10, జులై 2014, గురువారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 25

అష్టవిధకందము.

రామాయణము-
ద్రుమములఁ గరులనుఁ వెలికుసు
మములను ఘనతఁ గుశలతను మఱి మఱి కనుచున్
సమరహితరమను ఖలముల
గుములయి తనిసి రతులితులు గురుమతివినుతుల్. (౪౦)

భారతము-
వెలికుసుమములను ఘనతఁ గు
శలతను మఱి మఱి కనుచును సమరహితరమన్
ఖలముల గుములయి తనిసి ర
తులితులు గురుమతి వినుతులు ద్రుమములఁ గరులన్. (౪౦)

టీక- సులభము. ఇట్లే “ఘనతఁ గుశలతనునుండి, “మఱి మఱి కనుచును నుండి “సమరహితమను నుండి, “ఖలముల గుములయి నుండి, “తనిసి రతులితులు నుండి, “గురుమతి వినుతులు నుండి చదువ వచ్చును. అప్పకవీయమున నష్టవిధకందమున కీయబడిన లక్ష్యప్రకారము, “కనుచున్- కనుచును గాను, రమన్- రమను గాను, గుములై- గుములయి గాను, వినుతుల్- వినుతులు గాను రావచ్చును.
ద్రుమముల = చెట్లను; వెలి కుసుమములు = తెల్లని పుష్పములు; ఖలము = చోటు.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి