16, జులై 2014, బుధవారం

పద్యరచన - 622

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. నేరము లెంచక మెలగుము
    భారత దేశమ్ము మనది భాగ్యం బనుచున్
    కోరిన సిరిసంప దలకు
    వారసు లముమన మంచు పాదప మనగన్

    రిప్లయితొలగించండి
  2. ఏమాస్టరు హోం వర్కును
    భూమాతకునిచ్చె భరత భూమిని గీయన్
    ఏమిది చిత్రమె చూడగ
    నీమానున నిలిపె దేశ చిత్రము వోలెన్.

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నాల్గవపాదంలో గణదోషం. ‘వారసులము మన మటంచు...’ అనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. చెట్టు తల్లి జూడ చెన్నుగా నున్నది
    పిల్ల లాడు చుండ్రి యుల్ల మలర
    పగటి పూట తాను ప్రాణవాయువు నిడి
    వేడి బాధ నెపుడు వెడలగొట్టు

    రిప్లయితొలగించండి
  5. చిత్రంబాయెను జూడగ
    చిత్రంబుగ నుండె చెట్టు చిత్రములోనన్
    మిత్రమ! తరు సౌభాగ్యము
    చిత్రమె కద భరత దేశ చిత్రము బోలెన్

    రిప్లయితొలగించండి
  6. భారత దేశపు చిత్రము
    తీరుగ నీపాదపమున దీర్చిన దెవరో !
    వారికి వందనమనుచున్
    భూరిగ ధనధాన్యమొసగు భూమికి జేజే!

    రిప్లయితొలగించండి
  7. భరత దేశమున్ పోలెడు పాదపమ్ము
    కనుల కానంద మొనరించె కాంచ గానె
    చిత్ర కారుడు గీచిన చిత్ర మౌన?
    వాని ప్రతిభను శ్లాఘించ వాక్కు గలదె

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. చిత్రమందునున్న చెట్టురూపముబోలు
    బానిసచెరవిడిన భరతమాత
    గాలికూగుచుండె కమ్మంగ కొమ్మలు
    స్వేచ్చయనెడుగాలి పీల్చినట్లు

    రిప్లయితొలగించండి
  10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. వృక్షము నందు భారతము వెల్గుల నీనుట లెన్న చిత్రమే
    ఈ క్షితి కొండలన్ శిలల నింపుగ కోనల వాగు వంకలన్
    పక్షుల పాములన్ పసుల పండ్లను పూలను నీట గాలి ప్ర-
    త్యక్షము కావె భారత మహార్ష విభూతులు చూచు వారికిన్.

    రిప్లయితొలగించండి
  12. మిస్సన్న గారూ,
    చరాచరము లన్నింటను ‘ప్రత్యక్షము కావె భారత మహార్ష విభూతులు చూచు వారికిన్.’ ఎంత చక్కని భావం. చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారి ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. గోలి వారూ భలే గొప్ప భావనండి. అభినందనలు.
    భరత దేశాన మొలచిన గురుతు నెరిగి
    వేద భూమిపై పెరిగిన పాదపమ్ము
    దేశ పటముగ నిలచిన తీరు గనుడు
    శిరము లెత్తని వారలీ ధరణి నెవరు?

    రిప్లయితొలగించండి
  15. భళిర! దేశ పటమ్ముగ భ్రాంతిఁ గొలుపు
    చెట్టుఁ జూసిన నెంతయు చిత్రమగును,
    వందనమిడుదు తల్లియౌ భారతికిదె
    నేడు కానిపించె నిటుల నేరుగాను.

    రిప్లయితొలగించండి
  16. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి