కవిమిత్రులారా, గురుదేవులు పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి గత కొద్దికాలంగా ఆరోగ్యం ఏమాత్రం బాగులేదని,ఏమీ తినడం లేదు, త్రాగడం లేదని, వారిని అమెరికన్ హాస్పిటల్‍లో చేర్పిస్తున్నామని వారి మనుమడు రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు తెలియజేశారు. నేమాని వారు సత్వరమే కోలుకోవాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం.
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు ఉదయమే ఒక పని ఉండి మియాపూర్ వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. అందువల్ల మీ పూరణలపై స్పందించడం ఆలస్యమయింది. మన్నించండి. * అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందలు. * శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందలు. ‘ఒదిలి’ అన్నారు. వదిలి సరైన రూపం. ‘అవని నేలన్’ అనవలసింది. మీ మొదటి రెండు పాదాలకు నా సవరణ... దుర్బరమగు రేయిని విడి నర్భకులగు జనులగావ నవనిన్ బ్రోవన్... * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో చిన్న టైపాటు... * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఈయన్ + ఆర్భటి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఈయ నార్భటి’ అవుతుంది. అక్కడ ‘ద్యోతము నిడ తా/ నార్భటి...’ అనండి. * యం.ఆర్. చంద్రమౌళి గారూ, మీ పూరణ చాలా బాగుందనడంలో సందేహం లేదు. అభినందనలు. ‘దుర్భర’... టైపాటు వల్ల ‘దుర్భగ’ అయినట్టుంది. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండు టైపాట్లు, మూడవ పాదంలో గణదోషం.. ‘యర్భకు ప్రహ్లాదు డపుడ యర్చన జేయ న్నార్భాటమునన్ స్తంభపు...’ * చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, అద్భుతమైన పూరణ. సమస్యపాదాన్ని పద్యం మధ్యలో ఇమిడ్చి చక్కని ప్రయోగం చేశారు. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుర్భర మగుగ్రహ ణమునట
రిప్లయితొలగించండియర్భకు డనిదాగె నంట యవనికి వెనుకన్
నిర్భయముగ తిరిగి తిమిర
గర్భము లోనుండి వెడలె గమలాప్తు డొగిన్
అర్భకులైనట్టి నరులు
రిప్లయితొలగించండినిర్భయముగ నుండ వెలుగు నిండుగ నిడుచున్
దుర్భరఘోషల సాగర
గర్భములోనుండి వెడలె కమలాప్తుడొగిన్.
దుర్బరమగు రేయి నొదిలి
రిప్లయితొలగించండినర్భకులగు జనులగావ నవనిని యేలన్
నిర్బయ మీయంగ తమపు
గర్భములో నుండి వెడలె కమలాప్తుడొగిన్
అర్భకుడై తేజముడిగి
రిప్లయితొలగించండిదౌర్బ్ఘాగ్య మనంగ గ్రహణ ధాటికి వశుడై
నిర్భయుడై దుష్టగ్రహ
గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.
నిర్భయమందగ నరులకు
రిప్లయితొలగించండిదుర్భర తిమిరమ్ము తాను తొలగించునురా
అర్భక సాగర, సాగర
గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
అర్భకులౌజనులకు నిశి
దుర్భర తిమిరములు బాపి ద్యోతము నీయన్
యార్భటి ప్రాగ్దిశ సాగర
గర్భములో నుండి వెడలె గమలాప్తు డొగిన్
దుర్భగ సైంధవవధ సం
రిప్లయితొలగించండిదర్భమునన్ విష్ణుమాయ తరణిని మ్రింగెన్
నిర్భేదింప, సుదర్శన
గర్భము లోనుండి వెడలె గమలాప్తు డొగిన్
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
మల్లెల వారిపూరణలు 04.07.2014.
దుర్భర కీలల సొక్కియు
నిర్భీతిగ రాత్రి జనులు నిద్దుర పోగా
నర్భకు లడరగ తూరుపు
గర్భములో నుండి వెడలె గమలాప్తు డొగిన్
2.గర్భము పొందెడి మంత్రము
నిర్భయముగగొంతి గొనెను.నిడుమలు పడగా
దుర్భర సూర్యుని గోరెను
గర్భములో నుండి వెడలె గమలాప్తు డొగిన్
దుర్భరమగు చీకట్లను
రిప్లయితొలగించండినిర్భీతిగ తొలఁగజేయ నేపథ్యమునం
దార్భాటరీతి ప్రాగ్దిశ
గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁడొగిన్.
నిర్భయముగ దండ్రి గురిచి
రిప్లయితొలగించండియర్భకు ప్రహ్లాదు దపుడ యర్చన జేయ
న్నర్భా టమున స్తంభపు
గర్భము లో నుండి వెడలె గమలాప్తు డొగిన్
కవి హృదయము పులకితమై,
రిప్లయితొలగించండికవితలు బిలబిల తలపుల గర్భములోనుం
డి వెడలెఁ, గమలాప్తుఁ డొగిన్
కువలయమందున వెలుగును గుప్పెడి వేళన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....
రిప్లయితొలగించండిదుర్బల మనుజులఁ బ్రోవఁగ
గర్భములో నుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్
దుర్భిక్షనివారణకై
నిర్భరము యజించె రాజు నియమముతోడన్.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిగురుదేవులు పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి గత కొద్దికాలంగా ఆరోగ్యం ఏమాత్రం బాగులేదని,ఏమీ తినడం లేదు, త్రాగడం లేదని, వారిని అమెరికన్ హాస్పిటల్‍లో చేర్పిస్తున్నామని వారి మనుమడు రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు తెలియజేశారు.
నేమాని వారు సత్వరమే కోలుకోవాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజు ఉదయమే ఒక పని ఉండి మియాపూర్ వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. అందువల్ల మీ పూరణలపై స్పందించడం ఆలస్యమయింది. మన్నించండి.
*
అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందలు.
‘ఒదిలి’ అన్నారు. వదిలి సరైన రూపం. ‘అవని నేలన్’ అనవలసింది. మీ మొదటి రెండు పాదాలకు నా సవరణ...
దుర్బరమగు రేయిని విడి
నర్భకులగు జనులగావ నవనిన్ బ్రోవన్...
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో చిన్న టైపాటు...
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఈయన్ + ఆర్భటి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఈయ నార్భటి’ అవుతుంది. అక్కడ ‘ద్యోతము నిడ తా/ నార్భటి...’ అనండి.
*
యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ చాలా బాగుందనడంలో సందేహం లేదు. అభినందనలు.
‘దుర్భర’... టైపాటు వల్ల ‘దుర్భగ’ అయినట్టుంది.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండు టైపాట్లు, మూడవ పాదంలో గణదోషం..
‘యర్భకు ప్రహ్లాదు డపుడ యర్చన జేయ
న్నార్భాటమునన్ స్తంభపు...’
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
అద్భుతమైన పూరణ. సమస్యపాదాన్ని పద్యం మధ్యలో ఇమిడ్చి చక్కని ప్రయోగం చేశారు. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్య వాదములు మాష్టారు. పండిత నేమాని గురువర్యులకు త్వరగా స్వాస్థ్యత చేకూరాలని భగవంతుని ప్రార్ధిద్దాం.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లెల వారిపూరణ
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
దొర్భుజముల నాకీచకు
దుర్భరమగు రీతి జంపి ద్రోవది కటుతా
నిర్భీతి గూర్చగ నిశా
గర్భములోనుండి వెడలె గమలాప్తు డొగిన్
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మీసూచనలకు ధన్యవాదములు
దుర్భర తమిస్ర హరుడై
రిప్లయితొలగించండినిర్భయత నొసంగి భువికి నీడై నాడా
విర్భవ మొందెనదే ప్రా-
గ్గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. దుర్భగ, అనగా ద్వేషింపఁదగినవాఁడు అనే అర్థంలోనే ఆ పదాన్ని వాడాను.
నమస్సులు
మాస్టరుగారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని వర్యులకు త్వరగా స్వస్థత చేకూరాలని భగవంతుని కోరుకొనుచున్నాను.
దుర్భరపు భా.జ.పా స్థితి
రిప్లయితొలగించండినిర్భీతిగ మార్చు'మోడి' నేత యయెను సం
ధర్భోచితముగ నవ ధీ
గర్భములో నుండి వెడలె 'కమలాప్తు'డొగిన్
(కమలాప్తుడు = నరేంద్ర మోడి)