భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * యం.ఆర్. చంద్రమౌళి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. నా జ్వరం తగ్గింది కానీ కాస్త నలతగా ఉంది. ధన్యవాదాలు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ మొదటి పాదంలో ఒక అక్షరం లోపించింది. ‘దాగిన హరియె’ అందామా? * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాస్టారూ! జ్వరం తగ్గిందని భావిస్తాను. నిన్నటి సమస్యా పూరణం లో నా పూరణను పొరబాటున సమీక్షించలేదు.....
రిప్లయితొలగించండిఅపహరించగ సీత నాయసురరాజు
రిప్లయితొలగించండిబంపె మారీచు రాముని బయటి కంప
హరిని హరియింప వరియించె హరిని హరిణ
ప్రాణ భీతిని, నెరవేర్చప్రభుని కోర్కె
హరిని= రాముని
హరియింప = అడగార్చ
వరియించె = కొరె
హరిని = బంగారు వర్ణము గలది
హరిణ = జింక
బాణభట్టుని కాదంబరీ ప్రసంగమును ఆధరించినపూరణము. కథ చివరిఘట్టంలో శబరకన్యారూపియైన మహాలక్ష్మి కరుణతో చంద్రపీడుడు-కాదంబరి, పుండరీకుడు -మహాశ్వేత ఈ జంటల పునర్జన్మాల లహరిని పరిహరించగా, హరిణ = తెల్లది (మహాశ్వేత) హరిని (చిలుకరూపంలో కథను ఆరంభించిన వైశంపాయనుని, అనగా పుండరికుని) వరియించెనని భావము
రిప్లయితొలగించండిజన్మ జన్మాల ప్రేమికుల జంటకథలొ
పుండరీకుడు మహాశ్వేత పుణ్యఫలమై
కరుణతో లక్షి కష్టముల గని కుటిల ల-
హరిని హరియింప వరియించె హరిని హరిణ
శ్వేత వర్ణంపు జవరాలు వీధిలోన
రిప్లయితొలగించండినడచు చుండగ యెదురయ్యె నాగమొకటి
భయముతోడ తలచి భగవంతుఁ మదిని
హరిని హరియింప వరియించె హరిని హరిణ
(హరి =పాము ,వరియించు =కోరు, హరిణ=తెల్లనిది )
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా జ్వరం తగ్గింది కానీ కాస్త నలతగా ఉంది. ధన్యవాదాలు.
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
గిరిని దాగిన హరి,కిష్కింధ నేలు
హరిని హరియింప వరియించె హరిని హరిణ
లోచని తన కుమారుని బ్రోచుటకును
వెరపులేక రాణిగ తార వెలయుటకును
2.కలరు దేహికి శత్రులు కలతలిడగ
నరయ వారల లోభమోహార్ణవపు ల
హరిని హరియింప వరియించె హరిని హరిణ
మానసమ్మున రుక్మిణి మచ్చెకంటి
మల్లెల వారిపూరణలు
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
హరిని హరియింప వరియి౦చె హరిని హరిణ
చిహ్నమున్నట్టి మరి యొండు జేసి తపము
ననగ రాత్రి తా వచ్చెను నభము నిరుల
చాటు హరి యేగ వెలిగె నాచ౦ద మామ
2. హరియు తా నట్లు వానతో అరువు నగుచు
హరుల తీండ్రించు హరిని తా నణచి వేయ
హరిని హరియింప వరియి౦చె హరిని హరిణ
హరితమౌ రీతి యిలయెల్ల అరువు గాదె
'హరికి' కోతి చేష్టలు మెండు యతికి నట్లు
రిప్లయితొలగించండి'హరిణ' మెచ్చిన మరదలు వరస జూడ
హరిని పెండ్లాడ బోనని యలిగి నంత
తిక్క కుదరగ నడవడి తీరి, లోని
హరిని హరియింప, వరియించె హరిని హరిణ
ఇంద్రుడందురు, సూర్యుండు, చంద్రుడంద్రు
రిప్లయితొలగించండిగాలి, కిరణమ్ము, హరియన్న కప్ప, పాము
హరిణ మనజింక, తెలు, పెట్లు హరి! హరి! హరి!
హరిని హరియింప వరియించె హరిని హరిణ ?
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ ! బలే అన్వయమండీ...బాగుంది
గోలి వారికి ధన్యవాదాలు. హరి అన్న పదానికున్న అర్థాలతో
రిప్లయితొలగించండిగమ్మత్తైన పద్యం వ్రాశారు.అభినందనలు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో ఒక అక్షరం లోపించింది. ‘దాగిన హరియె’ అందామా?
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంద్రమౌళి రామారావు గారి పూరణ :
రిప్లయితొలగించండివిశ్వరూపంబుఁ దాలిచి వివిధ గతుల
వెంటబడుచుగ్ర కాముక వేషమెత్తు
నంగనాజీవ కబళనాయత్త కలుష
హరిని హరియింప వరియించె హరిని హరిణ
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మీసూచనకు ధన్యవాదములు
క్రమాలంకారం లో
రిప్లయితొలగించండిదుష్ట దానవులేరీతి తోచెజగతి?
లచ్చియెవరిని వరియించి రాజ్యమేలె?
చంద్రు లోపలిగుర్తు నేమంద్రు చూడ?
హరిని హరియింప;వరియించెహరిని;హరిణ