19, జులై 2014, శనివారం

పద్యరచన - 625

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. సీతను చెరబట్టదలచి
    పాతకుడారావణుండు పంతము తోడన్
    మాతను భిక్షము గోరుచు
    కౌతుకముగ వచ్చినిలిచె కప్పడి రూపున్

    రిప్లయితొలగించండి


  2. రేఖను దాటిన నాటి నాతి
    జిక్కె రావణుని కరమున
    రేఖను వదలిన నేటి నాతి
    జిక్కె రేపుల వశమున !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. కబళము కొరకై వచ్చెను
    కబళించగఁ జూచు ననుచు కానని సీత
    న్నభమునఁ గొంపోయె ధనుజ
    విభుండు, త్రేతాయుగమున భిక్షణమిదియా?

    రిప్లయితొలగించండి
  4. జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం....

    నాటి నాతి రేఖ దాటి రావణు చేత
    చిక్కి కష్టపడెను పెక్కు గతుల,
    నేటి నాతి రేఖ దాటి దుష్టుల చేత
    చిక్కి యయ్యొ ‘రేపు’ చేయబడెను.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. కావి ధరియించి వచ్చెనా రక్క సుండు
    మాత సీతను హరియించ మాయ తోడ
    భిక్ష కోరిచు సాధ్వినిఁ బిలువగానె
    వెలుపలకి వచ్చె నాతల్లి భిక్షనిడగ
    రావణుండుగొని చనియె రయముగాను

    రిప్లయితొలగించండి
  6. కుచ్చితపు బుద్ధి తోడను
    స్వచ్చమగు తబిసి వోలె యా రావణుడే
    బిచ్చము కోరెడు నెపమున
    వచ్చెను యాసీత కొఱకు పరవశ మందున్

    రిప్లయితొలగించండి
  7. గురువర్యులకు నమస్కారం ... ఈరోజు ద్విపద ప్రయత్నిస్తున్నాను మీ ఆశీర్వచనములతో :
    రావణాసురుడు శూర్పణ ఖావమాన
    యావత్ కధనువిని యామెనోదార్చ
    సీత నపహరించ చేసి యోచనము
    చేతిలో పాత్రతో చేరి పంచవటి
    భిక్ష నిడుమనుచు పిలుచుచు నిలువ,
    లక్షింపకను దాటి లక్ష్మణరేఖ
    అవనిజ వెలుపల నడుగిడినంత
    యవనిని పెకిలించి యామెతో గూడ
    యాకసంబుకెగిరె యాకస్మికముగ
    లోక పావని అశ్రు లోచన యయ్యె

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో యతి తప్పింది.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ ద్విపద బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    రామలక్ష్మణులింట లేరని యెరింగి
    భవతి భిక్షనిమ్మనుచును పంచవటిని
    కుతప కాలము నందున కుటిల యతిగ
    యసురు డేతెంచె వైదేహి నపహరింప

    రిప్లయితొలగించండి
  10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు కృతజ్ఞతలు. మొదటి పాదము ఇలామార్చాను.
    కావి ధరియించి వచ్చెనా కావరుండు

    రిప్లయితొలగించండి
  12. రేఖలు గీసెను మరదియె
    తా ఖాతరు జేయకుండ దాటెను, మాయల్
    రేఖామాత్రము తెలియక
    నాఖలు చేతను బడెగద హాయవనిజయే !

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ సవరణ బాగుంది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. సాధ్వి నెత్తుక పోవగ సాధువగుచు
    దొంగ వేషముననె వచ్చె ధూర్తుడితడు
    రామచంద్రుని చేతిలో రణమునందు
    నిహతుడవగ జనని చేరె నిజపతి దరి.

    రిప్లయితొలగించండి