8, జులై 2014, మంగళవారం

పద్యరచన - 614

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. నిన్నటి చిత్రానికి చంద్రమౌళి రామారావు గారి పూరణ : కరెంటు కోతలవలన ఆలస్యముగా టైపు చేయడమైనది
  సరిగమ పదనిస స్వరసుర ఝరి నిలఁ
  బారించి నట్టి తాపసి యతండు
  కర్ణాట సంగీత కమనీయ సత్కళా
  శారద చేతి కచ్ఛతి యతడు
  దేశ విదేశీయ ధీయుతాహీంద్రుల
  తలలూపు గాన గందర్వు డతడు
  ఉస్తాదులు గూడ కుస్తీకిఁ తలపడ
  వణకెడు కోవిదాగ్రణి యతండు
  మంగళం పల్లి వంశాబ్ది పొంగి పొరల
  బాలమురళి గాఁ బుట్టి గోపాల బాలు
  పెదవిఁ దాకిన మురళి యై పెంపుఁ దనరి
  భువనములను సమ్మోహనమొందజేసె

  రిప్లయితొలగించండి
 2. ఇన్నాళ్ళకు గుర్తొచ్చా
  చాన్నాళ్ళకు వచ్చినావె చప్పున వానా
  నిన్నే చుట్టములాగా
  చెన్నుగనే చేరదీయ చేతుల నిడితిన్.

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ అన్నగారి పద్యాన్ని నిన్నటి పోస్టులోనే సమీక్షించాను.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  కొన్ని వ్యావహారిక పదాలు నువ్వస్తానంటే నే వద్దంటానా అన్నట్టు కలిసిపోయాయి. తప్పదు మరి! పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. తొలకరి జల్లుకు త్రుల్లుతు
  కులుకుల గెంతెడు పులకల కోమలిఁ జూడన్!
  సలసల వేడికి తడువగ
  కలకల లాడెడు పుడమిన కళలే తోచెన్!

  రిప్లయితొలగించండి
 5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము....

  గ్రీష్మఋతువునందు గేహమున్ వదలని
  ముద్దుగుమ్మ యిపుడు ముదముతోడ
  వాననీటిలోన పరవశించుచునుండె
  తనదు తాపమంత తరపు నంచు.
  (తరపు = హరించు)

  రిప్లయితొలగించండి
 6. సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. వానలు కురియగ నెల్లరు
  దీనత వీడి మనమందు తృప్తిని గనిరీ
  కోనలఁ గొండల యందము
  బైనది మరి రెండు రెట్లటంచును మదిలో.

  రిప్లయితొలగించండి
 8. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. పండిత నేమాని వారికి స్వస్థత చేకూరిందని భావిస్తున్నాను.
  కందుల వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 10. కవిమిత్రులారా,
  గురువర్యులు పండిత నేమాని వారు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిలో ఏమార్పు లేదని వారి మనుమలు తెలియజేశారు.

  రిప్లయితొలగించండి
 11. తొలకరి జల్లు గాంచియును తొందరగా జని వర్ష ధారలో
  నలికుల బాలికా కుసుమ మల్లన యల్లన తడ్సి పోవుచున్
  జలికిని లెక్క జేయకను సంతస మొందుచు యాడి పాడుచున్
  పోలయుచు మట్టి గంధమును బొందుచు నుండెను దన్మయంబుతో

  రిప్లయితొలగించండి
 12. జల్లందున వొడలెల్లను
  ఝల్లుమనంగ నిలువెల్ల చల్లని ముద్దౌ
  యల్లరి పిల్లకు లేవే
  యెల్లలు తుళ్ళుతు నెగురుతు నిల్లే మరచెన్

  రిప్లయితొలగించండి
 13. తొలకరి జల్లులు కురియగ
  పులకించుచు పుడమితల్లి మొలకెత్తునుగా
  జలజల రాలెడు ధారల
  నిలువెల్లాతడిసి మురిసి నెచ్చెలి నాడెన్

  రిప్లయితొలగించండి
 14. మాస్టరుగారూ ! ధన్యవాదములు...ఆపాట దృష్టిలో పెట్టుకునే వ్రాశానండీ..అందుకే అలా...

  చల్లని వానే కురియగ
  జల్లుగనే మోము మీద చాలా ముదమే
  ఝల్లను మనసే, తడవగ
  పిల్లలవలె నాట్యమాడు పెద్దలె నిజమే !

  రిప్లయితొలగించండి
 15. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  బాగున్నది మీ పద్యం. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. వానలు కురియగ నెల్లరు
  దీనత వీడి మనమందు తృప్తిని గనిరీ
  కోనలఁ గొండల యందం
  బైనది మరి రెండు రెట్లటంచును మదిలో.

  రిప్లయితొలగించండి