కెంబాయి తిమ్మాజీ రావు గారూ, ‘నభస్యచవితి’... చక్కని ప్రయోగం. బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘చంద్రున్ + ఏమఱచి’ అని విసంధిగా వ్రాయక, ‘చంద్రు న్నేమఱచి’ అంటే సరి! * శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, మీ రెండవ పూరణ కూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రాముడు యవనిజ కంటె న భిమానమున్ జూపె ధర్మ విధులకు విభుడై పామరుల నోటి దురుసుకు రాముని భార్యలకు నింద రానే వచ్చెన్! (రాముడు సీతను అరణ్య వాసమునకు పంపక ముందు సీతకు పంపిన తర్వాత ఆయన ధర్మానికి నింద వచ్చిన దన్న భావంతో)
శుభవార్త! ఇప్పుడే తెలిసిన శుభవార్త... మన మిత్రులు కందుల వరప్రసాద్ గారు ఇంతకాలం బెంగుళూరులోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తూ మన భాషాసంస్కృతులకు దూరమయ్యారు. ఇప్పుడు వీరు ఏలూరులోని సర్ కట్టమంచి రామలింగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాలకు ప్రిన్సిపాలుగా చేరారు. ఆనందంగా ఉంది. ఏలూరు పరిసరాల్లోని మిత్రులు వారిని కలిస్తే సంతోషిస్తారు.
నమ్మని లంబోదర చవితి కథకు రమ్మని నే వేగిరమున త్వరపడి పిలువ, చంద్రోద యమ్ముకు పూర్వము గూటికి చేరగ రా ముని భార్యలకు నిందలు రానే వచ్చెన్
(నాస్తికుడైన వ్యక్తిని, త్వరగా, చంద్రోదయానికి పూర్వమే, ఇంటికొచ్చెయ్యమని చెప్పే సందర్భంలో ప్రయత్నించాను) దయచేసి, తప్పులని తెలియజేయగలరు. ఎందుకంటే, ఇది నా మొదటి ప్రయత్నం.
మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱికి నమస్కారములు.
రిప్లయితొలగించండి(చవితి చంద్రుని దర్శించిన దోషముచే మునిపత్నులు అగ్నివలన నిందలు మోయవలసివచ్చిన సందర్భము)
కామించియు ముని పత్నులఁ
బ్రేమనుఁ బొందంగలేని విశ్వపు సతి యా
భామల రూపెత్తఁగ నౌ
రా! మునిభార్యలకు నింద రానేవచ్చెన్!
కాముని గెలిచిన హిమగిరి
రిప్లయితొలగించండిధాముని ఋషిపత్నిహేల దైవికమైనన్
తామసమేగద కవిచం-
ద్రా! మునిభార్యలకు నింద రానేవచ్చెన్!
(శ్రీనాథకవికృత శివలీలకథనుద్దేశించి)
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిచక్కని పూరణ రచించారు. అభినందనలు.
*
యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
స్వామీ!నభస్య చవితిని
రామలు సప్తర్షి సతులు రాతిరి చంద్రున్
ఏమరచి జూడగా నౌ
రా!ముని భార్యలకు నింద రానే వచ్చెన్
నీమము మరచి మునిసతుల
రిప్లయితొలగించండికామించిన ఛాగరధుని గాంచిన సతి యా
కోమల వలెనిలిచె కుమా
రా! ముని భార్యలకు నింద రానే వచ్చెన్!
నా మఱియొక పూరణము:
రిప్లయితొలగించండి(లక్ష్మీపద్మావతుల మూలముననే వేంకటేశుఁడు ఱాయైనాఁడని యొక వదంతి పుట్టెననుట...)
రామల నడుమను వేఁగుచు
నేమియుఁ బలుకకయె వేంకటేశుఁడు ఱాయై
భామల విడ, మా హృదయాఽ
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్!
మల్లెల వారిపూరణలు
రిప్లయితొలగించండికాముకుడే పతియని సు
త్రాముని భార్యలకు నింద రానే వచ్చెన్
రామగు లీలావతి నల
భీమముగా చెర గొనంగ వేల్పుల పతి తాన్
2. తామనె ధర్మము నెవ్వని ?
యామిని నొకరై గనబడె యదుకులు డేరిన్?
గోముగ శశి గన నేమయె?
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మల్లెల వారిపూరణ
ఆముని భార్యలు జూచిరి
రామమునౌ చ౦ద్రు నభము రాజిత శాత౦
బే మరి గుర్తిడి వెతగొని
రా, ముని భార్యలకు నింద రానే వచ్చెన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండి‘నభస్యచవితి’... చక్కని ప్రయోగం. బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘చంద్రున్ + ఏమఱచి’ అని విసంధిగా వ్రాయక, ‘చంద్రు న్నేమఱచి’ అంటే సరి!
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ కూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
"నభస్య చవితి"ప్రయోగము మీకు నచ్చి న౦దుకు,
మీసూచనకు ధన్యవాదములు.
(యదువంశనాశనమైన పిదప శ్రీకృష్ణుని భార్యల భంగపాటు..)
రిప్లయితొలగించండిస్వామిక్షయమున యాదవ
భామల వనచోరజనులు భంగింపుటయా !
భామాప్రేమభువన సు-
త్రాముని భార్యలకు నింద రానే వచ్చెన్!
రాముడు యవనిజ కంటె న
రిప్లయితొలగించండిభిమానమున్ జూపె ధర్మ విధులకు విభుడై
పామరుల నోటి దురుసుకు
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్!
(రాముడు సీతను అరణ్య వాసమునకు పంపక ముందు సీతకు పంపిన
తర్వాత ఆయన ధర్మానికి నింద వచ్చిన దన్న భావంతో)
శుభవార్త!
రిప్లయితొలగించండిఇప్పుడే తెలిసిన శుభవార్త...
మన మిత్రులు కందుల వరప్రసాద్ గారు ఇంతకాలం బెంగుళూరులోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తూ మన భాషాసంస్కృతులకు దూరమయ్యారు.
ఇప్పుడు వీరు ఏలూరులోని సర్ కట్టమంచి రామలింగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాలకు ప్రిన్సిపాలుగా చేరారు. ఆనందంగా ఉంది.
ఏలూరు పరిసరాల్లోని మిత్రులు వారిని కలిస్తే సంతోషిస్తారు.
యం.ఆర్. చంద్రమౌళి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
కందుల వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిరా మునిభార్యల కథ విన-
రిప్లయితొలగించండిరా మునిభార్యలుగ స్వాహ రంజింప పతిన్
కాముని లీలల నిజమే-
రా ముని భార్యలకు నింద రానే వచ్చెన్
**********************************
పామరు పలుకుల సీతకు
రాముని భార్య కపనింద రానే వచ్చెన్
సోముని దర్శనముననే-
రా ముని భార్యలకు నింద రానే వచ్చెన్
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉన్నాయి. మంచి పూరణలు.. అభినందనలు.
ఏమని చెప్పుదు గాధలు
రిప్లయితొలగించండికామముతో సలుపుపనుల కతననపుడు సు
త్రాముడు నగ్ని వలననే
రా ! ముని భార్యలకు నింద రానే వచ్చెన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమ్మని లంబోదర చవితి కథకు
రిప్లయితొలగించండిరమ్మని నే వేగిరమున త్వరపడి పిలువ, చంద్రోద
యమ్ముకు పూర్వము గూటికి చేరగ
రా ముని భార్యలకు నిందలు రానే వచ్చెన్
(నాస్తికుడైన వ్యక్తిని, త్వరగా, చంద్రోదయానికి పూర్వమే, ఇంటికొచ్చెయ్యమని చెప్పే సందర్భంలో ప్రయత్నించాను) దయచేసి, తప్పులని తెలియజేయగలరు. ఎందుకంటే, ఇది నా మొదటి ప్రయత్నం.
పామరు కూతల నొకతెకు
రిప్లయితొలగించండిభామగ సినిమాలలోన బంగరు సతికిన్
ధీమంతుడు గుణనిధి శ్రీ
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్
రిప్లయితొలగించండితామరతూపరి పని తీ
రే మరి వేరు! తమకంబు రేకెత్తింప
న్నీమము వీడగ జనులా
రా! ముని భార్యలకు నింద రానే వచ్చెన్!
తామరతూపరి - మన్మథుడు
జిలేబి