అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, నిన్న సాయంత్రం నుండి కొద్దిగా అస్వస్థత.. అందువల్ల నిన్న ఆలస్యంగా వచ్చిన పద్యాలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.. ఇప్పుడు వ్యాఖ్యానించాను. చూడండి. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ‘అందరినీ దరిజేర్చే మారాజువే... అద్దరిని జేర్చమని అడుగుతుండావే’ అన్న పాటలోని భావాన్ని చక్కగా ఛందోబద్ధం చేశారు. చాలా బాగుంది. అభినందనలు.
శ్రీ రామా! కరుణా సముద్ర! గుహుడన్ చిత్తంబులో నిన్ను నే నారాధించితి నీదు దర్శనముకై యానంద ముప్పొంగె నో వీరాగ్రేసర ! నీ పదంబులను సేవింతున్ ప్రసూనాలిచే ధారావాహిక జాహ్నవీ తటిని నే దాటింతు నాపై ప్రభో !
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, ధారాశుద్ధితో చక్కగా సాగింది మీ పద్యం. అభినందనలు. ‘దర్శనముకై’ అనరాదు. దర్శనమునకై అని ఉండాలి. అక్కడ ‘దర్శనముతో నానంద ముప్పొంగె’ అందామా? చివరి పాదంలోని ‘నాపై’ శబ్దానికి అన్వయం? అక్కడ ‘నా నావపై’ అంటే సరిపోతుందనుకుంటాను. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
మీరన్నట్లు 'దర్శనమునకై' అని యుండవలసి యుండెను కాని తప్పినది. మీ సవరణకు ధన్యవాదములు
దాటింతును + ఆ పై , ' ఆ పై' అను పదము 'అటు తరువాత' అను భావముతో వ్రాశాను . మొదట పాదార్చన పూలతో జేసి గంగానదిని (ఆ పైన) ఆ తరువాత దాటిస్తాను అనుభావము నూహించి వ్రాశాను . మీ అభిప్రాయము తెలియ జేయ ప్రార్థన
శ్రీ రామా! కరుణా సముద్ర! గుహుడన్ చిత్తంబులో నిన్ను నే నారాధించితి నీదు దర్శనముతో యానంద ముప్పొంగె నో వీరాగ్రేసర ! నీ పదంబులను సేవింతున్ ప్రసూనాలిచే ధారావాహిక జాహ్నవీ తటిని నే దాటింతు నా పై ప్రభో !
శ్రీ రామా! కరుణా సముద్ర! గుహుడన్ చిత్తంబులో నిన్ను నే నారాధించితి నీదు దర్శనముతో నానంద ముప్పొంగె నో వీరాగ్రేసర ! నీ పదంబులను సేవింతున్ ప్రసూనాలిచే ధారావాహిక జాహ్నవీ తటిని నే దాటింతు నా పై ప్రభో !
గుహుడు మ్రొక్కెను రాముని బహుళ ప్రీతి
రిప్లయితొలగించండినదిని దాటించ గోరుచు పదిల ముగను
కల్లు కడవలు నదికీయ కలికి సీత
నూరి జనులెల్ల కదిలెను వారి వెంట
Mastaaru ninnati. Pooranalu sameekshicha koredamu. Aalasyamuga post chesitini
రిప్లయితొలగించండిదరిజేరిన మరి నీవే
రిప్లయితొలగించండిదరిజేర్తువుగాద రామ ! దాశరధీ ! య
ద్దరిజేర్చగ రమ్మని నీ
దరిశనమేయిచ్చినావు దండము తండ్రీ !
దరిజేరిన మమ్ములనే
రిప్లయితొలగించండిదరిజేర్తువుగాద రామ ! దాశరధీ ! య
ద్దరిజేర్చగ రమ్మని నీ
దరిశనమేయిచ్చినావు దండము తండ్రీ !
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
నిన్న సాయంత్రం నుండి కొద్దిగా అస్వస్థత.. అందువల్ల నిన్న ఆలస్యంగా వచ్చిన పద్యాలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.. ఇప్పుడు వ్యాఖ్యానించాను. చూడండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘అందరినీ దరిజేర్చే మారాజువే... అద్దరిని జేర్చమని అడుగుతుండావే’ అన్న పాటలోని భావాన్ని చక్కగా ఛందోబద్ధం చేశారు. చాలా బాగుంది. అభినందనలు.
పరవశ మొందితి రామా!
రిప్లయితొలగించండిదరిశన భాగ్యంబు నొసగి దరిజేర్చ మనన్!
గిరి రాతిఁ బడతి జేసిన
సురనుత! నీ కాళ్లఁ గడుగు సూనృత మిమ్మా!
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండి‘రాతిని నాతిని చేసిన నీ పాదం తగిలితే నా నావ ఏమవుతుందో.. కాళ్ళు కడగనీ’ అన్న భావాన్ని చక్కని పద్యం మలిచారు. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఅడుగిడకాగుము రఘువర
రిప్లయితొలగించండిపడవగునో యే అతివగ పదమీవిడినన్
కడిగెద పాదములని వడి
వడిగావచ్చె గుహుడటకు వందనమిడుచున్
శ్రీ రామా! కరుణా సముద్ర! గుహుడన్ చిత్తంబులో నిన్ను నే
రిప్లయితొలగించండినారాధించితి నీదు దర్శనముకై యానంద ముప్పొంగె నో
వీరాగ్రేసర ! నీ పదంబులను సేవింతున్ ప్రసూనాలిచే
ధారావాహిక జాహ్నవీ తటిని నే దాటింతు నాపై ప్రభో !
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...
రిప్లయితొలగించండిరాతిని తన పదధూళితో నాతిఁ జేసె
రాము వలన తన పడవ కేమి యగునొ
యంచు తలపోసి తనయొక్క యాత్మలోన
కాళ్ళు కడిగెను గుహుఁడు తా కరము భక్తి.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
ధారాశుద్ధితో చక్కగా సాగింది మీ పద్యం. అభినందనలు.
‘దర్శనముకై’ అనరాదు. దర్శనమునకై అని ఉండాలి. అక్కడ ‘దర్శనముతో నానంద ముప్పొంగె’ అందామా?
చివరి పాదంలోని ‘నాపై’ శబ్దానికి అన్వయం? అక్కడ ‘నా నావపై’ అంటే సరిపోతుందనుకుంటాను.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
రిప్లయితొలగించండిమీరన్నట్లు 'దర్శనమునకై' అని యుండవలసి యుండెను కాని తప్పినది. మీ సవరణకు ధన్యవాదములు
దాటింతును + ఆ పై , ' ఆ పై' అను పదము 'అటు తరువాత' అను భావముతో వ్రాశాను . మొదట పాదార్చన పూలతో జేసి గంగానదిని (ఆ పైన) ఆ తరువాత దాటిస్తాను అనుభావము నూహించి వ్రాశాను . మీ అభిప్రాయము తెలియ జేయ ప్రార్థన
శ్రీ రామా! కరుణా సముద్ర! గుహుడన్ చిత్తంబులో నిన్ను నే
రిప్లయితొలగించండినారాధించితి నీదు దర్శనముతో యానంద ముప్పొంగె నో
వీరాగ్రేసర ! నీ పదంబులను సేవింతున్ ప్రసూనాలిచే
ధారావాహిక జాహ్నవీ తటిని నే దాటింతు నా పై ప్రభో !
శ్రీ రామా! కరుణా సముద్ర! గుహుడన్ చిత్తంబులో నిన్ను నే
రిప్లయితొలగించండినారాధించితి నీదు దర్శనముతో నానంద ముప్పొంగె నో
వీరాగ్రేసర ! నీ పదంబులను సేవింతున్ ప్రసూనాలిచే
ధారావాహిక జాహ్నవీ తటిని నే దాటింతు నా పై ప్రభో !
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ భావన యుక్తమైనదే.. ‘దాటీంతు నాపైఁ బ్రభో’ అని ఉంటే సందేహానికి ఆస్కారం ఉండక పోయేది.. ధన్యవాదాలు.