26, జులై 2014, శనివారం

పద్యరచన - 632

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

 1. బడుగు బాపడు శౌరికి భక్తి తోడ
  దండ వేయగ నెంచగా తన్వయమున
  స్వామి వంగెను ముందుకు సంతసముగ
  దైవ లీలల నెంచుట తరమె జగతి

  రిప్లయితొలగించండి
 2. అండగ నుండే స్వామికి
  దండను వేయంగ నిలువ, దర్శన మిచ్చెన్
  మెండగు బాపని భక్తికి
  పండరి నాధుండుతలను వంచుచు నిల్చెన్

  రిప్లయితొలగించండి
 3. దండ వేయగ బాపడు దరికి రాగ
  శత్రు మూకల జెండాడు శక్తు డయ్యు
  వంగి వేయించు కొనుటకు మంగ పతియు
  సిద్ధ పడుచుండె జూడుము సీత !యచట

  రిప్లయితొలగించండి
 4. సుమ మాల నీకు వేయగ
  రమా రమణ! జాల ననుచు ప్రాధేయ పడన్
  చమరించిన నయనంబుల!
  కమలాక్షుడు తలను వంచె కానీ మనుచున్!

  దేవుని వైపుకు సాగే
  భావనల త్రికరణ శుద్ధి బాలుని కైనన్
  లావున్న వారి కైనన్
  దీవెన లొసగంగ జేయ దేవుని దించున్!

  రిప్లయితొలగించండి
 5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. నేను గడ్డిపరక నీవు మందారము
  ....జలమేను హరి! నీవు చందనమవు
  తారతమ్యము నెంచ తత్త్వమే చూతును
  ....నిర్మల హృదయుని నేను గాతు
  నిన్ను జేరగ లేను నిను చూడగాలేను
  ....చిక్కవయ్యా నాకు చింత దీర
  నీవొక మెట్టెక్క నేను రెండు దిగుదు
  ....చిక్కెద భక్తికి చింత యేల

  నాదు కరమందు పూమాల నీదు కంఠ
  మందు వేయగా లేనోయి అందవీవు
  నిర్మలాత్మ సద్భక్తికి నేను శిరసు
  వంచి నిలుతును రమ్మోయి వైచు మాల.

  రిప్లయితొలగించండి
 7. మిస్సన్న గారూ,
  మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. దండము స్వామీ! గళమున
  దండను వేయగఁ దలచితి, దయను తలవం
  చండి ప్రభూ బాలుడనన
  మెండగు కరుణను హరి తన మెడనే వంచెన్

  రిప్లయితొలగించండి