31, జులై 2014, గురువారం

పద్యరచన - 637

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. మునగకు మించిన రుచిగల,
    ఖనిజమ్ములు కలదియునగు కాయలు గలవే?
    యెనలేని విటమినులతో
    జనులకు స్వాస్థ్యమును కూర్చు చక్కని నేస్తం

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింపనున్నవి !

    మునగ కాయ :

    01)
    ____________________________

    పచ్చ పచ్చగ పొడవుగా - వరలు నట్టి
    పుష్టికరమదె తినినచో - మునగ కాయ !
    పత్రముల గూడ కూరగా - వండవచ్చు
    పల్లె పల్లెను విరివిగా - పాతవలయు !
    ____________________________

    రిప్లయితొలగించండి

  3. మునగను చూపించి పద్య సరోవరమ్మున
    మునగ మనిన ఎవరితరము కాదనుట !
    మునగ మునగన ఐరన్ను విటమిన్ను
    e-నిమ్నగన మునగన ఓజస్వీత్వమ్ము !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. ఏ విటమిను గలిగుండును
    చేవగ నున్నట్టి మునగ చేయును చలువన్
    కావంట పనికి రానివి
    యావంటకు పూత మరియు నాకులు, తినుమా !

    రిప్లయితొలగించండి
  5. మునుగును పులుసున కావున
    ననుచుంటిమి మునగకాయలనుచును నివియే
    మునుగుచు తేలుచు లేకను
    ననగలమే పప్పుచారు నాహా యనుచున్ !

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘నేస్తం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మీ భావానికి పద్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ములగ కాయ లేక పులుసులు సాంబారు
    కాయ లేరెవరును కమ్మ గాను
    ములగకాయ కూర ములగాకు పప్పుల
    నిచ్చ తోడ గుడుతు రిండ్ల లోన

    ములగ కాయ, రామ ములగ కాయ మరియు
    వంగ, ఉల్లి, చింత పండు, బెండ
    కాయ లందు జేర్చి కమ్మనౌ సాంబారు
    కాయవలయును కడు కమ్మ గాను

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ఆకు పచ్చని రంగున నలరు చుండి
    మునగ కాయలు జూడగ మోద మలరె
    కూర ,సాంబారు జేయుట కుపక రించి
    మంచి శక్తిని గలిగించు మానవులకు

    రిప్లయితొలగించండి
  10. మునగ పప్పుచారు మునగ కాయల కూర
    కొసరి కొసరి తినగ కోర్కె కలుగు
    నన్ని రుచులలోన మిన్న మునుగచారు
    తిన్న వారి నడగు తెలియు నీకు .

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. నిన్నటి పద్యరచన :
    బిర బిర నోరూరు గదే!
    పెరుగన్నము నిమ్మ బద్ద పిసరంతైనన్
    సరిగూడగ ,దేవతలన్
    మురిపించునిదే ప్రసాదముగ నర్పించన్ !

    నేటి పద్యరచన :
    మునగాకు తీపి యిగురుల్
    తినగన్నోరూరు కాడ తీరిన బులుసుల్ !
    మునిగే వారిని దేల్చెడు
    పనిముట్టుగ దాని బెండ్లు బలమిచ్చునయా !

    రిప్లయితొలగించండి
  13. సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ధన్యవాదములు మాష్టారు ! సవరించిన పద్యము
    మునగకు మించిన రుచిగల,
    ఖనిజమ్ములు కలదియునగు కాయలు గలవే?
    యెనలేని విటమినులతో
    నినుమడి స్వాస్థ్యమును కూర్చు హితకారి యిదే

    రిప్లయితొలగించండి