గురువు పాఠము వివరించు తఱిని "పద్మవదన, పద్మ నయన" యను వర్ణనలనుగని పలికెనిట్లు శిష్యసంఘమ్ము తోడ-"పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు."
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు కలికి వదనపద్మమ్మున కలువ కనులు మిత్రునకు నాప్తు లొక్కరు శత్రువొకరునిరువురిని పొందె నీ లతాంగిదియ వి౦త .పూవులో రెండు పూవులు పూచె గనుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మల్లె తీగెల నల్లెను యుల్ల మలర జాజి విరజాజు లన్నియు మోజు బడుచు కనుల విందుగ వికసించె గనగ వింత పూవులో రెండు పూవులు పూచె గనుడు
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రులందఱికిని నా నమోవాకములు. పూజ్యులు పండితనేమానివారికి శీఘ్రస్వస్థతఁ జేకూర్పవలెనని యా భగవంతుని బ్రార్థించుచు...ఉవిద ముఖపద్మమునను నీలోత్పలములుసూర్యచంద్రులు లేకయే చోద్యముగనువికసనమునందెఁ గవులార వేగిరముగఁబూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు!
పుడమి తల్లికి పుష్పమై పూచె సీత పుత్రులిరువురు గలిగిరి భూమిజకును పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడురాముడేలెను రాజ్యము రక్తిమీర
పద్మ మందున తానుంచి పాదములను మాత లక్ష్మియె నిలుచున్న రీతి జూడ పాదయుగళమ్ము బోల్చగా పద్మమనుచు పూవులో రెండు పూవులు పూచె గనుడు
సిగ్గులొలుకుచు ప్రేయసి చెంత నిలువకమలిని ముఖారవిందాన కనులు జూచిపరవశమ్మున చెలికాడు పలికె నిటులపూవులో రెండు పూవులు పూచె గనుడు
’ముఖ కమలమన కమలాలు పూచె’ ననుచుకాళిదాసు పూరించెనట కవులుమెచ్చశంకరార్యుండు తెలుగించె శంకదొలగ"పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు”
మల్లెల వారిపూరణలుబిడ్డ కల్గగలేదనిభీతి న౦దివైద్యుకున్ జూపె భార్యను, భర్త తోడ నాతడు తెలిపెను కవలల న౦దు వీవు పూవులో రెండు పూవులు పూచె గనుడుముద్దా మందార మందున ముదము మీర పూవులయ్యెడి పెక్కురు పొదల గాదె వింత గాదది యంచును విప్పి జూపె పూవులో రెండు పూవులు పూచె గనుడు పద్మముఖి యని యందురే పండితాళి ముఖము నందున కన్నులే మోద మిచ్చు రె౦దు కలువలు యట్లని లీలగాను పూవులో రెండు పూవులు పూచె గనుడు
బ్లాగువనమున శంకరా భరణమనెడుపుష్ప,మందు సమస్యల పూరణంబు,పద్యరచనమనెడు కుసుమాలు పూయు పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు
కమలముల వంటి చక్కని కనుల తోడపొన్నపువ్వును బోలెడు పొక్కిలి కడుశోభ గూర్చ ననెనొకండు సుభగిఁ గాంచిపూవులో రెండు పూవులు పూచెఁ గనుడు
చిత్తరువులనుంచిన శాల చేరినాము,మనములింపార తిలకించి మదిని నింపికొనుడు, మిత్రమా! దృష్టిని కొంత నిలిపిపూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు.
వసుధ వెలుగులఁ జిమ్ముచు వాసి కెక్కెతెలుగు భాషా ప్రసూనమ్మ తేనెలమ్మ! రెండు రాష్ట్రాలుగ విరిసె,లెస్స బలుకపూవులో రెండు పూవులు పూచెఁ గనుడు!
సహదేవుడు గారూ ! చక్కని ఊహ...బాగుంది.
కవిమిత్రులు గోలి వారికి ధన్యవాదాలు.
సూర్యు డొక్కటి పుష్పమ్ము చూడగాను చంద్రుడింకొక సుమమేను చక్కగాను కన్నులమ్మకు లలితకు కమల ముఖికి పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు !
కవిమిత్రులకు నమస్కృతులు.రాత్రినుండి జ్వరం వస్తున్నది. అందువల్ల మీ పూరణలను వెంటవెంటనే సమీక్షించలేకపోయాను. మన్నించండి.ఈనాటి సమస్యకు చక్కని పూరణలను అందించిన....ఊకదంపుడు గారికి,కెంబాయి తిమ్మాజీ రావు గారికి,రాజేశ్వరి అక్కయ్యకు,గుండు మధుసూదన్ గారికి,భాగవతుల కృష్ణారావు గారికి,గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,శైలజ గారికి,యం.ఆర్.చంద్రమౌళి గారికి,మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,లక్ష్మీదేవి గారికి,సహదేవుడు గారికి,అభినందనలు, ధన్యవాదాలు.
మాస్టరుగారూ ! ధన్యవాదాలు...కొంత విశ్రాంతి తీసుకొనండి..త్వరగా స్వస్థత చేకూరాలని కోరుకొనుచున్నాను.
గురువు పాఠము వివరించు తఱిని "పద్మ
రిప్లయితొలగించండివదన, పద్మ నయన" యను వర్ణనలను
గని పలికెనిట్లు శిష్యసంఘమ్ము తోడ-
"పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు."
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
కలికి వదనపద్మమ్మున కలువ కనులు
మిత్రునకు నాప్తు లొక్కరు శత్రువొకరు
నిరువురిని పొందె నీ లతాంగిదియ వి౦త .
పూవులో రెండు పూవులు పూచె గనుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లె తీగెల నల్లెను యుల్ల మలర
రిప్లయితొలగించండిజాజి విరజాజు లన్నియు మోజు బడుచు
కనుల విందుగ వికసించె గనగ వింత
పూవులో రెండు పూవులు పూచె గనుడు
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రులందఱికిని నా నమోవాకములు. పూజ్యులు పండితనేమానివారికి శీఘ్రస్వస్థతఁ జేకూర్పవలెనని యా భగవంతుని బ్రార్థించుచు...
రిప్లయితొలగించండిఉవిద ముఖపద్మమునను నీలోత్పలములు
సూర్యచంద్రులు లేకయే చోద్యముగను
వికసనమునందెఁ గవులార వేగిరముగఁ
బూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు!
పుడమి తల్లికి పుష్పమై పూచె సీత
రిప్లయితొలగించండిపుత్రులిరువురు గలిగిరి భూమిజకును
పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు
రాముడేలెను రాజ్యము రక్తిమీర
రిప్లయితొలగించండిపద్మ మందున తానుంచి పాదములను
మాత లక్ష్మియె నిలుచున్న రీతి జూడ
పాదయుగళమ్ము బోల్చగా పద్మమనుచు
పూవులో రెండు పూవులు పూచె గనుడు
సిగ్గులొలుకుచు ప్రేయసి చెంత నిలువ
రిప్లయితొలగించండికమలిని ముఖారవిందాన కనులు జూచి
పరవశమ్మున చెలికాడు పలికె నిటుల
పూవులో రెండు పూవులు పూచె గనుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి’ముఖ కమలమన కమలాలు పూచె’ ననుచు
రిప్లయితొలగించండికాళిదాసు పూరించెనట కవులుమెచ్చ
శంకరార్యుండు తెలుగించె శంకదొలగ
"పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు”
మల్లెల వారిపూరణలు
రిప్లయితొలగించండిబిడ్డ కల్గగలేదనిభీతి న౦ది
వైద్యుకున్ జూపె భార్యను, భర్త తోడ
నాతడు తెలిపెను కవలల న౦దు వీవు
పూవులో రెండు పూవులు పూచె గనుడు
ముద్దా మందార మందున ముదము మీర
పూవులయ్యెడి పెక్కురు పొదల గాదె
వింత గాదది యంచును విప్పి జూపె
పూవులో రెండు పూవులు పూచె గనుడు
పద్మముఖి యని యందురే పండితాళి
ముఖము నందున కన్నులే మోద మిచ్చు
రె౦దు కలువలు యట్లని లీలగాను
పూవులో రెండు పూవులు పూచె గనుడు
బ్లాగువనమున శంకరా భరణమనెడు
రిప్లయితొలగించండిపుష్ప,మందు సమస్యల పూరణంబు,
పద్యరచనమనెడు కుసుమాలు పూయు
పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు
కమలముల వంటి చక్కని కనుల తోడ
రిప్లయితొలగించండిపొన్నపువ్వును బోలెడు పొక్కిలి కడు
శోభ గూర్చ ననెనొకండు సుభగిఁ గాంచి
పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు
చిత్తరువులనుంచిన శాల చేరినాము,
రిప్లయితొలగించండిమనములింపార తిలకించి మదిని నింపి
కొనుడు, మిత్రమా! దృష్టిని కొంత నిలిపి
పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివసుధ వెలుగులఁ జిమ్ముచు వాసి కెక్కె
రిప్లయితొలగించండితెలుగు భాషా ప్రసూనమ్మ తేనెలమ్మ!
రెండు రాష్ట్రాలుగ విరిసె,లెస్స బలుక
పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు!
సహదేవుడు గారూ ! చక్కని ఊహ...బాగుంది.
రిప్లయితొలగించండికవిమిత్రులు గోలి వారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసూర్యు డొక్కటి పుష్పమ్ము చూడగాను
రిప్లయితొలగించండిచంద్రుడింకొక సుమమేను చక్కగాను
కన్నులమ్మకు లలితకు కమల ముఖికి
పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు !
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిరాత్రినుండి జ్వరం వస్తున్నది. అందువల్ల మీ పూరణలను వెంటవెంటనే సమీక్షించలేకపోయాను. మన్నించండి.
ఈనాటి సమస్యకు చక్కని పూరణలను అందించిన....
ఊకదంపుడు గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
గుండు మధుసూదన్ గారికి,
భాగవతుల కృష్ణారావు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
శైలజ గారికి,
యం.ఆర్.చంద్రమౌళి గారికి,
మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
లక్ష్మీదేవి గారికి,
సహదేవుడు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
మాస్టరుగారూ ! ధన్యవాదాలు...కొంత విశ్రాంతి తీసుకొనండి..త్వరగా స్వస్థత చేకూరాలని కోరుకొనుచున్నాను.
రిప్లయితొలగించండి