5, జులై 2014, శనివారం

సమస్యా పూరణం – 1464 (మంచి విద్యల నేర్చుట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
మంచి విద్యల నేర్చుట మానవలెను.

28 కామెంట్‌లు:



  1. వయసెరిగి,బుద్దేరిగి మసలు కొమ్ము జిలేబి
    ఇది అయ్యవారల 'సీరియస్సు' క్లాసు !
    ఇక చాలు నీ ఆటలు,మంచిచేసుకొను,కోతికొ
    మ్మంచి విద్యల నేర్చుట మానవలెను !!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. దేహపుష్టికౌషధమని తిన్నచాలు
    రసన కోరిన తిన్నంత లావుబెరుగు
    షష్టిపూర్తికియాశలు జార నించి-
    మంచి విద్యల నేర్చుట మానవలెను

    ఇంచిమంచి=నోటికి రుచిగానుండుటకై తినే చిరితిండి.

    రిప్లయితొలగించండి
  3. నక్క వినయము జూపెడి నటన నెరిగి
    పిల్లి మొగ్గలు వేయుచు పీఠమెక్క
    నుర్వి నూసర వెల్లిగా నుండ దగును
    మంచి విద్యల నేర్చుట మానవలెను.

    రిప్లయితొలగించండి
  4. సకల శుభములు గలిగించు శంకరుండు
    ఆయు రారోగ్య ములనిచ్చి యాదు కొనుచు
    కంటికిని రెప్ప యట్లయి కాచు గాత
    దయను నేమాని వారిని దప్ప కుండ .

    రిప్లయితొలగించండి
  5. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    స్వార్ధమే పరమార్ధమై సకలజనుల
    వంచనను జేసి ధనము నార్జించ వలెన
    టంచు బోధించు చున్న నీ యసుర వరుల
    మంచి విద్యల నేర్చుట మాన వలెను

    రిప్లయితొలగించండి
  6. దేశ ప్రగతికి నత్యంత వాసి తనము
    మంచి విద్యల నేర్చుట, మాన వలెను
    పరుల దూషణ మఱియును పరుల సొత్తు
    నపహ రించుట యనునది యనవరతము

    రిప్లయితొలగించండి
  7. జిలేబీ గారూ,
    _/\_
    *
    యం. ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘షష్టిపూర్తికి నాశలు’ అనండి.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    నేమాని వారి స్వాస్థ్యాన్ని కోరుతూ పద్యం వ్రాసినందుకు ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గారు,
    పరిష్కరణకు ధన్యవాదాలు. సవరించిన పద్యం

    దేహపుష్టికౌషధమని తిన్నచాలు
    రసన కోరిన తిన్నంత లావుబెరుగు
    షష్టిపూర్తికినాశలు జార నించి-
    మంచి విద్యల నేర్చుట మానవలెను

    రిప్లయితొలగించండి
  9. మల్లెల వారిపూరణలు
    మనిషి విలువను పెంచుగా మహిని నెపుడు
    మంచి విద్యలు; నేర్చుట మాన వలెను
    పరులకున్ కీడు వాటిల్లు వాని నెందు
    సకల లోకాలు సుఖ మంద శాంతి కలుగు
    2 విద్య యేదైన మంచిదై వెలుగు గాదె
    దాని వాడుట యందునే దనరు నెపుడు
    చెడును మంచియు రెండును చెడును గూర్చు
    మంచి విద్యల నేర్చుట మాన వలెను
    3.స్వార్ధ బుద్ధిని లోకాన సంపదెల్ల
    తనకు మాత్రమే దక్కగా తపన పడుచు
    యధిక లోభాన్ని పెంచెడి దైన యట్టి
    మంచి విద్యల నేర్చుట మాన వలెను

    రిప్లయితొలగించండి
  10. అడుగడుగున పోటీలకు అవసరమగు
    మంచి విద్యల నేర్చుట, మానవలెను
    సమయము వ్యర్థ పరచుట, చదువు గలిగి
    యున్న మిగుల ప్రఖ్యాతిని యువత పడయు

    రిప్లయితొలగించండి
  11. దొరలు దొంగల వలె పడి దోచుటనెడు,
    ప్రకృతి వనరుల దోచుట పాడి యనెడు,
    విద్య నేర్చుట జగతిన విలువ యనిన
    మంచి విద్యల నేర్చుట మాన వలెను.

    రిప్లయితొలగించండి
  12. గురువు మాట వినుము, గురువుల పూజించు
    నీతి కొంచెమైన నేర్చు కొనుము
    వినయమబ్బు మంచి విద్యల నేర్చుటఁ
    మానవలెను చెడ్డమాటలెపుడు

    రిప్లయితొలగించండి
  13. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రులందఱికిని సహృదయ హృదయాభివందనములు తెలుపుచుఁ...
    బూజ్యులు పండిత నేమానివారికి శీఘ్రమే స్వస్థత చేకూర్పవలెనని యా భగవంతుని వేడుకొనుచు...

    (దుష్టవిద్యలవలని నష్టములఁగూర్చి ముచ్చటించుచుఁ గట్టమంచివారితో నతని మిత్రుఁడు పలికిన సందర్భము)

    జనులఁ గికురువొడిచి, వారి ధనము నపహ
    రించు విద్యలు నేఁడు విశృంఖలముగఁ
    జెలఁగెఁ! ద్వరిత గతినిఁ జెడు తొలఁగఁ, గట్ట
    మంచి, విద్యల నేర్చుట మానవలెను!

    రిప్లయితొలగించండి
  14. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మూడవ పూరణలో ‘పడుచు/ నధికలోభమున్...’ అనండి.
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘సమయమును వ్యర్థ..’ అంటే సరి!
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. నిన్నటి సమస్యాపూరణం:
    దుర్భరపు భా.జ.పా స్థితి
    నిర్భీతిగ మారు 'మోడి' నేతృత్వమున సం
    ధర్భోచితముగ నవ ధీ
    గర్భములో నుండి వెడలె 'కమలాప్తు'డొగిన్
    (కమలాప్తుడు = నరేంద్ర మోడి)

    రిప్లయితొలగించండి
  16. మానవత లేదు మమతలు మట్టి గలిసె
    నైతికత లేదు, ప్రస్తుత మవసరమ్ము
    మంచి విద్యల నేర్చుట, మానవలెను
    కేవలము డబ్బు ప్రాధాన్య జీవ విద్య

    రిప్లయితొలగించండి
  17. బరపిరాదిని భారత ప్రజలకపుడు
    ఋషులు జ్ఞానులు మౌనులు రూఢిగాను
    మంచి విద్యల ;నేర్చుట మాన వలయు
    పరుల పీడి౦చి పుడమిని బ్రతుకు విద్య

    రిప్లయితొలగించండి
  18. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....

    మానవుండు తా నెప్పుడు మానరాదు
    మంచి విద్యలు నేర్చుట; మానవలెను
    స్వార్థరాజకీయములను; శాశ్వతముగ
    మంచి బుద్ధితో మహిలోన మనవలయును.

    రిప్లయితొలగించండి
  19. సహదేవుడు గారూ,
    నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నేతృత్వమున సం’ అన్నచోట గణదోషం. ‘నేత యయెను సం’ అందామా?
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. వదలకూడదు మనుజులు వసుధ లోన
    మంచి విద్యల నేర్చుట, మానవలెను
    చేటు దెచ్చెడి స్నేహాలు నీటుగాను
    మేలు గలుగును బ్రతుకున పూలు విరియు

    రిప్లయితొలగించండి
  21. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ రెండవ పాదంలో యతి తప్పిన విషయాన్ని గుండు మధుసూదన్ గారు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు.
    అక్కడ ‘రీతితోడ (లేదా) ప్రీతితోడ’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  22. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో...

    మించి తలచుట మనమున కొంచెమైన
    విడువకుండగ పూజించ విజ్ఞతనుచు
    మంచి చదువంచు హరిగాధ మదిని నిడకు
    మంచి విద్యల నేర్చుట మానవలెను.

    రిప్లయితొలగించండి
  24. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘విజ్ఞత + అనుచు’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘విజ్ఞత యని’ అనండి.

    రిప్లయితొలగించండి
  25. హరికి సిరులరాణి మరియొకతి ధరణి
    భార్యలగుచు నొప్పు భాగ్యమొప్ప
    పుడమినున్న మనకు గడువగ భూదేవి
    సవతి లేని యింట సౌఖ్యమేది ?

    రిప్లయితొలగించండి
  26. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    శ్రీదేవి లేని యింట సౌఖ్యం లేదన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. మాస్టరుగారూ ! ధన్యవాదములు...
    మీరు చూపిన సవరణతో...


    మించి తలచుట మనమున కొంచెమైన
    విడువకుండగ పూజించ విజ్ఞతయని
    మంచి చదువంచు హరిగాధ మదిని నిడకు
    మంచి విద్యల నేర్చుట మానవలెను.

    రిప్లయితొలగించండి
  28. గురువుగారికి ధన్యవాదములు.
    దుర్భరపు భా.జ.పా స్థితి
    నిర్భీతిగ మార్చు'మోడి' నేత యయెను సం
    ధర్భోచితముగ నవ ధీ
    గర్భములో నుండి వెడలె 'కమలాప్తు'డొగిన్
    (కమలాప్తుడు = నరేంద్ర మోడి)

    రిప్లయితొలగించండి