అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * యం.ఆర్. చంద్రమౌళి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘విదూరె’ అనడం కన్నడ సంప్రదాయమా? టైపాటా? * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ ఆలోచనలెప్పుడూ వైవిధ్యంగా ఉంటాయి. పూరణ బాగుంది. అభినందనలు. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు. రెండవ పాదంలో యతి తప్పింది. ‘మెప్పింన్+చి’ అని నకారానికి యతి కూర్చారు. అది మెప్పించి (మెప్పిఞ్చి). ఞ-న లకు యతిలేదు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీరు సవరించిన పూరణ బాగున్నది. మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, ఇదేదో నన్ను ఉద్దేశించిన పూరణలా ఉన్నది. ధన్యవాదాలు. నా భార్య పేరు శాంతి. కాని ఇంట్లో అశాంతికి, నేనిలా వృద్ధాశ్రమంలో ఉండడానికి ఆమే కారణం. ‘భువినిన్’ అనండి. * మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం : కవులకు కవనము నేర్పెడు వివరము లెరిగిన కవివరు వేదన దొలగన్ భువినిన్ శాంతి ప్రసాదిం చవట కదా! నిన్ను దలఁప శంకర పత్నీ!
గురుదేవులకు శాంతి ప్రసాదించాలని పార్వతీ మాతను నిందించే ఉద్దేశంతో వ్రాసిన పద్యమే కాని, తమరి వ్యక్తిగత విషయంపై వ్రాసిన పద్యం కాదు. అలా మీకనిపించి వుంటే మన్నించ ప్రార్థన.
అవనిని దైవము లేదను
రిప్లయితొలగించండిచవట కదా , నిన్ను దలప శంకర పత్నీ
నవవిధ భక్తిని గొలిచిన
భువి నేలగ వత్తు వంట భోగము లిడగన్
నవశక్తికారిణి జనని
రిప్లయితొలగించండిభవరోగవిదూరె దేవి భార్గవి నేనీ
భువినియధర్మము సలుపగ
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ
శివమును గోరుచు నిన్నే
రిప్లయితొలగించండియవనిని తగు భక్తి తోడ నారాధింపన్
భవరోగముమాపై నుం
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవనిని ధర్మము నిలుపగ
రిప్లయితొలగించండిబవరము జేసియు దనుజుల పరిమార్చితివో
నవదుర్గా, పాపము లెం
చవట గదా!నిన్ను దలప శంకరపత్నీ!
దివిగల పుష్పము గోరుచు
రిప్లయితొలగించండిసవతిని గని యోర్వ లేక సంకట పడుచున్
లవమైన పతిని బాధిం
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
శివుని తపముచే మెప్పిన్
చి వరముగా నతని యాత్మనే దెచ్చెద నీ
యవని కనుచు లంకేశుడు
చవట కదా! నిన్ను దలప శంకర పత్నీ
అవనీ జనంబులన్ విడ
రిప్లయితొలగించండిచవటగద నిన్నుదలప శంకర పత్నీ
పవలును రేయియు నిష్టన్
భవదీయ భజన సలుపుదు పావన జననీ
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విదూరె’ అనడం కన్నడ సంప్రదాయమా? టైపాటా?
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ఆలోచనలెప్పుడూ వైవిధ్యంగా ఉంటాయి. పూరణ బాగుంది. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. ‘మెప్పింన్+చి’ అని నకారానికి యతి కూర్చారు. అది మెప్పించి (మెప్పిఞ్చి). ఞ-న లకు యతిలేదు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివునిం ధర దూరు నతడు
రిప్లయితొలగించండిచవట కదా ,నిన్ను దలప శంకర పత్నీ !
యవిరళ సంపద లిత్తువు
సవినయముగ జెప్పు చుంటి సరియగు మాటన్
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
సవరించిన పూరణ
శివుని తపముచే మెప్పి౦
చి వరముగా నతని యాత్మచేకొని వత్తు
న్నవని కనుచు లంకేశుడు
చవట కదా! నిన్ను దలప శంకర పత్నీ
కవులకు కవనము నేర్పెడు
రిప్లయితొలగించండివివరము లెరిగిన కవివరు వేదన దొలగన్
భువినన్ శాంతి ప్రసాదిం
చవట కదా! నిన్ను దలఁప శంకర పత్నీ!
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మరియొక పూరణ:శివసాక్షాత్కారమ్మున
భవునాత్మను వేడ మరచి ప్రక్కను గల నీ
ఛవి గోరెను లంకేశుడు
చవట కదా! నిన్ను దలప శంకర పత్నీ!
నవదుర్గా విజయేశ్వరి
రిప్లయితొలగించండిశివశక్తీ లోకజనని శ్రీమాతా భా-
ర్గవి యన బాములు బాధిం-
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిశివమని తలపక వనితలు
భవమౌ శ్రావణమునందు భర్తల కొఱకై
భువి పూజలిడమి, రక్షిం
చవట గదా నిన్ను దలప శంకర పత్నీ!
భవమగు మంగళ గౌరీ!
"ఎవరైనను పూజలందు నిష్టము లేకుం
డ వరలు, వారిని రక్షిం
చవట గదా నిన్ను దలప శంకర పత్నీ"!
శివునికి నర్ధపు భాగము
భవమని యెంచక, విడిగను భాగ్యము గొనగా
ఎవడటు పూజించు నతడె
చవట గదా! నిన్ను తలప శంకర పత్నీ!
భవమౌ శ్రావణ మంగళ
శివ పత్నీ! పూజలిడక సేమము నిడుదే?
ఎవరిని చల్లగ వీక్షిం
చవట గదా! నిన్ను దలప, శంకర పత్నీ!
భవ బాధలు బడుచుండెడు
రిప్లయితొలగించండినవలామణులంత ప్రార్థనలఁ రాగముతో
రవలించిన బాధలు పెం
చవట గదా నిన్ను దలప శంకర పత్నీ!
మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమస్సుమాంజలులు.
రిప్లయితొలగించండిప్రవిమల భక్తినిఁ గొని, హై
మవతీ! శాంకరి! భవాని! మాహేశ్వరి! శాం
భవి! గౌరీ! దోసము లెం
చవట కదా, నిన్నుఁ దలఁప శంకర పత్నీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంద్రమౌళి రామారావు గారి పూరణ :
రిప్లయితొలగించండిఎవరికి కష్టము వచ్చిన
నవలీలగ బాపి కాతువట ప్రేమ సుధా
ర్ణవమై పొంగి కలుషముం
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీరు సవరించిన పూరణ బాగున్నది.
మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
ఇదేదో నన్ను ఉద్దేశించిన పూరణలా ఉన్నది. ధన్యవాదాలు.
నా భార్య పేరు శాంతి. కాని ఇంట్లో అశాంతికి, నేనిలా వృద్ధాశ్రమంలో ఉండడానికి ఆమే కారణం.
‘భువినిన్’ అనండి.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంద్రమౌళి రామారావు గారూ,
రిప్లయితొలగించండిమన్నించాలి. ఆ పూరణ మీ సోదరుల పూరణ అనుకున్నాను.
చక్కని పూరణ అందించారు. అభినందనలు.
నవనీతము వంటి హృదయ
రిప్లయితొలగించండివు వరములిడి వెతలయందు బ్రోవగ నీవే
యవరోధ మైన గణి యిం
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండికవులకు కవనము నేర్పెడు
వివరము లెరిగిన కవివరు వేదన దొలగన్
భువినిన్ శాంతి ప్రసాదిం
చవట కదా! నిన్ను దలఁప శంకర పత్నీ!
గురుదేవులకు శాంతి ప్రసాదించాలని పార్వతీ మాతను నిందించే
ఉద్దేశంతో వ్రాసిన పద్యమే కాని, తమరి వ్యక్తిగత విషయంపై వ్రాసిన పద్యం కాదు. అలా మీకనిపించి వుంటే మన్నించ ప్రార్థన.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాస్టరుగారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
నా ఇప్పటి పరిస్థితికి మీ పద్యం అద్దం పట్టినట్లుంది. ఫరవాలేదు.
చాలా ఆన౦ద౦గా ఉ౦ది.
రిప్లయితొలగించండియువతుల పొందును గోరుచు
రిప్లయితొలగించండినవయౌవనమందు నిన్ను నమ్మని వాడై
చివరకు చింతల కోర్వక
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!
బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీ సక్తః |
వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహ్మణి కో పి న సక్తః ||
రిప్లయితొలగించండిపవళముల తలచు మనుజుడు
చవట కదా! నిన్నుఁ దలప శంకరపత్నీ
శివమయమైన జగత్తున
భవబంధమ్ములను మీరి భవితను గనునే !
జిలేబి