రామాయణము-
చం. అనిపె వశిష్ఠసద్(ద్విజునికై;
సమయ మ్మొకవేళ దప్ప)కా
యన కనె స్వేచ్ఛ నా(విజయుఁ; డగ్రజసమ్మతిఁ బ్రీతిభూమి)జే
శునిఁ గొనితెమ్మనెం (దనరి శుభ్రత నేడు; ప్రదక్షిణించి)
బం
టును రఘురాముతో (గరిమనున్ మరలం జనె గార మెచ్చఁ)గన్.
(౫౫)
భారతము-
గీ. ద్విజునికై సమయ మ్మొకవేళఁ
దప్ప,
విజయుఁ డగ్రజసమ్మతిఁ బ్రీతి భూమిఁ
దనరి శుభ్రత నేఁడు ప్రదక్షిణించి
గరిమనున్ మరలం జనె గారమెచ్చ. (౫౫)
టీక- సమయము = (రా) కాలము, (భా) ఒడంబడిక; విజయుఁడు = (రా) జయశీలుఁడు, (భా)
అర్జునుఁడు; అగ్రజసమ్మతి = (రా) బ్రాహ్మణుఁడగు వశిష్ఠుని సమ్మతిని, (భా) అన్నయగు ధర్మరాజు
సమ్మతిని; నేడు = (రా) రాజు, ఏడు = (భా) వత్సరము; భూమిజేశుని = రాముని; గారము = ప్రేమ;
ఎచ్చన్ = హెచ్చగ.
రావిపాటి లక్ష్మీనారాయణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి