కవిమిత్రులారా, గురుదేవులు పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి గత కొద్దికాలంగా ఆరోగ్యం ఏమాత్రం బాగులేదని,ఏమీ తినడం లేదు, త్రాగడం లేదని, వారిని అమెరికన్ హాస్పిటల్‍లో చేర్పిస్తున్నామని వారి మనుమడు రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు తెలియజేశారు. నేమాని వారు సత్వరమే కోలుకోవాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం
పావురములిచట నెగురుచు
రిప్లయితొలగించండిభావుకులకు సంతసమ్ము పంచుచు నింగిన్
వీవనలగు ఱెక్కలతో
దేవుని సేవించుచున్న తీరునుఁ గనుమా!
ప్లేగు వ్యాధి నణచి ప్రేమతో కుతుబుషా
రిప్లయితొలగించండిజ్ఞాప కముగ కట్టె చార్మినారు
పావురములు చాల పలుకరించునచట
చూడ వేడుకగును చోద్య మొప్ప
చుట్టు బ్రక్కల పావురాల్జుట్టు దిరుగ
రిప్లయితొలగించండితీర్ధ యాత్రగ వచ్చిన దెరువ రులిట
యూసు లాడుచు సరదాగ బాసలాడ
కోటి యందాల కాంతుల మేటి గాను
చారు మీనారు గన్బడె జారు తోడ
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిగురుదేవులు పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి గత కొద్దికాలంగా ఆరోగ్యం ఏమాత్రం బాగులేదని,ఏమీ తినడం లేదు, త్రాగడం లేదని, వారిని అమెరికన్ హాస్పిటల్‍లో చేర్పిస్తున్నామని వారి మనుమడు రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు తెలియజేశారు.
నేమాని వారు సత్వరమే కోలుకోవాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మక్కా మసీదు ముంగిట
రిప్లయితొలగించండిచక్కగ పావురములాడు చప్పుడు వినుమా
రెక్కల చప్పుడు వినపడు
ప్రక్కనె గల చార్మినారు పరిసరములలో
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పావన మసీదు నందున
రిప్లయితొలగించండిదేవుని గుణములు పికములు దెల్పగ వినుమా!
భూవని నాల్గు మినార్లట
దీవెనలంది యిల నిల్చి తేజము నొందన్!