22, జులై 2014, మంగళవారం

పద్యరచన - 628

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. నిష్టగ జేసిన సాగును
    కష్టము లేకుండ మమ్ము గావుము తండ్రీ
    వృష్టిని కురిపించి బ్రతుకుల
    వ్యష్టిగ జేయంగ వలదని పర్జన్యుని మ్రొక్కన్

    రిప్లయితొలగించండి

  2. పైరు నాటి పై ఆకసమును జూసి
    హైరాను అయి , పంట పండించ
    హోరా హోరీ మార్కెట్టున చేతి కి
    వచ్చిన పంట, హుళు హుళుక్కి

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. మొక్క పెంచగ వరుణుడ మ్రొక్కుచుంటి
    చుక్క వర్షపు లేమిని దిక్కు గనము
    కనులగాచును కాయలు కాయదయ్య
    పంట కొంచెము కన్నీరు బరగ కార్చ


    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    2,4 పాదాలలో గణదోషం.
    *
    జిలేబీ గారూ,
    మీ భావం బాగుంది. ఎవరైనా కవిమిత్రులు దీనికి పద్యరూపం ఇస్తారేమో చూద్దాం.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ప్రభువా! ...
    నాటిన విత్తులు మొలచెను
    నేటికీ నొక్క చినుకైన నేలన్ దిగదే!
    కూటికి మొగమాయక నొక
    పూటైనను ముద్ద మ్రింగు పుణ్యము నిమ్మా!

    రిప్లయితొలగించండి
  6. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘నేటికి’ టైపాటువల్ల ‘నేటికీ’ అయినట్టుంది.

    రిప్లయితొలగించండి
  7. వరుణ దేవు కరుణ వర్షము పడునని
    మొక్కల నిడినాడు భూమిలోన
    వర్షము కరువయ్యి పంట చిక్కుచు నుండ
    నాకసమును గాంచె నాశ తోడ

    రిప్లయితొలగించండి
  8. నాటితి పొలమున మొక్కల
    నేటికి పలుదినములాయె, నేలనుతడుపన్
    నీటికి కరువై పోయెను
    చేటే వ్యవసాయమింక చేయను దేవా

    రిప్లయితొలగించండి
  9. చేను మధ్యన కూర్చుండి చిన్న రైతు
    ఆకసమువంక జూచెను నాశ తోడ
    వాన పడునేమొ ,మనకింక వంత లేదు
    పంట పండును బాగుగ భవుని దయను

    రిప్లయితొలగించండి
  10. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    నాటిన విత్తులు మొలచెను
    నేటికి నొక్క చినుకైన నేలన్ దిగదే!
    కూటికి మొగమాయక నొక
    పూటైనను ముద్ద మ్రింగు పుణ్యము నిమ్మా!

    రిప్లయితొలగించండి
  12. వానకొరకురైతు వందకన్నులతోడ
    ఆకసమ్ముజూచి అంగలార్చ
    మింటచుక్కరాక పంటలెండగ జూచి
    కంటనీరు వరద కాల్వపారె!

    రిప్లయితొలగించండి
  13. జిలేబీ గారి భావానికి నా స్వేచ్ఛానువాదం

    పైరునాటుచు గగనమ్ము పైకిజూచి
    ఆరుగాలమ్ము శ్రమియించి మేరజూచి
    పంటపండించి ధరకమ్ముకొంట రాక
    నంతకష్టము వృధగా ప్రయాసమిగిలె!

    రిప్లయితొలగించండి
  14. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    జిలేబీ గారి భావాన్ని చక్కగా ఛందోబద్ధం చేశారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. కరమున కర్ర బట్టి తలకాయను మీదకు నెత్తిపట్టుచున్
    ధరణిని జీవకోటికి హితమ్మును గూర్చెడు వానదేవుడా
    కరుణను జూపి కావుమయ క్షామము నుంచి యటంచు వేడుచున్
    వరుణుని రాక కోసమని పంట పొలమ్మున వేచె వృద్ధుడున్!

    రిప్లయితొలగించండి
  16. వాన కర్షకుని కలల పలకరించ
    నెదురు తెన్నులు చూడగ నేమిదక్కె?
    పైరు లెండి పోయెడి వేళ ప్రాణముడిగి
    కంట నీటి చుక్కలలోన కరిగి పోయె.

    రిప్లయితొలగించండి
  17. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి