11, జులై 2014, శుక్రవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 26

రామాయణము-
గీ.       (పరఁగఁ జిగురాకుచేతుల గురువుగ శ్రమ
వాయ విసరెఁ గొమ్మలపరి; భాసురముగ
ద్విజరవముల మధ్య రహిన్ నృపజులపయి ర
మ నలరులు నొలసెన్;) హెచ్చె మంజులతలు. (౪౧)

భారతము-
కం.    పరఁగఁ జిగురాకుచేతుల
గురువుగ శ్రమ వాయ విసరెఁ గొమ్మలపరి; భా
సురముగ ద్విజరవముల మ
ధ్య రహిన్ నృపజులపయి రమ నలరులు నొలసెన్. (౪౧)

టీక- (రెంటికి సమము) చిగురాకుచేతులన్ = చిగురులను చేతులతో; కొమ్మలపరి = వృక్షశాఖలగుంపు; ద్విజరవముల = పక్షుల పలుకుల; అలరులు = పుష్పములు; మంజులతలు = సుందరములగు తీవలు; [చిగురాకుచేతుల = చిగురులవంటి చేతులతో; కొమ్మలపరి = స్త్రీసమూహము; ద్విజరవములు = బ్రాహ్మణుల పలుకులు (మంత్రములు); అలరులు నొలసెన్ = సంతోషములు వ్యాపించెను; మంజులతలు = మనోహరత్వములు- అని అర్థాంతరము. ముందు కాఁబోవు వివాహమునకు సూచనలు.]

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి