22, జులై 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1481 (మీసములే సొబగుఁ గూర్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
మీసములే సొబగుఁ గూర్చు మెలఁతల కెల్లన్.

24 కామెంట్‌లు:

  1. రోసమునకు చిహ్నమనగ
    మీసములే సొమగు గూర్చు , మెలతల కెల్లన్
    దోసము లేనట్టి సొగసు
    వేసము నందున్న యెడల వినయము నుండున్

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    గురువులు క్షమించాలి రెండవ పాదంలో " సొబగు " అని ఉండాలి

    రిప్లయితొలగించండి
  3. రోసముగలట్టి వానికి
    మీసములే సొబగు గూర్చు, మెలతల కెల్లన్
    హాసమె భూషణ మగు, పరి
    హాసము చేయకు తెలిసిన యాప్తుల నెపుడున్

    రిప్లయితొలగించండి
  4. !

    అంతర్హాసములే సొబగు నిచ్చు కోమలతల కెల్లన్
    అంగన్యాసములే సొబగు నిచ్చు మే నలతల కెల్లన్
    విన్యాస కుప్పస కూస ప్రియోల్లాసమున మోచేతి
    మీసములే సొబగు నిచ్చు మెలతల కెల్లన్ !!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. హాసములు పైడిబాసము
    వేసము గౌరవముగూర్చ వేవురు మెచ్చన్
    శ్రీసతిలాస్యముగానక
    మీసముల్ ఏసొబగు నిచ్చు? మెలతల కెల్లన్ !!

    రిప్లయితొలగించండి
  6. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    ‘మోచేతి మీసములు’ అంటే అర్థం కాలేదు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  7. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    ఆసతి కాపరమేశుడు
    ఆసిరికి మురారి వాణి యబ్జాసనుకున్
    వాసిగ సములై యుండిరి
    మీ ,సములే సొబగు గూర్చు మెలతల కెల్లన్

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    భాగవతుల వారిపూరణ :వాసికి,రాసికి,బాసకు
    మీ ...సములే సొబగు గూర్చు మెలతల కెల్లన్
    చూసిన యాభరణము కొని
    వేసేడి వలువలకు కోట్లు వెచ్చించ దగున్

    రిప్లయితొలగించండి
  9. రోసము గల మగవానికి
    మీసములే సొబగు గూర్చు, మెలతల కెల్లన్
    నాసికకు పుడకయు, కాటుక
    పూసిన నల్లని కనులును భూషణములగున్

    రిప్లయితొలగించండి
  10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణలోని చమత్కారం బాగుంది. అభినందనలు.
    ‘పరమేశుడు + ఆసిరి’ అని విసంధిగా వ్రాశారు. ‘అబ్జాసనుకున్’ అన్నారు. ‘అబ్జాసనునకున్’ అనవలసింది. నా సవరణ...

    "ఆసతి కాపరమేశుం
    డాసిరికి మురారి వాణి యబ్జభవునకున్..."
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పుడకయు’ అన్నచోట గణదోషం.. ‘పుడక’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  11. న్
    పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మీసవరణకు ధన్యవాదములు కృతఙ్ఞతలు

    రిప్లయితొలగించండి
  12. మల్లెల వారి పూరణలు

    చూసిన యంతనె వరునికి
    మీసములే సొబగు గూర్చు- మెలతలకెల్లన్
    భాసిలు కోరిక, తాగొన
    రోసము గలయట్టివాని, రూఢిని పొందన్

    వాసిలు మగవాని కెపుడు
    మీసములే సొబగు గూర్చు, మెలతలకెల్లన్
    భాసిల సిగ్గును, బిడియము
    పూసిన పూవట్లు మోము. పొల్పుగనుండన్

    రోసము గల్గిన వారలు
    వాసిగ రుద్రమయు, ఝాన్సి, వారికి వలెనే
    భాసిలగ, నున్నటులనే
    మీసములే, సొబగు గూర్చు మెలతలకెల్లన్

    మీసము లవాంఛనీయము
    భాసిల మోమున వనితకు వదనము కాంతే
    మూసుకు పోవును కనవే
    మీసములే సొబగు గూర్చు మెలతలకెల్లన్?

    రిప్లయితొలగించండి
  13. రోసము గలిగిన వానికి
    మీసములే సొబగు గూర్చు, మెలతల కెల్లన్
    కాసుల పేరుల మీదన
    నాసలు మఱి యుండవచ్చు ననుకొను చుంటిన్

    రిప్లయితొలగించండి
  14. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. దాసానుదాసు డైనను
    మీసములే సొబగుఁ గూర్చు!, మెలఁతల కెల్లన్
    పూసంత బొట్టు నుదుటను
    కాసిన్ని నగవుల మోము కళనే గూర్చున్!

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కె.ఈశ్వరప్ప గారి పూరణ
    రోసము గల మగవానికి
    మీ సములే సొబగు గూర్చు మెలతల కెల్లన్
    వేసరుపడు వారనుచో
    యాసక్తులు కారు యెపుడు యాలోచి౦పన్

    రిప్లయితొలగించండి
  17. కె. ఈశ్వరప్ప గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ పూరణలో ఛందోదోషాలు లేవు కాని, వ్యాకరణ దోశాలున్నాయి. ‘వారనుచో + ఆసక్తులు = వారనుచో నాసక్తులు, కారు + ఎపుడు + ఆలోచించన్ = కా రెపు డాలోచించన్’ అవుతుంది. ‘వేసరుపడు’ అంటే? అది ‘వే సరిపడు’ అనడమా? మీ పద్యానికి నా సవరణ....

    రోసము గల మగవానికి
    మీ సములే సొబగు గూర్చు మెలతల కెల్లన్
    వేసరిపడు వారనుచో
    నాసక్తులు కారె యెప్పు డాలోచి౦పన్.

    రిప్లయితొలగించండి
  18. క్రమాలంకారం లో

    రోసము తెల్పున దెయ్యది?
    వేసముమానవున కేమి విలువలనిచ్చున్?
    హాసము లెవరికి యందము?
    మీసములే; సొబగుగూర్చు; మెలతలకెల్లన్

    రిప్లయితొలగించండి
  19. మీసములు రానివారలు
    మీసములే కాదటంచు మేలములాడన్
    వేసము మార్చగ పెట్టుడు
    మీసములేసొబగు కూర్చు మెలతలకెల్లన్

    రిప్లయితొలగించండి
  20. నేటితరం యువతి తన అమ్మతో....

    మాసములు నేడుజూడగ
    వేసములో కుర్రకారు వేషాలేలే
    యేసారికైననమ్మా
    మీసములేసొబగు కూర్చు మెలతలకెల్లన్.

    రిప్లయితొలగించండి
  21. వేసవిలో విరిమల్లియ!
    కూసెడు కోయిల! పలుకుల గొప్పల చిలుకా!
    మా సెలయేరా! భువిలో
    మీ సములే సొబగుఁ గూర్చు మెలఁతల కెల్లన్.

    రిప్లయితొలగించండి
  22. వేసవి వంటల గదిలో
    గ్రాసము తయ్యారు జేయు ఘడియల లోనన్
    రోసము జూపెడి రొయ్యల
    మీసములే సొబగుఁ గూర్చు మెలఁతల కెల్లన్!

    రిప్లయితొలగించండి


  23. రోసము మగరా యలకున్
    మీసములే, సొబగుఁ గూర్చు మెలఁతల కెల్లన్
    కైశిక మందున పుష్పము
    లే! సింగారీ జిలేబి లెస్సగ గనుమా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. ఆ సోనియ నిందిరవలె
    దాసోహమ్మనెడి వేల ధన్యుల తోడన్
    కాసులు రాజ్యము లుండగ
    మీసములే సొబగుఁ గూర్చు మెలఁతల కెల్లన్?

    రిప్లయితొలగించండి