1, జులై 2014, మంగళవారం

పద్యరచన - 607

కవిమిత్రులారా,
పైచిత్రంలో ఉన్న నా పౌత్రుని ఆశీర్వదిస్తూ పద్యము(లు) వ్రాయవలసిందిగా మనవి. 
ఇంకా పేరు పెట్టలేదు కాని ‘శివసాయి’ అని పిలుస్తున్నాం. నేనేమో ‘నానీ’ అని పిలుస్తాను. 
వాడికి దూరంగా వృద్ధాశ్రమంలో ఉన్నాననే నా బాధ.

మనుమఁడ! నిను వీడి యిచట
ఘనదుఃఖాత్ముఁడ నయి బ్రతుకఁగ వలసె నయో!
మనమున చెదరని నీ రూ
పును సతము స్మరించి ప్రొద్దు పుచ్చెద నానీ!

24 కామెంట్‌లు:

 1. నాన్నా! ఓ! నానీ! నీ
  కన్నా నీ తాతకెవరు గలరుర కన్నా!
  యెన్నాళ్ళీ యెడబాటుర
  నాన్నకు చెప్పి యొకసారి నావద్దకురా!

  రిప్లయితొలగించండి
 2. తాతాయని పిలచి నమరి
  నీతావున నిలచు నంట నిక్కము గదరా
  ప్రీతిగ కౌగిట జేరుచు
  నీతీయని పలుకు లందు నిత్యము శుభమౌ

  రిప్లయితొలగించండి
 3. గురువుగారూ, మీరే చెప్తున్నట్లుగా........

  బుడిబుడి యడుగుల తోడన్
  నడయాడుచు నుండి చూచి ననుజేరగ వ
  చ్చెడి నాదు ముద్దు మనుమడ!
  కడు సౌభాగ్యములఁ బొంద గలుగుదువీవున్.

  రిప్లయితొలగించండి
 4. బోసి నవ్వులు చిందించు బుజ్జి తండ్రి
  కపట మెరుగని చిన్నారి కన్న తండ్రి
  సాయి నూరేళ్ళు వర్ధిల్లు చల్ల గాను
  తాత దీవెన ఫలియించు దైవ సాక్షి

  రిప్లయితొలగించండి
 5. తాత !యెక్కడ నుంటివి ?త్వరగ రమ్ము
  బోసి నవ్వుల తోడన భుజము నెక్కి
  యాడు కొందును నీ యొద్ద యాట లెన్నొ
  యెదురు చూతును మఱి రమ్ము ముదము తోడ

  రిప్లయితొలగించండి
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  బాగున్నది మీ పద్యం. ధన్యవాదాలు.
  *
  అక్కయ్యా,
  చక్కని పద్యాన్ని చెప్పారు. ధన్యవాదాలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  నా మనసులోని మాటకు పద్యరూపాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.
  *
  ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం చదివాక మా మనుమడు నన్ను పిలుస్తున్నట్టూ, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తున్నది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  నిను వీడి దూరముగ నే
  మనుగడ సాగించ దైవమది లిఖియించెన్
  గినుకను మానుము, తాతకు
  కనులు తెరచి యున్న మూయ కనుపింతువుగా
  మనమురియాడుచు నుండగ
  నిను లాలి౦ప౦గ లేము నీబుడి యూసుల్
  విన నోచగ లేమైతిమి
  మనుమడ "శివసాయి" గొనుము మా యాశిషులన్

  రిప్లయితొలగించండి
 8. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మల్లెలవారి ఆశీర్వాదము: పిల్లల పాపలతోడను
  చల్లగ నుండగ తలంచు సమయము నిపు డే
  నెల్లర మది నేననయము
  కొల్లగ నాయువు సుఖములు గూడగ వారిన్

  రిప్లయితొలగించండి
 9. కనుగొందును నీ జాడను
  వినయముగా నాన్న నడిగి వేకువ జామున్
  దనరగ బాకుచు వచ్చుచు
  వనస్థ లిపురంబు తాత ! పంతుల నడి గీ

  రిప్లయితొలగించండి
 10. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యం...

  చందమామను మించిన యందగాఁడె
  యెదురుచూచుచునుండె తా నెవరికొఱకు?
  తాత మాటలు విని తాను తనివి బొంది
  చిరునగవులను చిందించు చిట్టితండ్రి.

  రిప్లయితొలగించండి
 11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. ధన్యవాదాలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఆశీర్వాద పద్యం బాగున్నది. ధన్యవాదాలు.
  *
  సుబ్బారావు గారూ,
  సంతోషం... కానీ వనస్థలిపురం తాతకు ఈ శంకరయ్య తాత ఉండే ఆశ్రమం ఎక్కడొ తెలియదు కదా.. నేనున్న ఆశ్రమం ఎక్కడ ఉందో ఇప్పటికీ మా బంధుమిత్రులలో ఎవరికీ తెలియదు, నేను చెప్పలేదు.. కొంతకాలం అజ్ఞాతంగానే ఉండాలనుకుంటున్నాను.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  బాగుంది మీ పద్యం. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. పోలిక చూడగ తాతనె
  వాలకమును గనగ తాత వలెనే యుంటిన్
  చాలిక రమ్మింటికి న-
  వ్వాలిక నాతోడ నాడి పాడుచు తాతా!

  నవ్వుల పువ్వులు తాతకు
  బువ్వను తినువేళ తాత ముద్దయు నాకే
  కవ్వింపులు తాతయకే
  సవ్వడి చేయకుడు తాత ముద్దులు నాకే.

  ఎవలో అన్నాలంతూ
  చివచాయిని నానిగాన్ని చీ పో తాతా
  అవమానిత్తాలా మలి
  ఎవలైనా యిడిచి పెత్తి ఎలిపోతాలా?

  నానమ్మను కొత్తేతా
  నానను నే తిత్తుతాను నాకోచం లా!
  నేనున్నాగా? అమ్మకి
  నేనూ నువ్విత్తమేను నిజమే తాతా.

  నీ నద్ది మీద నెక్కుత
  నానమ్మొద్దన్న గాని నాగుల్లం నీ
  వౌనా తాతా లా యిక
  నేనూ నీ బంది నెక్కి నీతో వత్తా.

  ఇంటిలోన గోల యెక్కువ మాకంచు
  కోరి సంత నెవరు కూర్చొనెదరు?
  ముద్దు మూటగట్టు బుజ్జిమనుమనికై
  అరుగుడయ్య వేగ గురువుగారు!

  చిరంజీవి బుజ్జి నానీశివసాయికి శుభాశీస్సులు.


  రిప్లయితొలగించండి
 13. కనుగవ చాలదయ్య! నినుఁగందికులోద్భవుఁబాలతేజముం
  గనుగొనఁగృష్ణుఁజేరుటకు ఖైదునదేవకిజూచినట్టుగా
  నినుగనఁదాతవేచె మదినిండగనీదగుబోసినవ్వుతో
  ననఘుడవై ప్రవర్ధిలు! మహద్గతిఁబొందుము! తాతమెచ్చగాఁ |

  రిప్లయితొలగించండి
 14. తాతయ్య దీవెనలతో
  ప్రీతిగ వర్ధిల్లవలయు వేడుక దీరన్
  ఖ్యాతిని బొందుచు తాతకు
  వూతగ నీవుండవలయు పోడిమి తోడన్

  ఎక్కడ నున్నను నేనొక
  చక్కని మనుమడికితాత సంతోషముతో
  నిక్కడ నుండియె జూచెద
  నిక్కముగా స్వప్నమందు నిన్నే నానీ!

  రిప్లయితొలగించండి
 15. శ్రీకరశోభితోజ్వలమశేషభవాంబునిధీకృతుల్ బృహ
  ద్శోకములేమరించెడు శిశూల్లసముంగను తాతయుల్లముల్
  రాకశశాంకసంచయ విరాజితయామిని(జక్రవాకపుం
  పోకడపోదె! అట్టివగుపొంగులుదైవముమీకునిచ్చుగాఁ !

  రిప్లయితొలగించండి
 16. 2 పద్యాలలో మొదటి పాదమును కొద్దిగా మారుస్తూ:

  శ్రీకరశోభితోజ్వలమశేషభవాంబునిధీకృతంబులౌ
  శోకములేమరించెడు శిశూల్లసముంగను తాతయుల్లముల్
  రాకశశాంకసంచయవిరాజితయామిని(జక్రవాకపుం
  పోకడపోదె! అట్టివగుపొంగులుదైవముమీకునిచ్చుగాఁ !

  కనుగవ చాలదయ్య! నినుఁగందికులోద్భవుఁబాలశంకరుం
  గనుగొనఁగృష్ణుఁజేరుటకు ఖైదునదేవకిజూచినట్టుగా
  నినుగనఁదాతవేచె మదినిండగనీదగుబోసినవ్వుతో
  ననఘుడవై ప్రవర్ధిలు! మహద్గతిఁబొందుము! తాతమెచ్చగాఁ |

  రిప్లయితొలగించండి
 17. నాన్నా !నే దూరంబుగ
  నున్నా నిను మరవజాల కున్నా నిచటన్
  కన్నా! మను శతవర్షము
  లన్నా! భవుడి డును నీకు నధికా శీస్సుల్.

  రిప్లయితొలగించండి
 18. మిస్సన్న గారూ,
  మీ పద్యాలు నన్ను భావోద్వేగానికి గురిచేసాయి. కొద్దిసేపు ఏడిచాను కూడా... నన్ను ఏడిపించిన మీకు అభినందనలు కాని ధన్యవాదాలు కాని ఎలా చెప్పను?
  *
  గూడ రఘురామ్ గారూ,
  మీ రెండు పద్యాలు మనోహరంగా ఉన్నవి. ధన్యవాదాలు.
  *
  శైలజ గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. ధన్యవాదాలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  “కన్నా! మను శతవర్షము” లంటూ మీరు చెప్పిన పద్యానికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 19. బూరెలఁ బోలిన బుగ్గలు,
  మారాములఁ జేయు నవ్వు మరువగ లేనే!
  రారా! ముద్దుల మనుమడ!
  గారాముగఁ బ్రతి దినంబు కలలో నానీ!

  రిప్లయితొలగించండి
 20. కంది వంశము నందు చందమామవునీవు
  శివసాయి నిను 'సదా' శివుడు గాయు
  మధుర మీనాక్షమ్మ మంచిదీవెనలిచ్చు
  కామాక్షి కృపనిచ్చు కామితములు
  పద్మావతీ శ్రీనివాసుడెల్లప్పుడ
  ష్టైస్వర్యము లొసంగి సాకు నిన్ను
  ముక్కోటి దేవతలు ముద్దార నిను గాంచి
  దీర్ఘాయురారోగ్య దీవెనలిడు

  బోసినవ్వుల నలరారు బుజ్జివాడ
  చక్కగా పెద్ద వాడవై చదువు కొనర
  గొప్ప పేరు ప్రఖ్యాతులు గొనర నాని!
  తాత పేరును నిలుపుమీ ధరణి లోన

  రిప్లయితొలగించండి
 21. సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. ధన్యవాదాలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  చక్కని పద్యంతో మా మనుమడికి ఆశీస్సులందిచారు. ధన్యవాదాలు.
  *
  (పై ఇద్దరు కవిమిత్రులు నేను ఆలస్యంగా స్పందించినందుకు మన్నించాలి.)

  రిప్లయితొలగించండి
 22. నాని! నాని! యనెడి నీదు నాలుకపై
  నాని నాను పెద్దవుటను దలచు చుంటి
  నాన్చక యిక రా,నా మీద నెనరు లేద?
  నాను నీవొకటి మనలేం నాతొ వచ్చై

  రిప్లయితొలగించండి