8, జులై 2014, మంగళవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 23

రామాయణము-
సీ.      ఆ వనశోభను నతిమోద మెసఁ(గంగఁ
గన్నులారన్ వారు గాంచి; రచట)
నంబురుహహితాన్వయాంబుధిశశి (భూరి
వీరుండు జిష్ణుఁ డంగారపర్ణ)
సదృశ తామ్రౌష్ఠ్యుండు క్ష్మాజారుచిర (శక్తి
జాలఁ గామించెఁ బ్రచండపుఁ దమి)
గౌతమాశ్రమము దగ్గరి రంతట (ననల
సొనందభరితాత్ము లయిరి వారు;
ఆ.      రామచంద్రపాదరజము సోఁకినయంత
శాపవశముచేతఁ జట్టయిన య
హల్య పూర్వరూప మందె నచ్చొటువాసి
వారు మిథిలతోటఁ జేరి రచట. (౩౮)

భారతము-
గీ.       గంగఁ గన్నులారన్ వారు గాంచి రచట
భూరివీరుండు జిష్ణుఁ డంగారపర్ణ
శక్తిఁ జాలఁగా మించెఁ బ్రచండపుఁ దమి,
ననలసానందభరితాత్ము లయిరి వారు. (౩౮)

టీక- అంగారపర్ణము = (రా.) అగ్నిశకలములు గల యాకు (ఎఱ్ఱనిది); జిష్ణుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; తమి = (రా) కోరిక, (భా) రాత్రి; తామ్ర = ఎఱ్ఱనిప్; ఓష్ఠ్యుండు = పెదిమలు గలవాఁడు, చాలఁ గామించె = (రా) చాలన్ + కామించె, (భా) చాలఁగా - మించె; అనలస = మందము కాని.
రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి