రాజుకు సంతు కలిగె
    దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.

    రిప్లయితొలగించండి
  12. శబ్ద భేది నైపుణ్య ము సంతు లేని
    దశరథు నకును శ్రవనుని జనకు డొసగు
    శాప వరమున రాజుకు సంతు కలిగె
    దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.

    రిప్లయితొలగించండి
  13. శబ్ద భేది నైపుణ్యము సంతు లేని
    దశరథు నకును శ్రవణుని జనకు డొసగు
    శాప వరమున రాజుకు సంతు కలిగె
    దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.

    రిప్లయితొలగించండి
  14. ఆవిద్య "శబ్దవేధి" కదూ...

    సుతుని వనవాస సందర్భసూత్ర్రమైన
    శాపవిధి పుత్రశోకమై సృష్టికాగ
    తీవ్రకాంక్షతో వీక్షించు దివిజులకును
    దశరథుని శబ్దవేధి మోదమ్ముఁ గూర్చె

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాత్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెందవ పాదాన్ని ‘శ్రవణు తల్లిదండ్రు లొసంగ శాప మపుడు’ అనండి.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో ఒక లఘువు తక్కువయింది. బహుశః టైపాటు కావచ్చు. ‘జనన మగును’ అంటె సరి.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘శ్రవణు ప్రాణమునం దగ...’ అనండి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణ రెండవ పాదంలో ‘తనకు, తనువు’ అదనంగా టైపయ్యాయి.

    రిప్లయితొలగించండి
  16. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.

    (పంచపాది)
    శాపమే లేనిచో, రామ సహిత రామ
    లక్ష్మణుల వనవాసాన రావణుండు
    జానకినిఁ జెఱ నిడ, వానిఁ జంపి, జనుల
    కష్టములఁ బాపు టెట్టులఁ గలుగుఁ? గాన,
    దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె!(౧)

    శాపవశమున రాముఁడు జనన మంది,
    జానకీపతియై, వనిఁ జని, యసురపు
    వైరమునఁ బోరి, చంపఁగఁ బ్రజల కపుడు
    "దశరథుని శబ్దభేది" మోదమ్ముఁ గూర్చె!(౨)

    రిప్లయితొలగించండి
  17. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు..మీ ఆరోగ్యము కుదుట బడినదా...
    సవరణతో...


    భావి జరిగెడి కథకేమొ పడెపునాది
    శ్రవణు తలిదండ్రు లొసగగ శాపమపుడు
    దనుజ నాశమ్ము గోరెడి దైవమునకు
    దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ ధన్యవాదాలు. టైపాటునకు చింతిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  20. గురుదేవులకు ధన్యవాదాలు.
    సవరణ గురించి పరిశీలించ ప్రార్థన:
    'శ్రపణు నిబ్రాణ మందగ చక్క నుండ'

    రిప్లయితొలగించండి
  21. శ్రవణు ప్రాణమ్ము హరియించె చాటుగాను
    దశరధుని శబ్దభేది; మోదమ్ము గూర్చె
    కైక రాముని వనవాస కాంక్షకొరకు,
    స్వీయతనయుని పట్టాభిషేకమునకు

    రిప్లయితొలగించండి
  22. మాస్టారూ! జ్వరం తగ్గిందని భావిస్తాను. సమస్యా పూరణం లో నా పూరణను పొరబాటున సమీక్షించలేదు..... మీరు సమీక్షించే దాకా పదవతరగతి విద్యార్ధి ఫలితాలకోసం ఎడురుచూసినట్లు ఎదురు చూపులే !

    రిప్లయితొలగించండి
  23. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    నిజమే... ఎందుకో మీ పూరణ నిన్న నా దృష్టికి రాలేదు. మన్నించండి.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    ‘శ్రవణుని బ్రాణ’ అన్నప్పుడు ‘ని’ గురువు కాదు. దానివల్ల గణదోషం.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    ముని కుమారుని కాయువు ముగిసె ననుచు
    యముని పనుపున కింకరు లకట జేరి
    శ్రవణు ప్రాణము నందగ చాటు నుండ
    దశరధుని శబ్ధభేది మోదమ్ముఁ గూర్చె

    రిప్లయితొలగించండి