25, జులై 2014, శుక్రవారం

పద్యరచన - 631

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. అమ్ముడు బోవగ న్యాయము
  గమ్మున నేనుంటి నిటుల గంతలు కట్ట
  న్నిమ్ముగ న్యాయము దెలుపగ
  బెమ్మకు తరమౌనె సాక్షి భగ వద్గీతౌ

  గమ్మున = బహుస మాండలిక మౌతుం దేమొ వ్రాయ వచ్చునో లేదో మరి గురువులు క్షమించాలి

  రిప్లయితొలగించండి
 2. ఆచార్యా! ఛందస్సులోగాని, పద ప్రయోగంలోగాని లోపాలుంటే సరిదిద్దండి

  తరతమ భేద భావన లతండు నివారణ సేయగల్గెనే
  అరమరికం నెరుంగకనె అంత సఖ్యముగ జీవనంబు సే
  సిరట రఘుకులం మనకొసంగిన ఉత్తమ రామ రాజ్యమం
  దు రమతి లోకసృష్టి మనదవ్వ కనుందెరు చట్టదేవతా!

  రిప్లయితొలగించండి
 3. అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అబ్దుల్లా గారూ,
  గోలివారు మీరు రెండురోజుల్లో పద్యాలు వ్రాయగలరని అంటే మీరు ఒక్కరోజులోనే పద్యాన్ని అందులోను వృత్తాన్ని వ్రాసి మీ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సంతోషం. మీకు పద్యవిద్య సులభంగా అబ్బుతుంది. సంతోషం...
  ఇక మీ పద్యంలో కొన్ని శబ్దదోషాలు, 3,4 పాదాల్లో యతిదోషం, మూడవ పాదంలో గణదోషం ఉన్నాయి. మీ పద్యానికి నా సవరణలు....

  తరతమ భేద భావన లతండు నివారణ సేయగల్గెనే
  అరమరికల్ లవం బెరుగ కంత సుఖమ్ముగ జీవనంబు సే
  సిరట రఘూద్వహంబు భువి జేసిన యుత్తమ రామ రాజ్యమం
  దు రమతి లోకసృష్టి కనుదోచగ చూడవె న్యాయదేవతా!
  (నా సవరణ సంతృపికరంగా లేదు.. కాని ఇంతకంటే వీలుకాలేదు)

  రిప్లయితొలగించండి
 4. చూపులు తన, పరము లనిన
  పాపపు నిర్వచనమ దొకపరి మారు, నదే
  శాపమగు న్యాయమునకని
  చూపులఁ జుట్టగ వలువను, చుట్టము త్రాసౌ! !

  రిప్లయితొలగించండి
 5. న్యాయ దేవత మఱి నాయము బలుకక
  కళ్ళు మూసికొనియె కాంత జూడు
  కాల మహిమ యదియ కలికాలము గద !
  కల్ల లాడు వారు కొల్ల లిలను

  రిప్లయితొలగించండి
 6. సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. ధర్మ దేవత కనుగప్పి ధాత్రిపైన
  చేయుచున్నారు నేతలు చెడ్డపనుల
  మంచి రోజులు వచ్చు నటంచు జనులు
  వేచి యున్నారు మిక్కిలి యాశతోడ

  రిప్లయితొలగించండి
 8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. కనులు గానకుండ గంతఁ కట్టుకొనియెఁ
  జిరునగవులఁ ద్రాసు చేతఁ బట్టి
  చెవుల తోడ వినుచుఁ జేయు వాదనలను
  తీర్పుచెప్పున్యాయ దేవతయిది

  రిప్లయితొలగించండి
 10. న్యాదేవత చేతిలో నమరు త్రాసు
  వాది ప్రతి వాది వాదముల్ వరుస రెండు
  పళ్ళెరములందు పట్టును బరువు దేని
  వైపునుండునొ తానదియ వైపునుండు.

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి రామారావు గారి పూరణ :
  హేయపు పాప చింతనల నెయ్యది యచ్చపు న్యాయమేది య
  న్యాయ మెరుంగలేక నయనంబులు మూసుకుపోయి దుర్మదుల్
  సేయునకృత్య భారమును చేతులఁ దూచగ లోనికన్ను వా
  లాయము విప్పి పైని కనులన్ గనకుందువు న్యాయదేవతా

  రిప్లయితొలగించండి
 12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  చంద్రమౌళి రామారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. మాస్టరుగారూ ! ధన్యవాదములు..
  చివరి పాదం లో పొరబాటును సవరిస్తూ...

  న్యాదేవత చేతిలో నమరు త్రాసు
  వాది ప్రతి వాది వాదముల్ వరుస రెండు
  పళ్ళెరములందు పట్టును బరువు దేని
  వైపునుండునొ తానటు వైపునుండు.

  రిప్లయితొలగించండి
 14. కలియుగమందు మానవుని కష్టముఁ దీర్పగ నిశ్చయించి వ్యా
  కులతనుఁ దీర్చ నెంచి తగు కూర్మినిఁ బెంచి భళాయనంగ నీ
  విల దిగి రాగదమ్మ! భువినేలగ దీనుల దైవరూపమై
  నిలబడి నేటి కాలమున నీదు యుపస్థితి తెల్ప వేడుదున్.

  రిప్లయితొలగించండి
 15. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి