7, జులై 2014, సోమవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 22

రామాయణము-
గీ.       (విని యతిసునృపజులు విరివిధృతిఁ దలఁచి
రా వివాహమునకుఁ బోవ హాళి,) ధీమ
(తల్లి తోడుత ఘనతనుఁ దనరి చనిరి
కానఁ గూర్మితోడఁ గలయఁ గనుచు) గనుచు. (౩౭)

భారతము-
ఆ.వె.   విని యతిసునృపజులు విరివిధృతిఁ దలఁచి
రా వివాహమునకుఁ బోవ హాళి,
తల్లితోడుత ఘనతనుఁ దనరి చనిరి
గానఁ గూర్మితోడ గలయఁ గనుచు. (౩౭)

టీక- (రా) యతి = ముని; సునృపజులు = శ్రేష్ఠులగు రాజకుమారులు. (భా) అతి = అధికమగు; సు = శ్రేష్ఠులగు; నృపజులు = రాజకుమారులు; ధీమతల్లి = శ్రేష్ఠమగు బుద్ధి; విరివిధృతి = ఎక్కువగు ధైర్యము; హాళి = సంతోషము.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి