కవిమిత్రులకు నమస్కృతులు. నిన్నంతా ప్రయాణంలో ఉండి మీ పూరణలపై వెంటనే స్పందింపలేకపోయాను. మన్నించండి. * అక్కయ్యా, ఉత్తమగతులకోసం కుపతిని సాధ్వి మెచ్చిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మంగమ్మ,సతీసుమతి విషయంగా మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * యం.ఆర్. చంద్రమౌళి గారూ, ‘పలుకు పతి’ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, ‘ప్రశంసలందుటకు పతిని మెచ్చిన సతి‘ని గురించిన పూరణ బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో ‘గని’ టైప్ కాలేదు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, ‘తనకు’ అన్న విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. * శైలజ గారూ, మీ ‘వలపు చిలుకు పతి’ పూరణ బాగున్నది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ ‘దొరుకు పతిని’ గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు. ‘సంస్కారముకు’ అనరాదు కదా.. ‘సంస్కారమునకు’ అనాలి. * అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ, మీ ‘పలుకు పతి’ పూరణ బాగున్నది. అభినందనలు. * సహదేవుడు గారూ, ‘గెలుపునకు’ అంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, ‘మార్పునకు’ అంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ ‘దొరకు పతి’ ‘వెదకు పతి’ పూరణలు బాగున్నవి. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ‘ప్రేమల దొరకు’ పతిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ తేటగీతి పూరణ చాలా బాగుంది. అలా మార్చవచ్చు. అభినందనలు.
నెపముల నెంచక మనమున
రిప్లయితొలగించండికుపతిని గనిమెచ్చె సాధ్వి కోర్కులు మించన్
జపములు జేయుచు నిష్టగ
నుపశమ నమునొంద గోరి నుత్తమ గతులన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
మంగమ్మ శపథం సినిమాలో మంగమ్మ :
(ఎన్.టి.ఆర్,జమున)
01)
______________________________
కుపితమున గలసి కుపతియె
కుపితుండై పెండ్లియాడ - కోమలి గోరెన్
కుపితుడని యెరుక గలిగియు
కుపతిని గని మెచ్చె సాధ్వి - కోర్కులు మించన్ !
______________________________
కుపితము = గ్రామము
కుపతి = భూపతి
కుపితుడు = కోపి
చెడ్డదైనా మంచిదైనా
రిప్లయితొలగించండిభర్త కోరిక తీర్చడమే సతీ సుమతి కోరిక :
02)
______________________________
కుపితుడు,వేశ్యాలోలుడు
విపరీతపు వాంఛ తోడ - వేశ్యను గోర
న్నపరాధ మైన కోర్కెల
కుపతిని గని మెచ్చె సాధ్వి - కోర్కులు మించన్ !
______________________________
కుపితుడు = కోపి
కుపితుడు = కోపి
కుపతి = చెడ్డ భర్త
స్వపర విభేద వివర్జితు
రిప్లయితొలగించండిడుపకారి పరేంగితజ్ఞుడున్నతగుణి ని-
ష్కపట సుమధురముగా పలు
కు పతినిగనిమెచ్చె సాధ్వి - కోర్కులు మించన్
క్షిపణిని నింగికి పంపగ
రిప్లయితొలగించండిశపధము చేబట్టి పంపి చతురుండనగా
నిపుణుల ప్రశంస లందుట
కు పతినిగని మెచ్చెసాధ్వి కోర్కులుమించన్.
కుపితుడు జూదరి యైనను
రిప్లయితొలగించండికుపతిని మెచ్చె సాధ్వి, కోర్కులు మించన్
జపములు తపములు సేయుచు
నపమార్గము దొక్క కుండ హాయిగ నుండెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
జప తపముల మెప్పించి, ము
నిపుంగవు౦ డత్రి పొ౦దె నిష్ఠను ముల్లో
కపు నాథులు సుతులుగ తన
కు,పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉపకారములను జేయుచు
రిప్లయితొలగించండినెపమెంచకమెలగుచుండు నిర్మల మతితో
కపటము లేని వలపుచిలు
కు ,పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్
విపినము నందున చిన్నది
రిప్లయితొలగించండితపమును జేసెను సరిపడు ధవుని కొరకు; నా
మె పరితపించగనే దొరు
కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్!
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిత్రిపతులగు వారి కోర్కెను
నెపమా యనసూయగనక నిసుగుల జేసెన్
సుపతివ్రత, సంస్కారము
కు, పతిని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్
జపతపముల విడి యునుతన
దుపతియు వేశ్యను రమించు దోషపు కోర్కెన్
నెపమెంచని సుమతి యెనా
కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్
"అపవర్గమందు వావిని
నెపమది లేదు మగవాని నింపుగ పొందన్
కుపతియి యూర్వసి యనెగా
కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్
[కుపతి= భూమికి భర్త(రాజు)]
జపములఁ జేయుచు నిత్యము
రిప్లయితొలగించండికపిలుని భజియించు నట్టి కల్మష రహితున్
నిపుణుండై నిజమును పలు
కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్
విపరీతమైనఁ గాలుని
రిప్లయితొలగించండినిపుణతతో నెదిరి భర్త నెగడన్ సావి
త్రి పడసె ప్రాణము, గెలుపున
కు పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్
ఎపు డడిగిన కాదనె వా
రిప్లయితొలగించండిడిపు డిట్టుల నాకు దెచ్చె నీ హారంబున్
విపరీతమైన మార్పున
కు పతిని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.
విపరీతమైన కట్నము
రిప్లయితొలగించండిలప మార్గము పట్టుచుండ లక్షింపకనే
సుపరిచితపు ప్రేమల దొర
కుపతిని గనిమెచ్చె సాధ్వి కోర్కులు మించన్
రిప్లయితొలగించండివిపరీతపు ధరయైనను
నెపమెంచక నడుగగానె నెక్లెస్ తానే
యపుడే తేగానే తన
కు, పతిని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.
అపరిమితపు యానందా
రిప్లయితొలగించండిలుప నర్తన చేయు నామె యూపిరి జతగా
స్వ పరిపాలన కై వెద
కు పతిని గని మెచ్చెసాధ్వికోర్కులు మించన్
మాష్టారు కందాన్ని తేటగీతిగా మార్చ వచ్చునో లేదో తెలియక మార్చాను
రిప్లయితొలగించండినలుని జాడకై దమయంతి నలుదెసలను
తన స్వయంవరమును చాట తరలి వచ్చె
నెల్లరు నట కడకుపతిని గని మెచ్చె
సాధ్వి కోర్కులు మించన్ నిజాత్మఁ లోన
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్నంతా ప్రయాణంలో ఉండి మీ పూరణలపై వెంటనే స్పందింపలేకపోయాను. మన్నించండి.
*
అక్కయ్యా,
ఉత్తమగతులకోసం కుపతిని సాధ్వి మెచ్చిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మంగమ్మ,సతీసుమతి విషయంగా మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
యం.ఆర్. చంద్రమౌళి గారూ,
‘పలుకు పతి’ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
‘ప్రశంసలందుటకు పతిని మెచ్చిన సతి‘ని గురించిన పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో ‘గని’ టైప్ కాలేదు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
‘తనకు’ అన్న విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ ‘వలపు చిలుకు పతి’ పూరణ బాగున్నది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ
‘దొరుకు పతిని’ గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
‘సంస్కారముకు’ అనరాదు కదా.. ‘సంస్కారమునకు’ అనాలి.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ ‘పలుకు పతి’ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
‘గెలుపునకు’ అంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
‘మార్పునకు’ అంటూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ ‘దొరకు పతి’ ‘వెదకు పతి’ పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘ప్రేమల దొరకు’ పతిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ తేటగీతి పూరణ చాలా బాగుంది. అలా మార్చవచ్చు. అభినందనలు.
శపథమ్ములు పాటించక
రిప్లయితొలగించండినెపములతో బీరు త్రాగి నెనరుల తోడన్
కపటమ్మించుక తో బొం
కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్
తపమును జేయుచు తనకై
రిప్లయితొలగించండికపటము వీడుచును తాను కట్టిన త్రాడున్
కపివరు వోలుచు వడి దుం
కు, పతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్