సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, సమస్య పాదాన్ని పద్యం మధ్య ఇమిడ్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
రావము జేసెను గావున
రిప్లయితొలగించండిరావణు , డా సీత మగడు రక్షించు మిమున్
కేవలము దలచి నంతనె
భావా వేశమును బొంది భక్తుల బ్రోవన్
రావము రవము చేసెను గనుక రావణుడు
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిnaa పలుకులలోని మేలు ని దోసి పుచ్చి,
నీ మేలు కోరి నేను జెప్పు మాటల బ్రక్క
పెట్టదవె,సీతను రామునికి చేర్చు,భ్రాతా
రావణుఁ డా, సీత మగఁడు రక్షించు మిమున్ !!
శుభోదయం
జిలేబి
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిమీ భావానికి నా పద్యరూపం....
నా వచనమ్ముల నీతిని
నీ విటులన్ ద్రోసిపుచ్చ నీతియె? సీతన్
భూవిభున కందఁజేయుము
రావణుఁడా! సీత మగఁడు రక్షించు మిమున్.
పావని సీతా మాతను
రిప్లయితొలగించండికావాలని దెచ్చితీవు కపటము తోడన్
జావక వేడుము రాముని
రావణుడా! సీత మగడు రక్షించు మిమున్
భావజపిత వరమునిహిత
రిప్లయితొలగించండిపావనగంగాజనకడు పవనజకుల సం
భావనమూర్తి వినిర్జిత
రావణుఁ డాసీత మగఁడు రక్షించు మిమున్
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
యం.ఆర్. చంద్రమౌళి గారూ,
‘వినిర్జిత రావణుడు’ అన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోవెలనిడి పూజించెడు
రిప్లయితొలగించండిదేవతఁ గొని లంకఁ జేర్చు ధిక్కారమునన్
పావన రాముఁడణచఁ జనె
రావణుఁ డా, సీత మగడు రక్షించు మిమున్
ఆ వనమున నొంటరియౌ
రిప్లయితొలగించండిపావని జానకిని దొంగవలె గొని యాపై
చేవను జూపక గూలెను
రావణుఁ,డా సీత మగఁడు రక్షించు మిమున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండికావరమందిన యసురుడు
చేవయు గలవాడునయిన, సీతను పట్టన్,
జీవము విడె రామునిచే
రావణు, డాసీత మగడు రక్షించుమిమున్
చేవగు ధర్మపు బలమున
రావణునెదిరించెననిని, రాముడు కపులే
సేవలనందిడ, మడిసెను
రావణు, డాసీత మగడు రక్షించుమిమున్
భూవర రాముడు సతికై,
కావగ ధర్మము, నసురుని, కపులలతోడై
చేవను జూపగ కూలెను
రావణు, డాసీత మగడు రక్షించుమిమున్
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
ఆ విధి వ్రాతగ రఘువరు
దేవిని హరియించు కపట తీర్థ కరుడు గా
వావిరి రణమున జచ్చును
రావణు డా సీతమగడు రక్షించు మిమున్
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కావరము తోడ సమసెను
రిప్లయితొలగించండిరావణుడా సీతమగడురక్షించు మిమున్
కైవారముఁ జలిపినచో
కోవెలలోనను సతతము కోరిక తోడన్
మిత్రులందఱకు నమస్కారములు.
రిప్లయితొలగించండిదేవుఁడని యెఱుఁగకయె యా
దేవుని యాలినిఁ జెఱఁగొని తిప్పలనిడ నా
దేవుని చేతనె మడిసెను
రావణుఁ! డా సీతమగఁడు రక్షించు మిమున్!
శ్రీవైకుంఠనివాసుఁడు
రిప్లయితొలగించండిశ్రీవత్సాంకుఁడు పవిత్ర చిద్రూపుండై
పావనుఁడై దురమున "జిత
రావణుఁడా" సీత భర్త రక్షించు మిమున్.
యమపురికిఁ జనెను తా సమ
రిప్లయితొలగించండిరమున నెవరి చేత నోడి రావణుఁ, డా సీ
త మగఁడు రక్షించు మిమున్
తమరెల్లరు రామచంద్రు ధ్యానింపంగాన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
సమస్య పాదాన్ని పద్యం మధ్య ఇమిడ్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
రిప్లయితొలగించండిచేవను గలిగియు ధర్మపు
త్రోవను తా దప్పి మడిసె దొంగిలి మగువన్
నీవే విను రక్కసుడే
రావణుఁ , డా సీతమగఁడు రక్షించు మిమున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
చంద్రమౌళి రామారావు గారి పూరణ :
రిప్లయితొలగించండిఆ వనచర ఖగ నర భూ
దేవులు తాపసులు మునులు దేవతలు సదా
భావమునఁ దలచెడు ద్విష
ద్రావణుఁ డా సీత మగఁడు రక్షించు మిమున్
చంద్రమౌళి రామారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కావరమున ధర మసలకు
రిప్లయితొలగించండిమీవు, ధరణిజాతఁ దెచ్చుటెల్లయె కతమౌ
చావులకు; శరణు వేడుము
రావణుఁ డా సీత మగఁడు రక్షించు మిమున్
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నావలె వీరుడు లేడని
రిప్లయితొలగించండిలావెక్కిన మదము మీర రాముని చేతన్
చావగ, బ్రోచెడి వాడిల
రావణుఁ డా? సీత మగఁడు రక్షించు మిమున్!