23, జులై 2014, బుధవారం

పద్యరచన - 629

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. అల్లరి జేయక పాపా
    మెల్లగ నిద్దరిని జేరి మేలగు చదువున్
    చల్లగ జదివిన చాలును
    నుల్లము రంజిల్లు రీతి నుద్ధతి నొందన్

    రిప్లయితొలగించండి
  2. తల్లి వెనుకన నిలబడి తనయ యచట
    తల్లి వ్రాసెడి యక్షర తతుల నిరతి
    దాను నేర్చు కోవలెనను దహదహతన
    చూచు చుండెను జూడుమా సూర్య !నీవు

    రిప్లయితొలగించండి
  3. అమ్మ వీపు మీద హాయిగ నూగుచు
    నాడుకొనుచు చిట్టి యమ్ములుండ
    అక్షరములు దిద్దుటలవాటు చేయగ
    పలకమీద తల్లి వ్రాయుచుండె

    రిప్లయితొలగించండి
  4. పుడమిపై బడుదాక కడుపులో దాచుక
    ......కంటికి రెప్పలా కాచుకొనును
    ఏ వేళ నాకలి కేడ్చునో బిడ్డని
    ......గుండెల బువ్వను కూర్చుకొనును
    నేనె కాదుర కన్న నీకు వీరొకరని
    ......నాన్నను చూపించి నవ్వుకొనును
    పాల ద్రావుచు నాడ తాళితో, వదిలించి
    ......బుల్లి చేతిని పట్టి ముద్దులిడును
    బుడిబుడి నడకల తడబడి పడిపోవ
    ......తత్తరపడి మేను తడుముకొనును
    చిన్ని తప్పులు జేయ చిట్టి దండన లిచ్చి
    ......నిదురోవ ముద్దాడి కుదురుకొనును
    పాలబుగ్గల పైన బాష్పధారలు చూడ
    ......చింతతో తనకనుల్ చెమ్మగిలును
    బొజ్జ నిండెడు దాక బుజ్జగింపులు చేసి
    ......పాలబువ్వను బెట్ట పాట్లు పడును
    చందమామా రావె జాబిల్లి రమ్మని
    ......అన్నమయ్య పదాల నందుకొనును
    లాలిలాలీ యంచు జోల పాటలు పాడి
    ......నిద్రించగా బిడ్డ భద్రమనును
    పూని లేజేతుల నోనమాలను దిద్ద
    ......కందిపోయినవని కలత వడును
    బడికి పోనని యేడ్వ భయపెట్టగా తండ్రి
    ......తాళలేకను చూచి తల్లడిలును

    బిడ్డయే తిండి తల్లికి బిడ్డె నిద్ర
    బిడ్డయే సర్వ సౌఖ్యము బిడ్డె జగము
    ఎన్ని జన్మల కైనను నింతయైన
    తరుగబోనిది మనిషికి తల్లి ఋణము.

    రిప్లయితొలగించండి
  5. వ్రాయు చున్నది తల్లి తా పలక మీద
    కన్న బిడ్డకు నేర్పెడి కాంక్ష తోడ
    వీపుపై నుండి చినపాప ప్రీతి తోడ
    చూచు చున్నది వ్రాయుటన్ సోద్దెముగను
    అమ్మయే నిజముగ బిడ్డ కాది గురువు

    రిప్లయితొలగించండి
  6. బడివంటి యమ్మ యొడిలో
    నడవడిక లలవడు మేటి నాణ్యత లొప్పన్!
    నుడికారము నేర్చి బ్రతుకు
    తడబాటులఁ దీర్చి దిద్దు తాలిమి కూరున్!

    రిప్లయితొలగించండి
  7. మిస్సన్నగారూ !అమ్మ ప్రేమ గురించి అంతా చెప్పేశారు...బాగుంది

    అమ్మా ! యీ పలకను వల
    దమ్మా మరి యక్షరమ్ము లన్నీ యిపుడా ?
    అమ్మాయీ ! పలకను మరి
    యమ్మాయని వెనుకజేరియల్లరి జేయన్.

    రిప్లయితొలగించండి
  8. ఈనాటి చిత్రానికి మనోహరమైన పద్యాలను అందించిన కవిమిత్రులు...
    రాజేశ్వరి అక్కయ్యకు,
    సుబ్బారావు గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    మిస్సన్న గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. తల్లియె తొలిగురువెప్పుడు
    పిల్లలకెరిగింపజేయ విద్యాబుద్ధుల్
    అల్లరి మానుప జేయుచు
    యెల్లరి మన్ననలుపొంది యేలగజగతిన్

    రిప్లయితొలగించండి
  10. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘చేయుచు నెల్లరి...’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. పలకను బట్టి వర్ణములు వ్రాసి పఠింపగ జేయ నెంచియున్
    చెలియగ మారి జ్ఞానమిడ చెప్పుచు నుండెను బుద్ధులెన్నియో
    విలువలు సంప్రదాయమును విద్యను నేర్పుచు కన్నతల్లిగా
    తొలి గురువయ్యె కూతురుకు తోడుగ నిల్చియు తీర్చి దిద్దగా!

    రిప్లయితొలగించండి
  12. పాప తోడి యాడి పాడుచు తల్లులు
    పలకమీద వ్రాయు పలుకులమ్మ
    లగుచు బిడ్డ చదువులందు వెన్కబడక
    నుండ తోడు నిల్తురోయి గనుము.

    రిప్లయితొలగించండి
  13. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి