21, జులై 2014, సోమవారం

సమస్యా పూరణం – 1480 (తత్త్వదర్శి చెప్పు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
తత్త్వదర్శి చెప్పుఁ దప్పు లెల్ల.

ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

  1. పంచ తత్వ ములట ప్రకృతి సహజములు
    మనిషి బుద్ధి దెలియ మర్మ మేమొ
    వేద విద్య లందు వేవేల గురువులు
    తత్త్వ దర్శి చెప్పు దప్పు లెల్ల

    పంచ తత్త్వములు = పృధివి , జలము , తేజస్సు , వాయువు , ఆకాశము

    రిప్లయితొలగించండి
  2. mathamu peru cheppi maanavatvamu leka
    nithara mathamu vaari hathamu cheya
    protsahinchunatti bodhanalanidu matha
    tatva darsi cheppu dappulella

    రిప్లయితొలగించండి
  3. అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారి పూరణ....

    మతము పేరు చెప్పి మానవత్వము లేక
    యితరమతమువారి హఠము చేయ
    ప్రోత్సహించునట్టి బోధనల నిడు మత
    తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెన్నొ.

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నశ్వరమ్ముజగమిదీశ్వరుడేలేదు
    అప్పుజేసి నెయ్యిపప్పుదినుడు
    యనుచు జనులువినగ మనసార, చార్వాక
    తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెన్నొ.

    రిప్లయితొలగించండి
  7. తప్పులేవొ దెలియు తలచగ మనలకు
    బ్రతుకు పుస్తకమున బాగుగాను
    మనకు దెలియనివియు మరి కొన్ని కనుగొని
    తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెన్నొ.

    రిప్లయితొలగించండి
  8. యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    ఆత్మదర్శనమ్ము నందిన యతియె తా
    తత్వ దర్శి; చెప్పు దప్పు లెల్ల
    నుదర పోషణముకు నుగ్ర వాదము బెంచు
    కులమతముల పేర కూళ నేత

    రిప్లయితొలగించండి
  10. రజత-శుక్తి, సర్ప-రజ్జు, మిథ్య-నిత్య
    వ్యత్యయంబుగప్ప సత్యమేది?
    ప్రత్యగాత్ముదెలియ ప్రతికూలములవిప్పి
    తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెన్నొ.

    రిప్లయితొలగించండి
  11. పరమత సహనమును పాటింపకను మత
    తత్వ దర్శి చెప్పు తప్పులెన్నొ
    సకలమతములందు సారమొక్కటెయని
    నెఱిగి మెలగ వలయు నెవ్వ రైన

    రిప్లయితొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. భాగవతుల వారి పూరణ
    "తత్వమసి"గ నెరిగి ధరణి వేదాంతి యౌ
    తత్వదర్శి; చెప్పు తప్పు లెల్ల
    కాసులందు కొరకు కపట సన్యాసి,తా
    భోగి గాక సిద్ధ యోగి యగునె

    రిప్లయితొలగించండి
  14. కాచి వడగ జేయు కాలము నంతయు
    తత్త్వ దర్శి, చెప్పు దప్పు లెల్ల
    చేతకాని యొజ్జ శిష్య గణములకు
    నొప్పు జెప్ప మేలు నె ప్పటికిని

    రిప్లయితొలగించండి
  15. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. మల్లెల వారి పూరణలు

    సుఖము గలుగ నదియ సుఖమేను గాదనున్
    దుఃఖమంద, కాదు దుఃఖ మదియ
    టంచు తెల్పుచుండ నదియ విన్నననమె
    "తత్వ దర్శి చెప్పు తప్పులెల్ల"

    భార్యబిడ్డలెలమి బంధాలటంచును
    తత్వ దర్శి చెప్పు- తప్పులెల్ల
    కనగ నిజము కవియె కావుగా తప్పులు
    దుఃఖ భాజనాలు సుఖములెల్ల

    తప్పులొప్పులందు తలపభేదము లేదు
    తప్పునొప్పునగును, నొప్పు తప్పు
    ననుచు నిజము తెలిసి యలరారి విజ్ఞతన్
    తత్వదర్శి చెప్పు తప్పులెల్ల

    ఇలను నిలచు టెల్ల నిక్కట్ల కిరవౌను
    దైవ మందు వాడె ధన్యుడగును
    మనుట గొప్పకాదు మాన్యతగొనుడంచు
    తత్వ దర్శ్డి చెప్పు తప్పులెల్ల

    రిప్లయితొలగించండి
  17. తత్త్వ మెరిగి మసల ధన్యులు ధరలోన
    తత్త్వ మెరుగ కున్న తప్పు లగును
    తత్త్వ మెరుగ నీకు తప్పదు కావలె
    తత్త్వదర్శి, చెప్పుఁ దప్పు లెల్ల.

    రిప్లయితొలగించండి
  18. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. సాహితీ మిత్ర బృందమునకు నమస్సులు.

    జనుల మోసగించు, జగడమ్ములాడును,
    మద్యపానమందు మమతఁజూపు,
    "సాధు జనుఁడ"ననును! సకలదుర్వ్యసనుఁ డా
    తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెల్ల!

    రిప్లయితొలగించండి
  20. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. మనుజ సేవచేయ మాధవసేవని
    తత్వదర్శిచెప్పు-తప్పులెల్ల
    నెన్నువారుతమవెన్నునెరుగరను
    శతకకర్త పలుకు సత్యవాక్కు

    రిప్లయితొలగించండి
  22. రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. తప్పు చేయు జనులు ధరణిని కొల్లలు
    తాముఁ జేయుపనుల తప్పు యొప్పు
    తెలియగ తమ పెద్ద దిక్కుగ నమ్మిన,
    తత్త్వదర్శి చెప్పుఁ దప్పు లెల్ల

    రిప్లయితొలగించండి
  24. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి