శ్రీ శంకరయ్య గారికి నమస్సులు నిన్నటి నా పద్యము పై మీ వ్యాఖ్య ''‘కాడు+అల్ల’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి జరుగుతుంది. '' అని ఉన్నది . కాని నా పద్యం లో'' కాడు+అల్ల'' అను పదములు లేవు . వివరించ గోరెదను
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, నిజమే... సవరించాను. ధన్యవాదాలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * యం. ఆర్. చంద్రమౌళి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మ్రుచ్చిల జేసిన’ అని ఉండాలనుకుంటాను. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. నిన్నటి నా వ్యాఖ్య ‘అవడు + అల్ల’ అని టైపు చేయబోయి ‘కాడు + అల్ల’ అన్నాను. మన్నించండి. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, అంత్యానుప్రాసతో మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు. ‘సౌరి’ శబ్దానికి నిఘంటువులు శని, యముడు అనే అర్థాలనే ఇచ్చాయి కాని విష్ణువు అనే అర్థాన్ని ఇవ్వలేదు. కాని పర్యాయపద నిఘంటువులో మాత్రం విష్ణువుకు సౌరి అన్న పదాన్నిచ్చింది. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘బ్రోచు + ఆ’ అన్నప్పుడు సంధి లేదు. ‘బ్రోచు నా’ అవుతుంది. అక్కడ ‘బ్రోవన్’ అంటే సరిపోతుందనుకుంటాను. * ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణలో ‘బందించగ’ అన్నచోట గణదోషం. ‘బంది సేయ’ అనండి. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మూడవ పూరణలో ‘భక్తీ’ అన్నారు. అక్కడ ‘భక్తియె’ అంటే సరి. * సుబ్బారావు గారూ, విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
మాస్టారూ! బహుసా బూజించువారె బదులు జూజించువారె అని టైపు అయిందనుకొంటా !
రిప్లయితొలగించండిఆరాధా కృష్ణుల నట
రిప్లయితొలగించండిమీరావలె భక్తి గొలిచి మేలిమి భజనల్
నోరార బిలచి మానస
చోరుని బూజించు వారె శుద్ధాత్ము లిలన్
ధీరుని విశ్వాకారుని
రిప్లయితొలగించండిమారునిగన్నట్టి హరిని మదసంహరునిన్
పెరిమి పేరగు మునిహృత్
చోరుని బూజించు వారె శుద్ధాత్ము లిలన్
చీరలు మ్రుచ్చిలి జేసిన
రిప్లయితొలగించండిశ్రీరమణుని గొలిచినంత చింతలు దీరున్
శౌరిని రాధామానస
చోరుని బూజించువారె శుధ్ధాత్ము లిలన్
పోరున ఫల్గుణ సారథి
రిప్లయితొలగించండికారణ జన్ముడు నృసింహు కంసారి హరిన్
భారత ముని జన మానస
చోరునిఁ బూజించువారె శుద్ధాత్ము లిలన్.
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండినిన్నటి నా పద్యము పై మీ వ్యాఖ్య
''‘కాడు+అల్ల’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి జరుగుతుంది. ''
అని ఉన్నది . కాని నా పద్యం లో'' కాడు+అల్ల'' అను పదములు లేవు .
వివరించ గోరెదను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధీరుని, కదనమునన్ గం
రిప్లయితొలగించండిభీరుని, మునిజన బుధాళి మెచ్చిన సౌరిన్,
శౌరిని, భక్తుల మానస
చోరునిఁ బూజించువారె శుద్ధాత్ము లిలన్.
సౌరి = విష్ణువు,
నారాయణ నామంబును
రిప్లయితొలగించండిబారాయణ జేయు జనుల పనిగొని బ్రోచా
శౌరిని రాధా మానస
చోరునిఁ బూజించువారె శుద్ధాత్ము లిలన్.
మారెను రోజులు, మనుజుల
రిప్లయితొలగించండితీరులు మారెను, విలువలు తెలియ వెవరికిన్,
తేరగ కోట్లను దోచిన
చోరునిఁ బూజించువారె శుద్ధాత్ము లిలన్
కోరగ మోక్షము నిచ్చు ము
రిప్లయితొలగించండిరారి ముకుంద గిరిధారి రాధేశ హరిన్
సారధి నారీమానస
చోరునిఁ బూజించువారె శుద్ధాత్ము లిలన్.
కూరిమి మీగడ పాలను
రిప్లయితొలగించండికోరిన వెన్నను భుజించి గోపిక మనసుల్
చూరగొనె.వారి హృదయపు
చోరుని బూజించు వారె శుద్ధాత్ము లిలన్
మీరగ యశోద కోపము
నారోటను బంధిoచగ నా వేణుధరున్
వీరతరుల గూల్చిన యా
చోరుని బూజించు వారె శుద్ధాత్ము లిలన్
చోరిక యొక కళ. దానిని
పేరిమికారులు శ్రమించి పెంపొందిoపన్
చేరెను నల్లధనమ్ములు
చోరుని బూజించు వారె శుద్ధాత్ము లిలన్
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండి1,నేరిమితో నవనీతము
వారణ లేకను వనితల వస్త్రము లరయన్
చేరిన పాపము దొంగిలు
చోరుని బూజించు వారె శుద్ధాత్ము లిలన్
2. ఆరయ నేడిటు నేతల
పారముగాగను పలుకుచు వాటిని చేతల్
చేరగ నీయరు వోటుల
చోరుని బూజించు వారె శుద్ధాత్ము లిలన్
3.చేరిచి కష్టము లెన్నియొ
పూరితి భక్తీ ఫలి౦చి పుణ్యము లిడుగా
ధీరుడు జీవుల పాపపు
చోరుని బూజించు వారె శుద్ధాత్ము లిలన్
వీ రడు కొట్టెను బలముగ
రిప్లయితొలగించండిచోరుని, బూ జించువారె శుద్ధాత్ము లిల
న్నారని జోతుల రూపుని
నారవినే భక్తి తోడ ననుదిన మందున్
శ్రీ రమణీ కుచ దుర్గ వి
రిప్లయితొలగించండిహారిని,గోపీ హృదయ విహారిని,యమునా
తీర విహారిని,మానస
చోరుని,బూజించువారె శుద్దాత్ములిలన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండినిజమే... సవరించాను. ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
యం. ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మ్రుచ్చిల జేసిన’ అని ఉండాలనుకుంటాను.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్నటి నా వ్యాఖ్య ‘అవడు + అల్ల’ అని టైపు చేయబోయి ‘కాడు + అల్ల’ అన్నాను. మన్నించండి.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
అంత్యానుప్రాసతో మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.
‘సౌరి’ శబ్దానికి నిఘంటువులు శని, యముడు అనే అర్థాలనే ఇచ్చాయి కాని విష్ణువు అనే అర్థాన్ని ఇవ్వలేదు. కాని పర్యాయపద నిఘంటువులో మాత్రం విష్ణువుకు సౌరి అన్న పదాన్నిచ్చింది.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘బ్రోచు + ఆ’ అన్నప్పుడు సంధి లేదు. ‘బ్రోచు నా’ అవుతుంది. అక్కడ ‘బ్రోవన్’ అంటే సరిపోతుందనుకుంటాను.
*
ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో ‘బందించగ’ అన్నచోట గణదోషం. ‘బంది సేయ’ అనండి.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణలో ‘భక్తీ’ అన్నారు. అక్కడ ‘భక్తియె’ అంటే సరి.
*
సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
‘శీనా’ గారూ,
రిప్లయితొలగించండిఅంత్యానుప్రాసతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మీసవరణలకు ధన్యవాదములు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....
రిప్లయితొలగించండికాఱయ పెట్టెడు బాధల
నేరుపుతోడను జయించి నియమవ్రతుఁడై
నేరిచి సత్యామానస
చోరుని బూజించువాఁడె శుద్ధాత్ముఁ డిలన్.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినిన్నటి నా పద్యమునకు మీ సూచన మేరకు పద్యములోని రెండవ పాదము క్రింది విధముగా సవరించడమైనది.
"కాడు కర్ణుడు ధృపదునికల్లుడెపుడు"
శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
రిప్లయితొలగించండినా తప్పు సవరించిన మీకు కృతజ్ఞతలు
"తీరును ద్వాపరమున మీ
రిప్లయితొలగించండికోరిన కౌగిలి వరంబు గోపిక లగుచున్
జేరగ " నను ముని మానస
చోరునిఁ బూజించు వారె శుద్ధాత్ము లిలన్!
కూరిమి సంతతి సంపద
రిప్లయితొలగించండిమీరిన రాజ్యము యశమ్ము మేనక రంభల్
కోరెడి యాశా మానస
చోరునిఁ బూజించువారె శుద్ధాత్ము లిలన్
రిప్లయితొలగించండికారుణ్యంబొప్పెడు యవ
నారిన్ మదిలో జిలేబి నమ్ముచు మహిలో
వారావధిగా మానస
చోరునిఁ బూజించువారె శుద్ధాత్ము లిలన్!
జిలేబి
రాహుల్ ఉవాచ (పరాజయము పిదప):
రిప్లయితొలగించండికోరుచు వోట్లకు రాగా
తోరమ్ములు కట్టి మ్రొక్కి దొర్లుచు నేలన్
భోరున నేడ్చుచు రాఫెలు
చోరునిఁ బూజించువారె శుద్ధాత్ము లిలన్