17, జులై 2014, గురువారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 32

రామాయణము-
చం.    అవని ని కెవ్వరున్ (వలదు యత్నము సేయగ, వట్టి మాయ)గా
కెవరు జయింతురో (యెవరి కెయ్యది ప్రాప్తమొ యేఁడు సెప్పు) స
ర్వవిదుఁడు దక్కఁగా? (ధరణి వానిని కానిది దక్క, దేల) యీ
తివురుట లోడుటల్, (నవులు దీనికి లోపడ నానలేక)యున్. (౪౭)

భారతము-
గీ.       వలదు యత్నము సేయగ, వట్టి మాయ
యెవరి కెయ్యది ప్రాప్తమొ యేఁడు సెప్పు
ధరణి వానిని కానిది దక్క, దేల
నవులు దీనికి లోపడ నానలేక. (౪౭)

టీక- ఏడు = ఎవడు; సర్వవిదుడు = సర్వము తెలిసిన భగవంతుడు; తివురుట = కోరుట; నాన = సిగ్గు.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి