27, జులై 2014, ఆదివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 37

రామాయణము-
సీ.      వచ్చిరి దశరథపతియు నా (పాండుస
మాఖ్యుని పుత్రులు) మహిత భరత
శత్రుఘ్నులును; (మెండుసరినిఁ గొనిరి కృష్ణ
మృగనయనను వ్యా)ళమేచకజట
నుర్వీజ రఘురాముఁ డూర్మిళన్ లక్ష్మణుం
డును మాండవి భరతుఁడు శ్రుతకీర్తి
శత్రుఘ్నుఁడు శుభాల్ పస గురుం డనల(సుండ
నఁ; బిలువఁగ ధృతరా)జ్యబలుని కొడు
గీ.       కులనుఁ గోడండ్రఁ గన నొండొరుల సతులు, నృ
పజులు కోసలరా(ష్ట్రుండు స్వపురికిఁ జని
రలరుచు రుచిరగతితో)డ సులువుగ భృగు
రాము గర్వంబు దారిలో రాముఁ డడఁచె. (౫౨)

భారతము-
కం.    పాండుసమాఖ్యుని పుత్రులు
మెండుసరిని గొనిరి కృష్ణ మృగనయనను వ్యా
సుం డనఁ, బిలువఁగ ధృతరా
ష్ట్రుండు స్వపురికిఁ జని రలరుచు రుచిరగతితో. (౫౨)

టీక- పాండుసమాఖ్యుని = (రా) తెల్లనికీర్తిగలవానిని, (భా) పాండురాజుయొక్క; కృష్ణమృగనయనను = (రా) కృష్ణమృగమువంటి కన్నులుగలదానిని, (భా) కృష్ణన్ = ద్రౌపదిని, మృగనయనను = లేడివంటి కన్నులు గలదానిని; శుభాల్ = (రా) శుభవచనములు; అన = (రెంటికి) చెప్పఁగా; వ్యాళమేచకజట = పామువంటి నల్లని జడగలది; భృగురాముఁడు = పరశురాముఁడు. 

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి