31, జులై 2014, గురువారం

సమస్యా పూరణం – 1490 (ఖరపదము పరిగ్రహించి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్.
ఈ సమస్యను సూచించిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింపనున్నవి !

    శశిశేఖరపదము ముక్తిమార్గము గదా !

    01)
    ______________________________

    వరములనిడు తలనిడుకొను
    హరహరయన పరవశుడగు - హరకుని దలువన్ !
    నరులదె నిలుకడ శశిశే
    ఖరపదము పరిగ్రహించి - కననగు ముక్తిన్.
    ______________________________

    రిప్లయితొలగించండి
  2. జిలేబి పదముల జిలిబిలి వదలి
    కంది వారి శంకారాభరణ పదముల
    పట్టు పట్టవే జిలేబి, e-లోకమున
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్ !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. ధరలో చిల్లర దేవుల
    మరిమరి యేమార్చి వారి మార్చగనేలా ?
    హరుడగు భవుడగు శశిశే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్ !

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మీ భావానికి పద్యరూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. వరముల నిడుటకు ప్రధముడు
    హరుడని నిరతము కపర్ది నార్తిని గొలువన్
    పరమ పదము కై గుణశే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్.

    రిప్లయితొలగించండి
  6. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పరమపదముకై’ అన్నారు. పరమపదమునకై అనాలి. అక్కడ ‘వరపదమునకై గుణశే...’ అందామా?

    రిప్లయితొలగించండి
  7. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనముల

    మరి మరి దశరథ రాముని
    [ఖర దూషణ రావణారి]కథలను వినుచున్
    తిరుముడి రాజగు కులశే
    ఖరు పదము పరిగ్రహించ కననగు ముక్తిన్

    రిప్లయితొలగించండి
  8. వరముల నిచ్చును రయమున
    పరమేశుండెవరికైన భజియించినచో
    తిరమగు భక్తిన శశిశే
    ఖర పదముపరిగ్రహించి కననగు ముక్తిన్

    రిప్లయితొలగించండి
  9. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. పరమేశుని జపియించిన
    పరమగు శుభములు సకలమవనిలో మనకున్
    హరహర యనచును శశిశే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్.

    రిప్లయితొలగించండి
  11. వరముల నిచ్చెడు శంకరు
    నవిరళ ముగ బూజ జేయ నంచిత భక్తిన్
    కరమున్దయ గల యా శే
    ఖర పదము పరిగ్రహించి కననగు ముక్తిన్

    రిప్లయితొలగించండి

  12. మేషాది మీన రాసులలో వరుసగా ఒక్కోక్క సంవత్సరము గంగ అనేక నదులలో, ప్రవేశించునపుడు గోదావరికి మాత్రమే అంత్య పుష్కరమహాత్మ్యము ప్రాముఖ్యమైనది. హరశేఖర, అంటె గంగ. ఇది పూరణకు ఆధారమని విజ్ఞులకు విజ్ఞప్తి.

    వరుసగఁ రాసులలో పు
    ష్కర తత్వమహాత్మ్యపుణ్యకరమై గోదా
    వరిగా వెలసిన హరశే
    ఖర పదము పరిగ్రహించి కననగు ముక్తిన్

    రిప్లయితొలగించండి
  13. వరముల గురిపించెడు శ్రీ
    కరుణాకరు భక్త హితుని కడు భక్తిమెయిన్
    నిరతము మరవక శశిశే
    ఖర పదము పరిగ్రహించ కననగు ముక్తిన్

    రిప్లయితొలగించండి

  14. మల్లెల వారి పూరణలు
    వరమగు తారక మ౦త్రము
    మరువని అంజన తనయుని మనమున దలపన్
    పరుగిడు భూతాల్కపిశే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్.
    2.ధరనటు ధర్మము తప్పక
    నరుడై జన్మించి తాను నణచెను నసురున్
    దురమున నా యినకులశే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్.
    3.పరుగిడు నెపుడును నర్కుడు
    నిరతము వెదజల్లి కాంతి నింగిని నేలన్
    దురితపు సాక్షై గ్రహశే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్.

    రిప్లయితొలగించండి
  15. మల్లెల వారి పూరణాలు

    అరయగ హస్తియు, కాళము
    పురుగా సాలీడు ముక్తి పొందరె కొలువన్
    ఎరుకయె లేకను, శశిశే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్

    విరివిగ పాపము జేసిన
    నరుడా గుణనిధి యె దీప, నైవేద్యములన్
    అరయడె ముక్తిన్ ప్రమథ శి
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్

    తిరముగ వెన్నెల దొంగను
    వరమౌ నటులా వనితల వసనపు చోరున్
    పరమగు బృందావనశే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్

    సిరియాళుడు తా భక్తుడు
    తిరమే కానట్టి తనువు తేకువవిడడే
    పరమని మది గంగా శే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్

    రిప్లయితొలగించండి
  16. ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్.చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఏడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. నిన్నటి పూరణ :
    శివుని సన్నిధిఁ గనుమూయ శ్రేయ మనుచు
    కాశి కేగిన , వానికి కలుగు మిత్తి
    దిక్కు మొక్కు లేని యడవిఁ జిక్కి స్రుక్క
    కఠలు కావవి విధిలీలఁ గనెడు వ్యథలు

    నేటి ఫూరణ :
    నిరతము హరి నామంబును
    గురుతుగ భజియించు భీష్మ కురువృద్ధుడినే
    దరిజేర్చెగదే! గుణశే
    ఖర పదము పరిగ్రహించి కననగు ముక్తిన్ !

    రిప్లయితొలగించండి
  18. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్కారములు.

    ధర నుత్తమ భక్తజనులు
    స్మరహర, పురహర, మలహర, సర్వేశ్వర, శం
    కర, విషధర, హిమకరశే
    ఖర పదము పరిగ్రహించి కననగు ముక్తిన్!

    రిప్లయితొలగించండి
  19. సహదేవుడు గారూ,
    నిన్నటి సమస్యకు మీ పూరణ, ఈనాటి పూరణ రెండూ బాగున్నవి. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. హరహర యని ప్రార్ధించిన
    పరమేశ్వరుని కృపతోడ బాధలువాయున్
    నరులెల్లరునా శశిశే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్

    రిప్లయితొలగించండి
  21. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. అరచుచు కరచుచు తరచుగ
    మరచుచు మన్నించుచుండు మహనీయుండా
    వరపుత్రుడు కలువల శే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్

    రిప్లయితొలగించండి


  23. వరము తెలుంగు మహా సభ
    లు! రవము శంఖా రవమ్ములు సుమ! జిలేబీ,
    సిరి! కల్వకుంట సుమ! శే
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. బరువులు మోయుచు నెత్తిని
    పరుగులనిక మాని నీవు పట్టగ మోడిన్
    వరమగు కాంగ్రెసు నేతది
    ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్

    రిప్లయితొలగించండి