29, జులై 2014, మంగళవారం

పద్యరచన - 635

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఇంద్రధనుస్సు :

    01)
    ______________________________

    మేలి రంగుల కలయిక - మేఘపథము
    మెరుపుతీగను బోలు , నా - మింటిపైన
    మేటి యానంద మందించు - మిన్నువిల్లు !
    మిద్దె పై నెక్కి చూడుడో - మిత్రులార !
    ______________________________
    ఇంద్రధనుస్సు = ఇంద్రధనుస్‌, మిన్నువిల్లు, ఇంద్రాయుధము.

    రిప్లయితొలగించండి
  2. ఇంద్రధనుస్సు :

    02)
    ______________________________

    చేతి కందిన క్రిందికి - చేదు కొనిన
    చేరు యింద్రాయుధము మీదు - చేతి లోన !
    అందకున్నను యానంద - మందు కొనుడు
    కాంచి యింద్రధనుస్సును - కన్నులార !
    ______________________________
    ఇంద్రధనుస్సు = ఇంద్రధనుస్‌, మిన్నువిల్లు, ఇంద్రాయుధము

    రిప్లయితొలగించండి
  3. ఇంద్రధనుస్సు :

    03)
    ______________________________

    చెంగు చెంగున గెంతుచూ - చిన్నవారు
    చిన్నపిల్లలతో పాటు - మిన్నవారు
    చిట్టి జల్లుల తడియుచూ - గట్టిగాను
    చేరి సందడి సందడి - చేతురౌర
    సింగిణిని గాంచ నానంద - చెయిద మెగయ !
    ______________________________
    మిన్నవారు = పొడవైన వారు(పెద్దవారు)
    సింగిణి = ఇంద్రధనుస్సు

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. నగముల మించిన యందము
    గగనంబున విరిసె నంట కన్నుల విందౌ
    సొగసగు నింద్రుని రంగుల
    జగతిని మురిపించు ధనువు సంతస మొందన్

    రిప్లయితొలగించండి
  6. వింటి జూడగ మింటిని, వింటి ముదము
    పట్టలేములె, యిల్లెక్కి పట్టలేము
    మనము రంగులతోనిండు మనము గనగ
    నింద్ర జాలము గాదిది యింద్ర ధనువు.

    రిప్లయితొలగించండి
  7. సూర్య భగవాను కిరణము సోకి నంత
    చినుకు వెలిగించ నాకస చిత్తరువున
    సప్త వర్ణాల హరివిల్లు సంబరమున
    వెండి జలతారు నింగికి వేడుకంట!

    రిప్లయితొలగించండి
  8. ఇంద్ర ధనసు దివిని ఇంపుగా కనుపించ
    వర్షము పడునంచు పరవశమున
    సంతసించె రైతు వంతలు మరచితా
    పల్లె జనుల కంత పండుగాయె

    రిప్లయితొలగించండి
  9. సప్త రంగులున్న యింద్ర చాప మాకసమ్మునన్
    లిప్త పాటు నిలిచి కన్ను రెప్ప మూయనీదులే
    గుప్తమైన రంగులన్ని గుఱుతు జేయ చూపుచున్
    ఆప్త మిత్రులైన యట్టు లచట నుంచి చూసెగా!

    రిప్లయితొలగించండి
  10. వాన వెలిసిన పిమ్మట వాలు గాను
    నాకసంబున గనబడు నద్భుత ముగ
    నేడు రంగుల కలయిక నింద్ర ధనుసు
    దాని యందము వర్ణించ దరము గాదు

    రిప్లయితొలగించండి
  11. ఏడురంగుల హరివిల్లు చూడగానే
    నెంత వేడుక కల్గునో నెల్లరకును
    నింగినేలను కలుపుచు హంగుగాను
    వన్నెలీనుచు విరియునా వాయుఫలము

    రిప్లయితొలగించండి
  12. ఆకసమున విరిసె హరివిల్లుల ద్వయంబు
    వానరాకకీశునానయనగ
    వసుధమాతకింక పంటపండు ననుచు
    భువిని జనులమనము పులకరించె

    రిప్లయితొలగించండి
  13. వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణలో ‘అందకున్నను + ఆనంద’ మన్నప్పుడు యడాగమం రాదు. అందకున్నను నానంద అవుతుంది.అక్కడ ‘అందుకొనకున్న నానంద’ మనండి.
    మూడవ పూరణలో గెంతుచూ, తడియుచూ అని వ్యావహారికాలను వాడినారు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ఆససపు చిత్తరువు అనవలసింది. అక్కడ “ఆకాశచిత్రమందు’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఇంద్రధవువు’ అనండి.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కల్గునో యెల్లరకును’ అనండి.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. వంగ సుమమ్మురంగు, మరి ప్రక్కనె నీలము, నాకుపచ్చయున్
    హంగగు నిండునీలమును, హైమపు వర్ణము, నారిజమ్ములున్
    నింగిని శోభఁ గూర్చె రమణీయపుటెఱ్ఱని రంగుతోడుగా;
    భంగము కాక మున్న నొక పద్యము నందున దాచనెంచితిన్.

    రిప్లయితొలగించండి
  15. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది.అభినందనలు.

    రిప్లయితొలగించండి