13, జులై 2014, ఆదివారం

పద్యరచన - 619

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. సరసున స్నానము చేసెడి
    తరుణీ మణులు, వలువలను దాచిన కృష్ణున్
    కరములు మోడ్చుచు వేడిరి
    కరుణను తమ చీరలిడుము కన్నయ్యనుచున్

    రిప్లయితొలగించండి
  2. వలువలు గట్టున బెట్టుకు
    జలకము లాడంగ తగదు జలజాక్షు లకు
    న్నిలదెలియని దేమున్నది
    కలవర బడకుండ వచ్చి గైకొను మంటిన్

    రిప్లయితొలగించండి


  3. చీరెల దొంగే కాదట
    చేరిన తనవారి కున్న చీకాకులనే
    చీరును చేడియలారా !
    చోరుని కోరిన వలువలు చొప్పడు విలువల్.

    రిప్లయితొలగించండి
  4. జలకము లాడెడి భామల
    వలవలు దాచంగనీవు పంకజనాభా!
    పలుమారులు వేడుకొనగ
    వలువలనొసగితివిగాదె వైనము లేమో!

    రిప్లయితొలగించండి
  5. చిన్నవాని లీల చిత్రమయ్యె! వివర
    మెంత విన్నగాని సుంత తెలియ
    రాదు; కరుణఁ జూపె, రాసలీలలనాడె,
    వెన్న దొంగిలించె, వింతగొలిపె.

    రిప్లయితొలగించండి
  6. నేరక వెన్నదొంగ విటనే కలవంచును వస్త్ర హీనతన్
    దూరి సరోవరంబునను తోషముతో జలకంబు లాడు మా
    చీరల నెల్ల గూఢముగ జేకొని చేరితి వయ్య చెట్టుపై
    మారవ చిల్పి చేష్టలిక మాధవ మామొర నాలకింపుమా!

    మా కోకల మాకివ్వుము
    నీకిది న్యాయంబు కాదు నీరజ నాయనా!
    ఈ కొలను నుండి వెలుపలి
    కేకరణిని యేగు దెంతు మిపుడో కృష్ణా!

    రిప్లయితొలగించండి

  7. నీలాకాశమె యడ్డని
    కోలహలముగ జలకము గోపిక లాడన్
    లీలా వినోది చీరల
    నేలఁ గొనియెనో? వివరము నెరుగగ లేమా?

    నిలువెల్లఁ జేయు తానము
    వలువల వీడుచు సలుపంగ వరుణాగ్రహమౌ!
    తెలుపగ నీ సందేశము
    చెలియల నేడ్పించి చెప్పె చేలాంచెలుడై!


    రిప్లయితొలగించండి
  8. గోపబాలలు నరుదెంచి కొలను లోన
    జలక మాడుచు నుండగా సంతసముగ
    కోకలను దొంగిలించెను కొంటెవాడు
    చెట్టుపైనున్న కృష్ణుని చేష్ట నెఱిగి
    వేడు చున్నారు చీరలన్ విడువ మంచు

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులకు నమస్కృతులు.
    రాత్రినుండి జ్వరం వస్తున్నది. అందువల్ల మీ పద్యాలను వెంటవెంటనే సమీక్షించలేకపోయాను. మన్నించండి.
    ఈనాటి చిత్రానికి చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు....
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    శైలజ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    సహదేవుడు గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. rectifying yathi in first line
    నేరక వెన్నదొంగ విట నీవు వసించుట వస్త్ర హీనతన్
    దూరి సరోవరంబునను తోషముతో జలకంబు లాడు మా
    చీరల నెల్ల గూఢముగ జేకొని చేరితి వయ్య చెట్టుపై
    మారవ చిల్పి చేష్టలిక మాధవ మామొర నాలకింపుమా!

    మా కోకల మాకివ్వుము
    నీకిది న్యాయంబు కాదు నీరజ నాయనా!
    ఈ కొలను నుండి వెలుపలి
    కేకరణిని యేగు దెంతు మిపుడో కృష్ణా!

    రిప్లయితొలగించండి