16, జులై 2014, బుధవారం

సమస్యా పూరణం – 1475 (కామక్రోధములు దెలియ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కామక్రోధములు దెలియఁగా సద్గుణముల్.

20 కామెంట్‌లు:

  1. క్షేమము గాదట మనిషికి
    కామ క్రోధములు , దెలియగా సద్గుణముల్
    నీమము వీడక దేవుని
    ధామము నందుండు శాంతి తన్మయ మొందన్

    రిప్లయితొలగించండి
  2. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కామము సంఘ క్షేమము
    కైమన్యువు దండనిడగ కాపురుషులకున్
    ప్రేమలు పెంచగ జగతిని
    కామక్రోధములు తెలియగా సద్గుణముల్

    రిప్లయితొలగించండి
  3. తామసమునందు క్రోధము
    కామము శాశ్వత విశుద్ధ ధామముజేరన్
    క్షేమము షడ్రిపు ఘర్షణ
    కామక్రోధములు దెలియఁగా సద్గుణముల్

    రిప్లయితొలగించండి
  4. ఏమనిషినైన చెఱచును
    కామక్రోధములు, దెలియగా సద్గుణముల్
    క్షేమము గలుగ జేయును
    సామము తోడను మెలగిన సౌఖ్యము లబ్బున్

    రిప్లయితొలగించండి
  5. మల్లెల వారిపూరణలు
    తామటు నింద్రియములపై
    వేమరి నిగ్రహము జూప విజ్ఞత తోడన్
    నీమముగా విడువగ నా
    కామక్రోధములు తెలియగా సద్గుణముల్
    2.భూమిని మానవు లందరు
    కామము నాదిగ గుణములు కలిగియు నుండన్
    క్షేమము ధర్మము మీరని
    కామక్రోధములు తెలియగా సద్గుణముల్
    3.భీమపు విద్యల నందగ
    తామటు వాదన విజయము ధారుణి నందన్
    వేమరి మెలగగ నుండన్
    కామక్రోధములు తెలియగా సద్గుణముల్

    రిప్లయితొలగించండి
  6. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో ఒక లఘువు తక్కువౌతున్నది. బహుశా టైపాటు కావచ్చు. ‘క్షేమమ్ము’ అంటే సరి!
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. క్షేమంబగు విడిచినచో
    కామ క్రోధములు, దెలియగా సద్గుణముల్
    ప్రేమును పెంచును భువిలో
    కామిత మీడేర్చి జనుల కలతలు బాపున్

    రిప్లయితొలగించండి
  8. పామరుల పతన కరణము
    కామ క్రోధములు దెలియగా , సద్గుణముల్
    క్షేమమునకు కారణమౌ
    నీ మర్మము దెలిసి నడువు మిమ్మహి మిత్రా!

    రిప్లయితొలగించండి
  9. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. ఈమహినదుర్గుణములుగ
    కామక్రోధములు దెలియఁగా, సద్గుణముల్
    ప్రేమా, కారుణ్యములును
    క్షమా, దానగుణములని చాటగ వచ్చున్

    రిప్లయితొలగించండి
  11. నిన్నటి సమస్యకు చంద్రమౌళి రామారావు గారి పూరణ :
    విశ్వరూపంబుఁ దాలిచి వివిధ గతుల
    వెంటబడుచుగ్ర కాముక వేషమెత్తు
    నంగనాజీవ కబళనాయత్త కలుష
    హరిని హరియింప వరియించె హరిని హరిణ

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఈ మహిని’ అనండి. ‘ప్రేమా, క్షమా’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. అందులోను నాల్గవ పాదంలో గణం తప్పింది. ‘ప్రేమయు... క్షమయును’ అనండి.
    *
    చంద్రమౌళి రామారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  13. ఈ మహిని మనిషి లోపల
    నీమంబుననున్న గాని నిక్కుచు నుండున్
    క్షేమంబు నెరుగ నణగును
    కామక్రోధములు, తెలియగా సద్గుణముల్

    రిప్లయితొలగించండి
  14. భామా రావణు నణచెను
    కామక్రోధములు దెలియఁగా దుర్గుణముల్
    భూమిని నయమున ముడివడ
    కామక్రోధములు దెలియఁగా సద్గుణముల్.

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. ఈ మనుజుల దుర్గుణములె
    కామ క్రోధములు; దెలియగా సద్గుణముల్
    నీమము శాంతము క్షమయును
    ప్రేముడి సహజీవనమ్ము పెంచును ఘనతన్

    రిప్లయితొలగించండి
  17. ధన్యవాదములు మాష్టారు! కార్యాలయమున విరామసమయములో తొందరలో తప్పులు దొర్లినవి. సవరించిన పద్యము :
    ఈమహిని దుర్గుణములుగ
    కామక్రోధములు దెలియఁగా, సద్గుణముల్
    ప్రేమయు , శాంతము, దయ, ని
    ష్కామము, సహనంబులనుచు చాటిరి విబుధుల్

    రిప్లయితొలగించండి
  18. ఏమని చెప్పుదు ధరణిని
    యేమఱచెడు దొంగనెప్డు హేలగ రాజుల్
    నేమముఁ దప్పక జూడరె?
    కామక్రోధములు దెలియఁగా సద్గుణముల్.

    రిప్లయితొలగించండి
  19. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. రాముని నామము దెలియగ
    పామరుడే యోగి వోలె పరివర్తనుడౌ;
    ధీమంతునకౌను గదా
    కామక్రోధములు, దెలియఁగా, సద్గుణముల్

    రిప్లయితొలగించండి