6, జులై 2014, ఆదివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 21

రామాయణము-
ఉ.      పొంగు చొనర్చి సద్(దృఢులు భూపసుతుల్ సుధృతిన్ మహాద్రు)లై
భంగము దాపసా(పద, నృపాలజ వారిజపాద కృష్ణ) సా
రంగమృగాక్షియౌ (రమణి రమ్యశుభాస్యతిరస్కృతేందు)ధీ
రాంగన జానకీ(ప్రథిత హల్లకపాణివివాహ మంచు)నున్. (౩౬)

భారతము-
గీ.      దృఢులు భూపసుతుల్ సుధృతిన్ మహాద్రు
పదనృపాలజ వారిజపాద కృష్ణ
రమణి రమ్యశుభాస్యతిరస్కృతేందు
ప్రథితహల్లకపాణి వివాహమంచు. (౩౬)

టీక- (రా) సుధృతిన్ మహాద్రులై = ధీరత్వమున గొప్పపర్వతములఁ బోలినవారై; కృష్ణసారంగమృగాక్షి = కృష్ణసారంగమువంటి కన్నులుగలది.
(భా) ద్రుపదనృపాత్మజ = ద్రౌపది; కృష్ణ = కృష్ణయను పేరుగలది; ఆస్యతిరస్కృతేందు = ముఖముచే తిరస్కరింపబడిన చంద్రుఁడు కలది; హల్లకపాణి = చెంగలువవంటి చేయికలది.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి