సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగున్నది మీ పద్యం. అభినందనలు, ఆశీస్సులు, ధన్యవాదాలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో యతి తప్పింది. ‘ఆగమముల జెప్పి వ్యాససంయమి...’ అందామా?
శ్రీ కంది శంకరయ్య మరియు శ్రీ పండిత నేమాని గురువర్యులకు శంకరాభరణ బ్లాగు గురు తుల్యులకు వ్యాస గురు పౌర్ణిమ శుభాకాంక్షలు . జయ కావ్యము సృష్టించితి వయ, వ్యాస మహా మునీంద్ర వందన మయ్యా! మెయికొని రందరు, జనుల హృ దయములో నిలుచునెపుడు తమ కృతి గురు శ్రీ!
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువర్యులు కంది శంకరయ్య గారికి, పండిత నేమాని గారికి, బ్లాగ్ లోని కవివర్యులందరికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మీ అందరూ నాకు గురువులే. అందరినించి ఎంతోకొంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అందరికి ధన్యవాదములు.
గురు పూర్ణిమ రోజున మన గురువర్యులు శంకరయ్య కోవిదుఁ భక్తిన్ స్మరియింతు, వారి కృపతో మెరుగగు పద్యముల వ్రాసి మెప్పునుగొనెదన్
అంచిత మగుకావ్య మలరె
రిప్లయితొలగించండిపంచమ వేదం బనదగు భారత కధలన్
చంచలమగు ధర్మ నిరతి
వంచన లేకుండ దెలిపె వ్యాసుడనంగన్
చంచలము= మెఱుపు
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురువులకు గురుపూర్ణిమ సందర్భముగా ప్రణామములు + ధన్య వాదములు
రిప్లయితొలగించండిగురుపౌర్ణమి సందర్భంగా గురుదేవులకు మన గురు పరంపరకు నా నమఃసుమాంజలులు.
రిప్లయితొలగించండిగురువే జగతికి మార్గము!
గురువే పరమేశుఁ జూపు కోవెల! గురువే
వరమై శిష్యుని దీర్చును
గురువుని పూజించ రండు గోవిందునిగన్!
దండము వ్యాసునకును మరి
రిప్లయితొలగించండిదండము శ్రీ శంకరునకు ధర జ్ఞానమునే
దండిగ వెలిగించగ మన
కుండిన ఘన గురులకు నొనగూర్తును నతులన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేద విద్యలనిడి వేద వ్యాసుండు తా
రిప్లయితొలగించండివేద గురువు గాను వినుతి కెక్కె
మొదటి గురువటంచు మోదమ్ముతో ప్రజ
జరుపు చుండ్రి గురువు జన్మ దినము
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగున్నది మీ పద్యం. అభినందనలు, ఆశీస్సులు, ధన్యవాదాలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. ‘ఆగమముల జెప్పి వ్యాససంయమి...’ అందామా?
శ్రీ కంది శంకరయ్య మరియు శ్రీ పండిత నేమాని గురువర్యులకు శంకరాభరణ బ్లాగు గురు తుల్యులకు వ్యాస గురు పౌర్ణిమ శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిజయ కావ్యము సృష్టించితి
వయ, వ్యాస మహా మునీంద్ర వందన మయ్యా!
మెయికొని రందరు, జనుల హృ
దయములో నిలుచునెపుడు తమ కృతి గురు శ్రీ!
అలసులు మందబుద్ధి బలురయ్యొ కలిన్ జనులంచు జాలితో
రిప్లయితొలగించండిసలిపి విభాజనమ్ము శ్రుతి సంచయమున్ సరిజేసి మంత్రముల్
సులువుగ బ్రాహ్మణమ్ములును సూక్తములున్ నిగమాంత ధర్మముల్
తొలిగురువైన వ్యాసముని దోయిలి యొగ్గి నుతింతు భక్తితో.
శక్తి మహర్షి పౌత్రునకు సాత్యవతేయునకున్ విరాగికిన్
ముక్తికి ద్రోవ జూపి మది మోహము బాపెడు గీత కర్తకున్
రక్తిగ పంచమశ్రుతిని వ్రాసిన మౌనికి దీవిపుట్టుకున్
భక్తిని దోయిలించెదను భావపు కల్మషముల్ హరింపగన్.
గురువుగారికి, గురుసములకు వందనములు.
రిప్లయితొలగించండిగురువులకెల్ల గురువగుచు;
గురువులనెల్ల నగపడుచు; గురువుగ తానే
మరి మరి మమ్ములఁ గనుచును
కరుణను దీవనలనిచ్చు కనగా జగతిన్.
వ్యాసుడు గురువులకే గురువు. అందరు గురువులందునూ వారే అగపడుదురు. ఇంకా చెప్పాలంటే మన గురువులందరి రూపాలనూ ధరించెడు వాడు వ్యాసుడే అగుచున్నాడని నా భావము.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువర్యులు కంది శంకరయ్య గారికి, పండిత నేమాని గారికి, బ్లాగ్ లోని కవివర్యులందరికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మీ అందరూ నాకు గురువులే. అందరినించి ఎంతోకొంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అందరికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురు పూర్ణిమ రోజున మన
గురువర్యులు శంకరయ్య కోవిదుఁ భక్తిన్
స్మరియింతు, వారి కృపతో
మెరుగగు పద్యముల వ్రాసి మెప్పునుగొనెదన్